26, డిసెంబర్ 2010, ఆదివారం

షెహనాయి

Posted by Picasa తన షెహనాయి వాయిద్యంతో నిత్యం..కాశీ విశ్వేశురుడిని మేలుకొలిపే ఆ మధుర స్వరం స్వర ఝరీ ప్రవాహమై.. బిస్స్మిల్లా ఖాన్ షెహనాయి తెలుగు పాటలో వింటే ఎలా ఉంటుంది! అవ్యక్తమైన భావంతో హృదయం రస డోలికలలో తేలియాడుతుంది.. ఆ పాట గురించి నేను చెప్పబోతున్నాను. తన షెహనాయి వాయిద్యంతో నిత్యం కాశీ విశ్వేశురుడిని మేలుకొలిపే ఆ మధుర స్వరంస్వర ఝరీ ప్రవాహమై ఈ పుణ్యభూమిని దాటి మరీ విశ్వమంతా స్వర విహారం చేసింది. తలుచుకుంటేనే ఘనమైన భావన.ఉత్తుంగ తరంగమై నన్ను తడిపేస్తుంది. సంగీతం సర్వజన సమ్మోహితం. భాషతో పనిలేకుండా హృదయ భాషతో జగత్తుని చుట్టి వస్తుంది. ఈ షెహనాయి అలాగే చుట్టేసి లోకాన్ని తన వైపు లాగేసింది.. ఉస్తాద్ బిస్స్మిల్లా ఖాన్ అంటే తెలియని వారు ఉండరేమో! ఎన్ని పెళ్లి పందిళ్ళలో స్వరం సాక్షిగా ఎందరో స్త్రీ-పురుషులని ఒకటి చేసింది. ఒక ఘనత, అదృష్టం మాత్రం జీ.కే. వెంకటేష్ గారికి దక్కింది. బిస్స్మిల్లాఖాన్ గారి షెహనాయి మన తెలుగు సినిమా సన్నాయి అప్పన్న చిత్రంలో వినే అదృష్టం కల్గింది.. సన్నాయి రాగానికి ఈ చిన్నారి నాట్యానికి పాటలో వినవచ్చు. బిస్స్మిల్లా ఖాన్ గారు ఎన్నో హిందీ చిత్రాలలో వారి స్వరాన్ని అందించారు. ఇక్కడ ఆ పాటని వినండి. ఇనుస్త్రుమేంట్ మ్యూజిక్ ని ముంబై వి.బి.ఎస్. అప్పుడప్పుడు స్వరసుధ లో వినిపిస్తుంది. జాతికి గర్వ కారణమైన ఆ ఉస్తాద్.. మన మనసులని రాగరంజితం చేసి వారసత్వ సంపదగా ఆ సంగీతాన్ని మనకి మిగిల్చి వెళ్లారు. అక్కడ పరమేశ్వరుడిని నిత్యం తన మదుర స్వరంతో అర్పిస్తూ ఉండి ఉంటారు. పూర్వ జన్మలో పరమేశ్వరుడికి తేనియతో అభిషేకం చేస్తే మంచి సంగీత జ్ఞానం లభిస్తుందట. చెరుకు రసంతో అభిషేకిస్తే మంచి స్వరం లబిస్తుందట. మా నానమ్మ చెప్పేది. ఇప్పుడు నేను అదే రీతిన చేస్తుంటా ఆశతో.. ఈ రోజు పొద్దు పొద్దుటే ఆ స్వరం నాలో మెదిలి ఇలా నాతో ఈ పాటని పంచే పనికి ఉసికొల్పింది ఈ పాట సాహిత్యం ఇవ్వలేను. ఎందుకంటే నా కంప్యూటర్ పరిజ్ఞానం గురుముఖ విద్య కాదు. స్వయంగా కుస్తీలు పట్టి నేర్చుకుంటున్నాను. ఇంగ్లీష్ కూడా రాదు పాటని జత చేసే పరిజ్ఞానం పెంపొందించుకుని అప్పుడు జత పరుస్తాను. సన్నాయి అప్పన్న చిత్రంలో ఈ పాటని వినండి. స్వర్గీయ బిస్మిల్లాఖాన్ కి స్వర నీరాజనాన్ని హృదయ చెమరింత్లతో చెప్పడం మరువ వద్దు. హృదయాన్ని తుత్తినియలు చేసే సంగీతమా నీ ఒడి అమ్మ ఒడి కన్నా. చల్లన మాతృభాష కన్నా తీయన. గుండెని పిండేసే మధుర భావన. నిత్యం నీలో కరగనీ కరిగి కరిగి ఈ నదీనదాల్లో ప్రవహించననీ మళ్ళీ జన్మ ఉంటే ఈ నేలపైనే జన్మించనీయి! ఇది ఆ ఉస్తాద్ మనసులోని భావన. ఈ పాటని వారికి స్వరనీరాజనం తో అర్పించి మనసారా ప్రణమిల్లుదాం. .

కామెంట్‌లు లేవు: