17, జూన్ 2011, శుక్రవారం

ఇది ఒక విష వలయం

నేను ఈ రోజు ఈ పోస్ట్ వేయడానికి  మొదట  కొద్దిగా తటపటాయించాను.కానీ మన కళ్ళ ముందు చాలా నిశ్శబ్దంగా..చాప క్రింద నీరులా.. మన పిల్లల  తరాన్ని కబళిస్తుంటే  .. చూస్తూ..ఊరకుండలేక.. ఓ..మిత్రురాలి సలహా తీసుకుని ..గో..ఏ.హెడ్ ..అనిపించుకుని మరీ వ్రాస్తున్నాను. 

అశ్లీల సాహిత్యం అంటేనే.. ఏమిటో తెలియని కాలంలో సాహిత్యం తో పరిచయం ఏర్పరచుకుని తర్వాత తర్వాత అశ్లీల సాహిత్యం అర్ధం తెలుసుకుని ఇలా కూడా..ఉంటాయా? అనుకునే వాళ్ళం. దొంగ తనంగా ఆ పుస్తకాలని కొని చదువుకునే  బాధని  తప్పించి కొన్ని వార పత్రికలలో..సరసమైన కధలు.. అలాగే..శృంగార రసాన్ని  దట్టించి కధల కథలుగా వర్ణించే సీరియల్స్ ని అందించడం వల్ల అందరికి ఆ సాహిత్యాన్ని దగ్గర చేస్తే.. ఇక ఆ అశ్లీల సాహిత్యం  ఎందుకు ? ఇదే బాగుంది! అని చదవడంకి దగ్గరైన ఆ కాలంలో ఇదొక రకమైన అశ్లీల సాహిత్యం అనే విమర్శకుల వ్యాఖ్యలు..అన్నీ చూస్తూ సెక్స్ సమస్యలు చదువుతూ సాగిన వాళ్ళం అందరం.

మేము  అసలు చదవలేదు అనుకున్న వాళ్ళు ఉంటారు అనుకోండి. అది వేరే విషయం .అది అప్రస్తుతం కూడా..ఇప్పుడు.  

ఈ కాలం పిల్లలకి పెద్దలకి.. అశ్లీల సాహిత్యం చదవాల్సిన అవసరం అంతగా లేదు.కారు చవకగా..చిత్రాలు లభిస్తున్నాయి. "వాత్శాయన కామసూత్రాలు" పుస్తకం చదవడమా?  ఛీ..పాడు అనుకున్న తరం వారి పిల్లలు.. ఈ రోజుల్లో..స్వేచ్చగా  సైబెర్ కేఫ్ కి వెళ్లి గంటల తరబడి అశ్లీల చిత్రాలు చూస్తూ ఉన్నారు. ఇది అంతా టెక్నాలజీ మహిమ. పోర్నోగ్రపి బారిన పడి..నాశనమవుతున్న పిల్లలను చూస్తూ..ఊరుకుందామా?  

 ఇప్పుడు కంప్యూటర్  విద్య  తప్పని సరి అయింది.ప్రతి ఇంట్లో..ఇంటర్నెట్ కనక్షన్ లేక పోవచ్చు.కానీ ఒక మాదిరి ఊర్లో కూడా..నెట్ సెంటర్ లు..ఉంటున్నాయి. గంటకి పది రూపాయలు ఇస్తే ఇష్టానుసారం..యదేచ్చగా వారి లోకంలో..వాళ్ళు  విహరిస్తూ ఉంటారు.

ప్రక్క వారు చూడ కుండా ప్రత్యేక  కాబిన్ లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక బాగా మారు మూల ప్రాంతాల్లో..కూడా.. డిష్ కనక్షన్ ఉండటం ..అక్కడ కూడా  కొన్ని చానల్స్ లో  అర్ధరాత్రి..వచ్చే కార్య క్రమాలు, అశ్లీల చిత్రాలు.. వెరసి.. 10 సంవత్సరాలు పిల్లలు కూడా ఆ..చిత్రాలు చూడటానికి..అలవాటు పడుతున్నారు. అమ్మ నాన్న పనికి వెళితే.. బడి నుండి మద్యాహ్నం అన్నం  తినడానికి వచ్చి ఆ చానల్స్ చూసే పిల్లలు..పల్లెటూల్లలో..ఉన్నారంటే..ఆశ్చర్య పోవద్దు. వాళ్ళే తమ తోటి ఆడపిల్లల పై..అఘాయిత్యాలకి పూనుకుంటున్నారు అనేది వాస్తవం.

ఈ రోజుల్లో కాలేజ్ లో అడుగుపెట్టిన ప్రతి అమ్మాయి అబ్బాయి దగ్గర సెల్ పోన్  ఉంటుంది.. అలాగే..చదువు సంద్యలు అబ్బక చేతి పనులు చేసుకునే.. యువత  దగ్గర సెల్ పోన్లు ఉంటున్నాయి. వినోదం  కోసం  పాటలుకి  మాత్రమే  పరిమితమయ్యాయి అనుకున్న మెమరి కార్డ్  లు.. శృంగార చిత్రాలు ని భద్ర పరచుకుని.. యదేచ్చగా..చూస్తూ.. కనపడ్డ ప్రతి స్త్రీని కామ దృష్టి తో.. చూడటం, వెకిలి చేష్టలు చేయడం, లైంగిక నేరాలు చేయడానికి పూనుకోవడం చేస్తున్నారు.

పోర్నోగ్రఫి   ఇలా.. విచ్చల విడిగా రాజ్యమేలుతుంటే..ఇది టెక్నాలజీ విప్లవం అందామా? 


ప్రతి విషయం లోను మంచి-చెడు రెండు ఉంటాయి. చెడుకి..ఆకర్షితమైనంత త్వరగా.. మంచిని..అలవర్చుకోవడం లేదు. ఇక విజ్ఞానం వంట బట్టించుకున్న వారు కూడా.. సైబర్ సెక్స్ కి..అలవాటు పడి.. అదే పనిగా ఆ చిత్రాలు చూస్తూ..దాంపత్య జీవితంలో.. మధురిమలని కోల్పోతున్నారు.  ఒక ఏం. బి.ఏ చదివిన అమ్మాయి.. సరియిన వరుణ్ణి  ఎంపిక చేసుకోలేక సైబర్ సెక్స్ కి అలవాటు పడి తర్వాత పెళ్లి చేసుకున్నావివాహ జీవితంలో ఇమడలేక తిరిగి  భర్త మీద ఆరోపణలతో కోర్ట్ కి  వెళ్లి నీలి చిత్రాల ఆస్వాదనలో జీవితాన్ని.విషవలయం చేసుకొనడం వెనుక కారణం ఇదే!.


మా బంధువుల  అమ్మాయి ఒకరు నార్త్ లో ఉంటారు.ఆమె,ఆమె  భర్త ఇద్దరు   ఉద్యోగాలకి  ..వెళ్లి పోతారు.ఇంట్లో ఇంటర్నెట్ కనక్షన్ ఉంది. ఇద్దరు మగ పిల్లలు. ఒక అబ్బాయికి.. మద్యాహ్నం వరకే తరగతులు. ఇంకో ఆబ్బాయి.. ఇంజినీరింగ్ విద్యకి.. మన రాష్ట్రం వచ్చి అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకుంటున్నాడు. రెండో  అబ్బాయిని కూడా ఇక్కడికే తీసుకు వచ్చారు.   "అక్కడ చదువు బాగుంటాయి కదా అయినా  ఉన్న ఇద్దరు పిల్లలు దూరంగా ఉంటె తల్లిదండ్రులకి..వెలితి కాదు" ..అని అడిగితే స్కూల్ నుండి ఇంటికి వచ్చి  అదే పనిగా ఆ నీలి చిత్రాలే  చూస్తూ ఉంటాడు  ఒంటరిగా ఉంచ కూడదని  అందుకు..తీసుకు వచ్చాం అని చెప్పారు.  

ఇక నా ఫ్రెండ్ ఒకరు.. పిల్లల గొడవ భరించలేక సిస్టం కొని ఇంటర్ నెట్ కనక్షన్ పెట్టించారు. హాల్లో సిస్టం పెట్టారు.
సౌకర్యంగా లేదు కదా.. పిల్లల రూమ్లో పెట్టే పని అంటే అక్కడ వాళ్ళు ఏం చూస్తున్నారో తెలియదు.ఇక్కడైతే అటు వెళుతూ  ఇటు వెళుతూ  గమనించ వచ్చు అని  అంటే నేను ఖంగు తిన్నాను. పిల్లలని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో అర్ధమైంది.


మద్య తరగతి జీవన శైలి లో కూడా..పడక గదులు వేరువేరు అయిపోయాక  ఆధునిక జీవన సరళిలో.. పిల్లలు ఏం చేస్తున్నారో..గమనించడం కష్టమైపోయింది.గుంటూరు పట్టణం లో.. ఒక నెట్ సెంటర్ లో..ఒక అమ్మాయికి..ఎదురైన అనుభవం.. మనకి..పత్రికా ముఖంగా..తెలిసిందే!

 లైంగిక విద్య పేరిట పిల్లలకి..అవగాహన పేరిట పిల్లలకి.. స్కూల్ స్థాయి లోనే అన్ని తెలుసు. కానీ సరి అయిన అవగాహన రాక లైంగిక నేరాలు,ప్రేమ కలాపాలు ఎక్కువయ్యాయి... ఇన్ని పోకడల మద్య పిల్లలని కాపాడుకోవడం, మంచిని నేర్పడం,  మంచి తల్లిదండ్రులు అనిపించుకోవడం ఎంత కష్టం చెప్పండి. పెడదారి పడుతున్న పిల్లలని ఎలా కాపాడుకోవడం? ఇలా ఉంటాయని తెలియని వేల మంది  తల్లిదండ్రులు ఉంటారు.

 ఇది ఒక విష వలయం. చెడుని  గమనిస్తూ మన పిల్లలు..చెడు వైపు..ఆకర్షింప బడకుండా కాపాడుకోవడం కూడా ఓ పెద్ద భాద్యత. ఏమంటారు? 


మొన్నటికి మొన్న తిరుపతి వేద పాఠశాలలో..మెమరీ కార్డు ల  సాక్షిగా ఏం జరుగుతుందో..మనమందరం చూసాం. బహుశా ఇలాటివి జరుగుతున్నాయని.. ఇలా ఉంటుందని తెలియని వారికి కూడా తెలియజేసింది..ఈ సంఘటన. మన పిల్లలు ఇలా చూస్తారని కలలో కూడా  పెద్దలు భావించరు.ఒకవేళ  తెలిసినా  గోప్యం గా,చిన్నతనం గ భావించడం వల్ల  వారికి..అందువల్ల జరిగే అనర్ధం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇలాటి జాడ్యం వల్ల పిల్లల వికాసం లో మార్పు వస్తుంది. 

జాగ్రత్త పడటం అని కాదు కానీ..మన పిల్లల   సెల్ పోన్ లు వాళ్ళకి తెలియ కుండా చెక్  చేయడం లాటి సి.ఐ.డి పనులు చేయాలి.టి వి  లో అయితే అలా అశ్లీల చిత్రాలు  వచ్చే చానల్స్ ని బ్లాకు చేయవచ్చు. ఇంకా కాలేజెస్ లో.. కౌన్సిలింగ్ తరగతులు పెట్టాలని  సూచించాలి. పర్సనాలిటి డెవలప్మెంట్ కోర్సులు  ఎలా ఉంటాయో..అలాగే యువతకి సెక్స్ ఎడ్యుకేషన్  పై...తరగతులు నిర్వహిస్తున్నారు. అక్కడికి పంపవచ్చు.  రకరకాల జాడ్యాల నుండి పిల్లలని కాపాడుకోవాలంటే తల్లిదండ్రులు పిల్లలకి..స్నేహితుని లెక్క కావాలని, ఉండాలని అన్నమాట.

ముందు సినిమాలని బాన్ చేస్తే పోలా? అని నా స్నేహితురాలు..నొక్కి వక్కాణించింది  .

అవును..అక్కడ ఏమైనా తక్కువా..ఏమిటి..?    .    .         

10 కామెంట్‌లు:

Raj చెప్పారు...

చాలా చక్కగా వివరముగా చెప్పారండీ.. మీరు ఇందులో Ph.D చేసినట్లుగా చెప్పారు. బాగుంది..కీప్ ఇట్ అప్.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ధన్యవాదములు రాజ్ గారు. మంచి పౌరులని అందించాల్సిన భాద్యత కల తల్లిదండ్రులు చాలా అంశాలపై Ph.D చేయాల్సినంతగా సామాజిక రుగ్మతలు ఉన్నందున బాగా వివరంగా వ్రాయటానికి ప్రయత్నిస్తున్నాను. కొంతమందినైనా ఆలోచింప చేయాలని నా ప్రయత్నం.మీకు నచ్చినందుకు ధన్యవాదములు

Pranav Ainavolu చెప్పారు...

చాలా మంచి విషయాన్ని ఎంచుకున్నారు. మంచి అనడం కంటే ఇప్పుడు అవసరమైన విషయం అనడం కరెక్తెమో. 'ఇప్పుడు' అనడం ఎందుకంటే ఇంటర్నెట్ చీప్ ప్యాకేజీలతో మారుమూల గ్రామాలకీ, సెల్ ఫోన్లలోకి, విద్యార్థుల హాస్టల్ రూంలలోకి చొరబడుతున్నది ఇప్పుడే కాబట్టి.
టెక్నాలజీ బాగుపడటానికి ఎంత సహకరిస్తుందో చెడిపోవడానికి అంతకంటే ఎక్కువ తోడ్పడుతుంది.
పిల్లలు ఇలా కావడానికి మారిన మన జీవన విధానం కూడా ఒక కారణం కావొచ్చు. ఇద్దరూ ఉద్యోగస్తులు కావడం ఇంకో కారణం. కొంచం కూడా సమయం దొరకని జీవన వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా ఉన్న తల్లిదండ్రులు పిల్లలకు మంచి సూట్లు, బూట్లు, కాన్వెంటు చదువులు ఇవ్వగలుగుతున్నారే తప్ప వారికి ఇవ్వవలసిన ప్రేమ, వారిపై ఉంచవలసిన దృష్టి అవసరమైనంత మేరకు ఉంచలేకపోతున్నారు.
పిల్లలు అల్లరి చేయకుండా ఉండడానికి వారిని టి‌విల ముందు, కంప్యూటర్ల ముందు కూర్చోబెట్టడంతో వారు అనుకోకుండానో, కావలనో చూడకూడనివి చూసి వాటికి ఆకర్షితులై చెడు వ్యసనాలకు లోనౌతున్నారు.

కాబట్టి మార్పు పిల్లల్లో కాదు ముందు తల్లిదండ్రుల్లో రావాలి అని నేను అంటాను. రోజూ కాస్త సమయం కేటాయించి వారికి మంచి విషయాలు అర్ధమయ్యేలా చెప్పి మంచి ఆలోచనా వైఖరిని అలవరచుకునేలా చేయాలి. అలా చేయలేకపోతే సమాజంలో ఒక చీడపురుగును వాదులుతున్నాం అనే భావన కలగాలి వాళ్ళలో.

చదువుకంటే సంస్కారం ముఖ్యం! నేడు చదువుకున్నవాళ్ళలో కూడా ఆలోచనలు చాలా చావకబారుగా ఉంటున్నాయి.
ఆడది కనిపిస్తే పాపం.. ఆ ఆలోచనలు, వర్ణనల ముందు కీచకులు, సైంధవులు సైతం ఎందుకూ పనికిరారు.

సమాజానికి అవసరమైన విషయాలు ఎంచుకుంటున్నందుకు హృదయపూర్వక అభినందనలు!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ధన్యవాదములు ప్రణవ్ గారు. మన చుట్టూ ఉన్నసమస్యల తీవ్రతని గుర్తించమని, కొంత మందినైన ఆలోచింప చేసేటట్లు.. సమకాలీన సమస్యలని ఎన్నుకుని బ్లాగ్ ముఖం గా వెల్లడిస్తున్నాను. మీకు నచ్చినందుకు ధన్యవాదములు...

buddhamurali చెప్పారు...

పిల్లల మీద నిఘా అని కాదండి . చుట్టూ సమాజం అలా ఉంది కాబట్టి మనం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి . పిల్లలు బయటకు వెళితే ఫోన్ చేసి పలకరిస్తుండాలి

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మురళి గారు.. ధన్యవాదములు..మనం పిల్లలతో..ఎప్పుడు సంభాషించామో..అప్పుడు వారిలో.. అంతర్లీనంగా ఒక కాన్పిడెంట్ లెవెల్ ఇన్ క్రీజ్ అవుతుంది. ఒక చెడు ప్రభావం దరి చేర కుండా కాపాడగల్గుతుంది. మాట మనుషుల మద్య వంతెన కదా!.

డా.పోట్లూరి పద్మావతి శర్మ చెప్పారు...

వనజగారు,మీ అభిప్రాయం చాల బాగుంది .పిల్లలే కాదు పెద్దలు (50 పైబడినవారు ) కూడా చెడిపోతున్నారు.

kasturi చెప్పారు...

వనజగారు మీరు వ్రాసిన వ్యాసం బాగుంది

SRINIVASA RAO చెప్పారు...

చాలా బాగా చెప్పారు.....ఖచ్చితంగా జరుగుతున్నవి కళ్ళ ముందు చూపారు.డిటెక్టివ్ పుస్తాకాలు దాచుకుని చదివినా రోజులు గుర్తుకు వచ్చాయి..అవి చిదివితేనే నేరంలా ఉండేది.

SRINIVASA RAO చెప్పారు...

ఓక్కొక్కసారి నాకు అనిపిస్తుంది...తప్పెవరిది? ఈ అసభ్యకరమయినా విషయాలు గదులకు.సైబర్ కేఫ్ లకు పరిమితం కాకుండా బహిరంగంగా...మెట్రో ట్రయిన్,ఫ్లాట్ ఫార్మ్,చూస్తున్నప్పుదు చెంప చెళ్ళు మనిపించాలని అనిపిష్తుంది.దౌర్భాగ్యం ఎమిటంటంటే,మా కొలిగ్ ఒకరు ఆఫీస్ కు వచ్చె డ్రెస్స్ సెన్స్ చూస్తె...ఆ పిల్ల తల్లికి భాధ్యత లేదంటరా?అసలు తన కూతురు ఇలాంటి డ్రెస్ లొ ఆఫీసు కు వెలుతుందా?లేక..మరి......అని.....?తల్లి అనే పదానికి తలవంపులు తెచ్చే ఇలాంటి తల్లులు చలామంది ఉన్నరు.వనజా గారు .