3, ఏప్రిల్ 2012, మంగళవారం

మేఘసందేశం లో లేనిపాట

ఈ రోజు స్టన్నింగ్ బ్యూటి..జయప్రద పుట్టిన రోజు. ఆమె నా అభిమాన నాయకి. ఆమె నటించిన ప్రతి చిత్రం..నాకు చాలా ఇష్టం.
భారతీయ చలన చిత్రసీమలోనే అపురూప సౌందర్య రాశిగా సత్యజిత్ రే తో పొగడబడ్డ ..ఆమె అందం.. నిజంగా  అద్భుత   సౌదంర్యమే!
ఆమె నటనా పటిమను గుర్తు తెచ్చుకుంటూ.. ఆమె నటించిన మేఘసందేశం చిత్రంలో .. పాట.
అయితే ఈ పాట ని ఆ చిత్రంలో మనం చూడలేము.

ఈ పాట సాహిత్యం దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు.

శీత వేళ రానీయకు రానీయకు
శిశిరానికి చోటీయకు చోటీయకు (శీ)
ఎద లోపల పూలకారు ఏనాటికి పోనీయకు (శీ)
ఉగ్రమైన వేసంగి గాడ్పులు
ఆగ్రహించి పైబడిన ఆదరిపోవకు(ఉగ్ర)
ఊకుమ్మడిగా వర్షమేఘం
వెక్కి వెక్కి రోదించినా లెక్కజేయకు లెక్కజేయకు
శీత వేళ రానీయకు రానీయకు
శిశిరానికి చోటీయకు చోటీయకు

చైత్రంలో పొగరెక్కిన కొత్త కోర్కెలు
శరత్తులో కైపెక్కిన తీయని కలలు(చై)
మనసారా తీర్చుకో మనుగడ పండించుకో
లోకానికి పొలిమేరలు నీ లోకం నింపుకో
 శీత వేళ రానీయకు రానీయకు
శిశిరానికి చోటీయకు చోటీయకు

ఉదయంలో మగత నిదుర చెదరి పోయే వేళ
మబ్బులలో ప్రతి తారక మాయమైన వేళ
ముసలితనపు అడుగుల సందడి
ముంగిట వినబడినా (ముసలి)
ఇంట లేడని   చెప్పించు
వీలు కాదని పంపించు వీలు కాదని పంపించు
శీత వేళ రానీయకు రానీయకు
శిశిరానికి చోటీయకు చోటీయకు
ఈ పాటని పాడిన వారు..కే జే ఏసుదాస్,పి.సుశీల.


అమరజీవిలో

సాగర సంగమం లో


ఈ పాటలో జయప్రద,అక్కినేని పై చిత్రించారట.(దాసరి మాటల్లో) కానీ ఎందుకో మనకి చూపబడలేదు.
ఇక్కడ ఆ పాట వినేయండి.
శీత వేళ రానీయకు .. 
ఆరు ఋతువుల ఆమని పాట..కాలానికే కాదు.. జీవితానికి కూడా ప్రతీకే.

మరి ఎందుకో దేవులపల్లి వారు ఈ పాట సాహిత్యంలో  శీత వేళ రానీయకు,శిశిరానికి చోటివ్వ వద్దని, ముసలి తనపు అడుడుగులు వినబడితే.. ఇంట లేడని చెప్పించు అంటూ వ్రాసారు. బహూశా..  మనిషి మానసికంగా నిత్య నూతన యవ్వనోత్శాం  తో మనుగడ సాగించాలనే స్పూర్తిగానేమో..!
ఇదండీ ఈ పాట విశేషం .