22, మే 2012, మంగళవారం

రాజ సూయ యాగము


నా స్నేహితురాలి కూతురు మొన్న ఆదివారం "శ్రీరామరాజ్యం " చిత్రం ని ఆసాంతం ఓపికగా కూర్చుని చూసిందట.

"విశేషమే!అవసరమే కూడా "అన్నాను. అశ్వమేధ యాగం గురించి చెప్పమని అడిగింది అట వాళ్ళ అమ్మని.

ఇప్పుడు చూసావు కదా!ఇంకా నేను చెప్పడం ఏమిటీ!? అంతకన్నా నాకు తెలియదు..వనజ ఆంటీని అడుగు ..అని చెప్పిందట.

ఆ పిల్ల పోన్ చేసి ఆంటీ..అశ్వమేధ యాగం గురించి చెప్పండి.

"చచ్చాను బాబోయి" అనుకున్నాను. ఎందుకంటే నాకు కూడా ఏమీ తెలియదు "రామాయణం" ఇంట్లో లేదు.. భారతం లో దాని గురించిన వివరాలు ఉంటాయి. చూసి చెపుతాను ..అన్నాను.

మెయిల్ చేయండి..ఆంటీ !అని చెప్పింది.

పర్లేదు..విని వదిలేయక కాస్త తలకి ఎక్కించుకుంటుంది అన్నమాట అనుకుని .. ఇంకా ఏమిటీ విశేషాలు? అన్నాను.

మామూలు యూత్ లాగా సినిమా కబుర్లు చెప్పకుండా .. జగన్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని ఎదురు చూస్తున్నాం అంది.

నాకు ఒక షాక్!..ఏమిటీ? ఏమి పట్టనట్టు ఉండే పిల్లలు ఇలా కూడా వేచి చూస్తున్నారా?అని.

సరే... తను అడిగిన విషయం చెప్పడానికి భారతంలో అశ్వ మేధ యాగం తో పాటు..రాజ సూయ యాగం గురించి చూసి తెలుసుకున్నాను.

నేను చదివిన విషయము ఇక్కడ....

ఒకానొక రోజు నారదుడు.. భూలోకమునకి వేంచేసి...యదిష్టురునితో లోక పాలక -బ్రహ్మ-స్వభావ సవ్రూపముల గూర్చిప్రస్తావించుతూ..

యదిష్టురిని కోరిక పై.. సత్య హరిశ్చంద్రుడు గూర్చియు,పాండు రాజు గురించియు చెబుతూ.. "నీ తండ్రి పాండు రాజు హరిశ్చంద్రుడు వైభవాన్ని చూసి ఆశ్చర్య పడి భూలోకానికి వచ్చు చున్న నాకు నమస్కరించి నన్ను ఆపి ..ధర్మజునితో..ఈ మాటలు చెప్పమని కోరినాడు.

నీవు సమర్దుడవు భూలోకమును జయించుట కునూ ,నీ సోదరులునూ సమర్ధులు వారందరూ నీ వశంలో ఉన్నారు. రాజ సూయ యాగం నను స్టింపుమని చెప్పుము. వారు రాజ సూయ యాగం చేసిన యెడల నేను నీ తండ్రినగు నేనును దేవేంద్రుని సభలో చిరకాలము ఉందును అని పాండు రాజు సందేశాన్ని వినిపించి రాజ సూయ యాగం చేయుటకు ప్రోత్సహించినాడు

ఆ యాగము గురించి చెపుతూ.. ఈ యజ్ఞం చాలా విఘ్నములతో గూడి యుండును.యజ్ణ విఘాతకులగు బ్రహ్మ రాక్షసులు యాగంలో జరుగు లోపాలను వెదుకుదురు. .క్షాత్ర వినాశన మగు యుద్ధం కూడా దీని వలన కలుగును.ఇదంతా ఆలోచించి క్షేమమనిపిస్తేనే రాజ సూయ యాగము నాచరింపుము..అని చెప్పెను.

అటు పిమ్మట ధర్మజుడు రాజ సూయ యాగము తలపెట్టేను.

అంతకు ముందు ఆ యాగము ఎవరు చేయగలరో కూడా శ్రీ కృష్ణుడు చెప్పెను.

ఎవడు తలచినదంతా సిద్దిన్చునో..,ఎవడు అన్ని విషయములందు నూ పూజింప బడునో,ఏ రాజు సర్వమునకు అధిపతి యగునో..అట్టి వాడు రాజ సూయ యాగం చేయగలను. ఈ విషయములు ఎరింగి నీవు రాజ సూయ యాగం చేయగలవు అని ఆ పరమాత్ముడు చెప్పగా..

నీవు చేయ మంటే నేను చేయ గలను.వలదు అంటే..చేయలేను అని ధర్మజుడు అనెను.

అప్పుడు పరమాత్మ నీవు రాజసూయ యాగము చేయుటకు అన్నివిధాల అర్హుడవు. ఇంతకూ ముందే సమరాట్ అనిపించు కుంటివి. అయిననూ జరాసంధుని చంపి నటు పిమ్మటనే యాగం చేయ సంకల్పింపు మని జెప్పి జరాసంధుడని చంపుటకు ఉపాయం చెప్పినాడు.

"రాజా రాజ సూయేనా స్వారాజ్య కామోయజేత" అనునది రాజ సూయ విధి వాక్యం.

ఈ యాగమును క్షత్రియ వంశీయుడు -రాజుగా పరిపాలము నందు ఉన్నవాడు ,ఆహితాగ్ని అయినవాడు ఆచరించాలి.

రాజ సూయ యాగం యజ్ణ కాలం మూడు నుండి నాలుగు సంవత్సరముల మధ్య కాలం పట్టును అని చెప్పుట జరిగినది.

ఇక ఈ యజ్ఞం ని ఎవేరెవరు చేసి ఉంటిరి అనగా..

1 చంద్రుడు రాజ సూయ యాగం చేసెను. అది పూర్తి కాగానే "తారాకా మయం "అను పేరున దేవదానవ సంగ్రామము జరిగినది.

2 .వరుణుడు రాజ సూయ యాగం చేయగా సర్వ భూత వినాశాకమగు దేవదానవ మహా సంగ్రామము జరిగినది.

3 హరిశ్చంద్రుడు రాజ సూయ యాగం చేయగా "ఆడీ బకం "అనేపేరు కల క్షత్రీయ నాశనం అయిన యుద్ధం జరిగినది. .

ఇవి అన్నియు తెలిసిన "వ్యాసుడు " ధర్మజుడు రాజ సూయ యాగం చేయ తలపెట్టినప్పుడు ఎందుకు వారింపలేదని "జనమేజయుడు" అడుగుతాడు.

ఆ యాగము చేయుట పరమాత్మ ప్రేరేపితం . యాగము జరిగిన పిమ్మట యోదులందరూ మరణించుట తధ్యమని వారికి తెలియును కదా అంటాడు.

నారద వాచ్చా ప్రేరితుడు అయిన ధర్మజుడు కూడా ధర్మా చరణ నినిష్ట బుద్ది గనుక రాజ సూయ యాగం ఆచరింప తలపెట్టినాడు పైగా తండ్రి యొక్క సందేశం అది కదా!అంటాడు.

రాజ సూయ యాగము జరిగినతీరు..తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ భారతం చదివినవారి కి అన్నీ తెలుసు కదా!

అశ్వమేధ యాగం గురించి చెప్పమంటే.. రాజ సూయ యాగం చెపుతున్నాను అని అనుకుంటున్నారా!?

ఇదంతా నేను ఇప్పుడు ఎందుకు . చెపుతున్నాను అంటే!.నా స్నేహితురాలి కూతురు.. జగన్ అరెస్ట్ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పింది కదా!

అందుకు నాకు ఒక పోలిక ఇందులో కనబడింది.

తండ్రి రాజశేఖరుడి కోరిక మేరకు జగన్ యువరాజు గారు అవినీతి యజ్ఞం చేసాడు.దేశంలో ఎవరు చేయనంత గొప్పగా అన్నమాట. అవినీతి యజ్ఞం చేయమని ప్రోత్సహించినది.సాక్షాత్తు తండ్రి గారే.

చూసి చూడనట్టు ఊరుకుంది.. "సోనియా అమ్మవారే"

అవినీతి యజ్ఞం చేస్తే వచ్చే ఫలితాలు గురించి తెలిసి చెప్పని వారు శ్రేయాభి లాషులు చాలా మంది ఉన్నారు. అయినా హెచ్చరించలేదు.అంటే. జగన్ పతనాన్ని కోరుకున్నారన్నమాట.

ఇక రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో అసువులు బాసేవారు..ఎందరెందరో!అని నాకు అనిపించింది.
ఈ ఆలోచనలో.. నాకు కనబడిన కోణం ఇది.

జగన్ ని తెగిడి..వేరేవారిని పొగడ లేదు.. గమనించి నాపై యుద్ధం చేయవలదని బ్లాగ్మిత్రులకి మనవి..

పనిలో పనిగా ప్రతి ఇంటా.. కొన్ని పుస్తకాలు ఉండాలి.

ఓ..రామాయణ కావ్యం ని,మహా భారతం గ్రంధాన్నికొని పిల్ల చేత చదివించు తల్లీ! అని ..నా స్నేహితురాలికి చెప్పాను.

7 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

మంచి విషయం గురించి వ్రాశారండీ! రాజకీయాల జోలికి నేను పోను కానీ చిన్న విషయం చెప్పదలచాను. రాజు సమస్త రాజులనీ ఓడించి సార్వభౌమత్వాన్ని ప్రకటించేది రాజ సూయం. ఇందులో ముఖ్య విషయం ఏమిటంటే: ఈ యాగం చేసిన వంశంలో ఒకడే చెయ్యాలి. చేసిన వాడు బ్రతికుండగా వేరే ఎవరూ చేయకూడదు అదే వంశమయినా సరే!

జలతారు వెన్నెల చెప్పారు...

అమ్మో! మా ఇంట్లో లేవండి ఆ పుస్తకాలు....oops!

Pranav Ainavolu చెప్పారు...

బాగుంది... :)

అశ్వమేధ యాగం గురించి రామాయణ ప్రవచనంలో చాగంటి కోటేశ్వరరావు గారు చాలా బాగా వివరించారు.
వివరాలు ఈ వెబ్ సైట్ లో ఉన్నాయి -
http://telugu.srichaganti.net/

ఈ కాలం పిల్లలు విని, నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి రామాయణంలో.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రసజ్ఞ .. ఇంకా కొన్ని విషయాలు తెలియజేసావు. ధన్యవాదములు మీకు తెలియని విషయమంటూ ఏమి లేదు. Lol
ఇక పొతే రాజకీయాల పట్ల నాకు అంత ఆసక్తి లేకపోయినా..కొన్ని వద్దన్నా చెవుల్లో పడతాయి. అవినీతి గొంగట్లో తింటూనే రాజకీయ పార్టీలు అన్నీ అవినీతి అవినీతి అంటూ ఉంటారు. నేను ఎవరికి అనుకూలం కాదు. విరోదిని కాదు.ఏదో.. కొంచెం పోలిక కనిపించింది అని అలా చెప్పాను అంతే! థాంక్ యు వేరి మచ్!
@ జలతారు వెన్నెల గారు.. వెబ్సైటు లో లభ్యం అవుతున్నాయి చూడండి. దిగులు వద్దు.ఓకే.నా :)
@pranav ... బహుకాల దర్శనం. బాగున్నారా?థాంక్ యు. మంచి విషయం చెప్పారు.అందుకు మరి మరి ధన్యవాదములు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మంచి విషయాలు చెప్పారండీ..

మా ఇంట్లో మా అత్తగారు,మామగారు,వారి అమ్మగారూ పతి రోజూ విని తీరాల్సిందేనండీ చాగంటి కోటేశ్వరరావు గారి రామాయణం..
అలా మాకు కూడా తెలుస్తుంటాయి అప్పుడప్పుడూ ఇలాంటి విషయాలు..

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఇక్కడో చూపు చూసేయండి
http://madhavaraopabbaraju.wordpress.com/2012/05/12/%E0%B0%A4%E0%B0%BE%E0%B0%A4%E0%B0%95%E0%B1%81-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-%E0%B0%A8%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AE%E0%B0%A8/

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

rajee gaaru..Thank you!
@vijay mohan gaaru..meeru icchina link lo manchi vishayam undi.Thank you very much!