6, మే 2012, ఆదివారం

The Starfish Story

ఒకోకరికి ఒకొక స్ఫూర్తి. చిన్నప్పుడు మనం విన్న కథలు మన మనస్సులో ఒక గాఢ ముద్రని వేసుకుని పోతాయి. మన చుట్టూ ఉన్న సమాజంలో మనకి నిత్యం కనిపించే అనేక సమస్యలని మనం చూసే తీరుని బట్టి కనిపిస్తాయి. మనం చేసే చిరు ప్రయత్నాలు ..కూడా మనలో అంతర్లీనంగా దాగియున్న మన మోటివేషన్ ని ప్రతిబింబిస్తాయి. 

అబ్బ..వచ్చారండి..పెద్ద గొప్ప సంఘ సేవకులు..అని యెగతాళి కి గురి అయినా అది మాత్రం నిజం. ఈ క్రింది కథలో చెప్పినట్లుగా ... 

సముద్రం నుండి అలలతో బయటకి కొట్టుకు వచ్చిన స్టార్ ఫిష్ లని తిరిగి సముద్రంలోకి విసిరి మన వంతుగా వాటిని కాపాడే ప్రయత్నం చేసినట్లే.. మన పరిధిలో ..మనకి చేతనైన విధంగా మనం చేయగలగాలి..అనే స్ఫూర్తి ని అందిస్తుంది. 

ఈ కథని నేను మా ఇంగ్లిష్ సర్ చెపుతుండగా విన్నాను. ఇప్పుడు..గుర్తుకు వచ్చి..ఇలా షేర్ చేసుకోవాలి అనిపించింది.

6 కామెంట్‌లు:

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

“It made a difference for that one.”

మంచి కధను,మాటలను చెప్పారండీ...

"ఒకోకరికి ఒకొక స్ఫూర్తి."
ఎవరేమి అనుకున్నా ఎవరికి స్ఫూర్తి కలిగించేవి
వాళ్ళకి గొప్పే కదండీ..

హితైషి చెప్పారు...

గుడ్. ఇనిస్పిరేషన్ పోస్ట్.అసలు ఇలాటి పోస్ట్ లు వ్రాయాలాని మీకు ఎలా థాట్స్ వస్తాయి.ఆశ్చర్యంగా ఉంటుంది.ఈర్ష్యగా కూడా ఉంటుంది.
నేను ఎగ్జామ్స్ అయి త్వరలోనే వస్తాను. వచ్చి మీకు పోటీ ఇస్తాను.

Hari Podili చెప్పారు...

వ వ గారు,
మీ యొక్క ఆలోచన విధానానికి hatsoff.
మన పరిధిలో ..మనకి చేతనైన విధంగా మనం చేయగలగాలి.
.ఒకవేళ చేయలేకపోయిన, కీడు చేయకున్డా ఉంటె అదే పదివేలు. కీడు చేయకపోవడం కూడా help చేసినట్లే!
కదండి.మీరేమంటారు?

జలతారు వెన్నెల చెప్పారు...

Nice one vanaja gaaru!

Meraj Fathima చెప్పారు...

వనజ గారూ, విన్న కథే అయినా, శ్రీ రాముడికి సాయం చేసిన ఉడత గుర్తొస్తోంది. ఎంతో ప్రేరణ ఇచ్చే కథ.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజీ గారు @ హితైషి గారు @ హరి పొదిలి గారు @ జలతారు వెన్నెల @ మేరాజ్ ఫాతిమా గారు... అందరికి ధన్యవాదములు.
మనిషికి చిన్న ప్రేరణ చాలు. తనవంతుగా మంచిగా ఏమైనా చేయ గల్గడానికి. ఆ ప్రేరణ కథ అయినా కావచ్చు,మనిషి అయినా కావచ్చు,ప్రకృతిలోని ఏ అంశం అయినా కావచ్చు అని చెప్పడమే..నా ఆలోచన .
అందరికి మరోమారు ధన్యవాదములు..