11, డిసెంబర్ 2012, మంగళవారం

కాలమా !




కాలమా!!
నన్ను కరిగిస్తావు!
నువ్వు కరిగిపోతావు!!

గడచిన వ్యధలు,అవమానాలు
అగౌరవాలు, అసహ్యక్రియలు..
అన్నీ నీ ఘనవిజయాలని..
మిడిసిపడతావా..?

 కాదననులే!
వాటి రహస్యాలన్నీ
మరి నీకే తెలియాలి.

నిన్ను నేను గాఢoగా ..
విశ్వసించ బట్టేకదా ..

చీకటిలో చిన్న ప్రమిద తో..
అజ్ఞానాన్ని  అక్షరంతో..
నిశ్శబ్దాన్ని శ్రవణంతో..
నిస్సహాయతలో చేయూతతో..

మునకలో నావని..
ఎడబాటులో..
ఎదలభాషని తోడు చేసుకుని
లోని తీవ్రతలని..
గుండె నిబ్బరంతో..తట్టుకుని
లోపాలని పూరించుకుని ..

నన్ను నేను  కొల్పోయినచోటనే...t
పునర్నిర్మించుకుంటాననే ఆశతో..
ఎవరి కోసం ఆగని నీతో..కలసి
కొత్త ఊపిరి పోసుకుంటూ
నేను..  పరువులు తీస్తున్నాను ..
    
(2002  AIR  VZA లో వినిపించిన  నా కవిత )

11 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

పదేళ్ళకితమే బాగా చెప్పేరు.

శశి కళ చెప్పారు...

చీకటిలో చిన్న ప్రమిద తో..
అజ్ఞానాన్ని అక్షరంతో..
నిశ్శబ్దాన్ని శ్రవణంతో..
నిస్సహాయతలో చేయూతతో..
చాలా బాగుంది

చెప్పాలంటే...... చెప్పారు...

chaalaa baavundi kaalam to paatu manam anni mosukuntu kottagaa jivitaanni repati pai aasha to...baavundi

ఫోటాన్ చెప్పారు...

>>>కొత్త ఊపిరి పోసుకుంటూ
నేను.. పరువులు తీస్తున్నాను ..<<<<

క్షమించండి, ఈ ఆఖరి లైన్స్ లో, పరువులు తీస్తున్నా స్థానం లో పరుగులు తీస్తున్నా అని ఉండాలా వనజ గారు?
లేక నేను అర్థం చేసుకోలేక పోతున్నానా?

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

పోటాన్ .మీ స్పందనకి ధన్యవాదములు.

పరుగు కి పరువులు పర్యాయ పదం

పర్వు.. ఒర్జినల్ వర్డ్. .. Running. పరువు, పరుగు.
మీ సందేహం తీరినట్టేనా? ఎలాగైనా చదువుకోండి.. కాలం తో పరుగులు తీస్తూ అని అర్ధం.

Meraj Fathima చెప్పారు...

vanajaa, kavitallo o vidamaina ashanam kanipistundi.enta cheppinaa inkaa edo cheppaleka poyaanaa anukuntunnaaremo.. meeru chaalaa chakkagaa cheptunnaaru.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టే ఫలే ..మాస్టారూ..పదేళ్ళక్రితం పరుగులు తీయడం ఎలాగో తెలుసుకున్నాను కాబట్టే ఇలా ఉన్నానండీ .:)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శశి కళ గారు.. బాగున్నారా? కవిత నచ్చినందుకు థాంక్స్ . ఎవరైనా ప్రతికూల పరిస్తితులలోనే కదా.. ఎదురీదడం నేర్చుకుంటారు. అదే ఈ కవితలో చెప్పాను.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

చెప్పాలంటే మంజు ..గారు.. థాంక్ యు సో మచ్!!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మెరాజ్ .. నా కవిత్వంలో అసహనం. నిజమే! కవి తనలో మెదిలే భావ ప్రకంపనలకి అక్షర రూపం ఇస్తూ.. ఇంకా ఎదో చెప్పలేకపోయాననే అసంతృప్తి,అసహనం ఉందంటే.. స్పందించిన అంశం పట్ల కవికి ఉన్న అవగాహన తో పాటు వ్యక్తీకరణలో ఆ అంశం పై ఇంకా ఇంకా చెప్పాలి అని ఉంటుంది.
ఫుల్ పిల్ గా వ్రాయడానికి ఇది భావ కవిత్వం కాదు కదా! సామాజిక అంశాన్ని సృజించినప్పుడు కవిత్వం ఇంకా ఇంకా పండాలి. నేను చెప్పడంలో సఫలీకృతం అయ్యాను అని మీరు చెప్పడం ఆనందం కల్గించింది. థాంక్ యు సోమచ్!

www.anilkumardookudu.com చెప్పారు...

Vanaja garu......
Mee kavithalu chaala chaala bhgunnai ......
Fecebook lo kuda rayandi inkabhaguntundi........
Me kavithalu nenu thisuko vachha.....anil