3, జులై 2013, బుధవారం

పండక మునుపే తన్నుకు చచ్చే ...

ఇప్పుడే   బాపు గారి దర్శకత్వంలో వచ్చిన  చిత్రంలో ఒక పాట  వింటుంటే ఎన్నో ఆలోచనలు .. ఎక్కడెక్కడకో  వెళ్లి పోయాయి 

పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు. ఒక విడత కూడా పంట పండకుండా నిలువుగా చీలిపోయే పెళ్ళిళ్ళని చూస్తున్న కాలమిది. చాలా నిశబ్దంగా పెళ్ళి పెటాకులై కుటుంబాలు వేదన చెందుతున్న రోజులివి. ఒక మహిళా న్యాయమూర్తి మాటలు గుర్తుకు వచ్చాయి ..  అనేక ఆలోచనలు  అవి ఇలా ..

 పురుషుడు  తను అందవిహీనంగా ఉన్నా ఎలాంటి ఆత్మ నూన్యతా భావానికి  లోనవకుండా  ఎంతో అందమైన భార్యని అయినా భరించగలడు కానీ తనకన్నా  తెలివైన ,పని నైపుణ్యం కల భార్యని భరించలేడన్నది .. చాలా సందర్భాల లో నిజమవుతూ ఉంటుంది

రెండు దశాబ్దాలుగా విడాకులు తీసుకునే వారి సంఖ్యా  పెరుగుతుండటం  ఎందుకంటే .. స్త్రీలకి తాము ఎందుకు అణచి వేయబడుతున్నామో స్పష్టంగా తెలుస్తూ ఉంది. అమ్మమ్మ, అమ్మల కాలం లోలా మౌనంగా అన్నీ భరించి ఉండటం లేదు. స్త్రీలలో ప్రశ్నించే తత్త్వం పెరిగేకొద్దీ పురుషుడిలో అహం మరింత పెరిగి విచక్షణ కోల్పోవడం చాలా సందర్భాలలో జరుగుతుంది.

ఇప్పుడు అధిక ప్రాధాన్యతంతా అమ్మాయిలదే! అధికులమని విర్రవీగే పురుషులకు తామంతకన్నా అధికులమనుకునే స్త్రీ లకి   పొంతన కుదరక వివాహాలు విఫలమవుతున్నాయన్నది సత్యం.

అణుకువగా ఉండటానికి  అన్నీ భరించి ఉండటానికి ఉన్న వ్యత్యాసంలాగానే, చేదోడు వాదోడు గా ఉండటానికిని మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉండటానికిని చాలా తేడా ఉంది  వివాహాలు ఎక్కువగా ఇక్కడే విఫలమవుతున్నాయని నాకనిపిస్తూ ఉంటుంది

సంసారం అంటే ఏమిటో చక్కగా వివరించిన భాగాన్ని ఇక్కడే...   అంటే  ఇంటర్నెట్ లోనే చూసాను . అది ఇదిగో ..


చక్కని విషయం కదా!

ఇంతకీ నేను విన్న పాట .. "మీనా " చిత్రంలో పాట  అనుకున్నారు కదూ !
మరి అక్కడే పప్పులో కాలు వేసారు. :)

అంత చక్కని పాటే .. ఈ పాట  కూడా ..

  లేత పచ్చఆకులు, రేయి నల్లవక్కలు , వెన్నెలంటి సున్నం ..ఈ మూడు కలసి మెలిసి  పండినప్పుడే తాంబూలం  అరుణమందారం  అదే కల్యాణం .. అనే పాట

ఆ పాట  వినేయండి ..   ఈ లింక్ లో  "కల్యాణ తాంబూలం" చిత్రం లో పాట.

3 కామెంట్‌లు:

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

స్త్రీలు మాత్రమూ ఎమన్నా తక్కువా.. తనకన్నా గోప్పవారినే కోరుకుంటారు.. తన తక్కువ ఉన్నవారిని ఏమాత్రం కాతరు చేయరు..

Sharma చెప్పారు...

ప్రతి సృష్టికి మూలం ఆడ , మగ అనబడేవాళ్ళే . అయితే ఈ యిరువురేదో ఆ ఆనందం పొందుతున్నవేళ ఈ ప్రతి సృష్టికి స్థానం లభించింది . అది మరచి , తమదనుకొని బంధాలను పెంచుకోవటం వలన , నేను గొప్ప అంటే నేను గొప్ప అన్న కీచులాటతో విడాకుల ప్రస్తావన .
ఈ సమయంలో " కలిమి లేములు , కష్ట సుఖాలు ,కావడి కుండలు . కావడి కొయ్యేనోయ్ , కుండలు మన్నేనోయ్ , కనుగొంటే సత్యమింతేనోయ్ ఇంతేనోయ్ " అన్న పాటని జ్నప్తి చేసుకొంటే సమ్స్యకు సమాధానం లభించినట్లే . ఎవరూ తక్కువా కాదు , ఎక్కువా కాదు .

సూర్య చెప్పారు...

వివాహ బంధాన్నే కాదు, ఏ బంధాన్నైనా దేశకాలమాన పరిస్థితులు ప్రభావం చేస్తాయి. అయితే ఆ ప్రభావాలను తట్టుకుని తమ బంధాన్ని నిలుపుకోగల శక్తి మనుషులకు ఉంది. మనుషులకు, మిగతా ప్రాణులకు ఇక్కడే ముఖ్యమైంత తేడా. పరిస్థితులన్నీ నాకే అనుకూలంగా ఉండాలి, నాదే పై చెయ్యి అవ్వాలి అనుకునేవారు (లింగభేదం లేకుండా) ఇంటా బయటా కూడా ఓటమిపాలవుతారు.