24, డిసెంబర్ 2010, శుక్రవారం

రాగం తీసే కోయిలా..


ఒక కోయిల విషాద గీతం.. ఎదను పిండగా.. మదిని మీటగా.. కంటి చెమరింపుగా.. అడవిలో ఎవరు వినని.. ఆమని పాట వేదనలూదగా..


 హాయ్.. ఫ్రెండ్స్.. ఈ..రోజు.. ఏమి పాట.. ఇస్తున్నానో తెలుసా.. !? నేను మీలా.. పాటల ప్రేమిని కనుక పాటల కోసమే అన్వేషణ.

ఎక్కువ సోది.. చెప్పకుండా పాట గురించి చెప్పనే చెప్పను . అదే చిక్కు..ఈమెతో అని అనుకుంటూ ఉంటారు..కదా ! నిజమే కదా?

ఆ పాట నాకెందుకు నచ్చిందో.. చెప్పకపోతే ఏం బాగుంటుంది చెప్పండి..  :)

 ఒప్పుకుంటారు కదూ..!? ధన్యవాదాలు..

ఈ.. నాటి పాట.. రాగం తీసే కోయిలా...నాగమల్లి.. చిత్రంలో పాట.. (నాగవల్లి.. కాదు.)

1980 లో.. ఈ చిత్రం చూసేదానికన్నా.. వినడంలోనే ఆసక్తి ఎక్కువ. ఎక్కువగా జనరంజనిలో వినబడేది. ఎందుకో.. విషాదం కూడా మనిషికి.. ఆనందం.

కాలానికి..కూడా లొంగనిది విషాదం ఒక్కటే.!.  ఒకోకరికి విషాదంతోనే జీవితం కడతేరి పోతుంధికదా..!!

ఈ పాట వినడానికి మధురం.. భావన ఎంతో..విషాదం

బాసలెన్నో చేసుకున్న ఆశే.. మాయగా..
రాతిరి వేళల రగిలే ఎండలా..
ఎడబాటుని.. ఎంత వేదనగా వర్ణించారు.. ఆత్రేయ కన్నా మిన్నగా.. అనిపిస్తుంది..

ఎడారిలో కోయిలా..  అనే పాట కూడా అంతే..!

వేటూరి కలంలో.. సిరా చుక్కని అయినా బాగుండేది అనిపిస్తుంది ఇలాటి.. పాటని విన్నప్పుడు.
అయ్యో ! అంత అదృష్టం కూడానా..  మనకి అనుకుంటూ  నిట్టూరుస్తూ ఉంటాను కూడా.

గుండెలో మురళిని.. గొంతులో.. ఊదకే .. అని సాహిత్యం .

కానీ.. ఊది..తెరుకోలేని బాధతో..వెంటాడి వేధించే పాట
జీవితానికి.. అన్వనయించుకునేలా.!

అందుకే ఈ పాట నాకిష్టమైన పాటల పొదిలో విషాద ఆస్త్రం. ఈ రోజు.. సంధించాను ఇలా..రాజన్-నాగేంద్ర.. అద్భుత స్వరాలు.. మనలని వీడిపొలేవు..

ఇక వేటూరి పద కల్పన.. ఒక విషాద రాగం తీసే కోయిల పాట..
కోయకు గుండెలు తీయగా.
రాతిరి వేళలా.. రగిలే ఎండలా.. ( రా )
బాసలెన్నో .. చేసుకున్న ఆశే మాయగా..( బా )
పిలవని పిలుపుల.. రాకే నీవిలా.. (రా )

జంటని ఎడబాసిన ఒంటరి నా బ్రతుకున..
మల్లెల.. సిరివెన్నెల మంటలు రేపగా..
వయసులా.. నులివెచ్చని..
వలపులా మనసిచ్చిన..
నా...చెలి..చలి వేణువై.. వేదనలూదగా ..
తొలకరి పాటలే.. తోటలో పాడకే..
పదే పదే.. పదే పదాలుగా.. ( రా )

పగిలిన నా హృదయమే..
రగిలెనే ఒక రాగమై ..
అడవిలో వినిపించిన ఆమని పాటగా..

అందమే.. నా.. నేరమా..!
పరువమే.. నా.. పాపమా..?
ఆదుకోమని చెప్పవే.!. ఆఖరి మాటగా...

గుండెలో మురళిని గొంతులో.. ఊధకే..
పదే పదే పదే..పదాలుగా ( రా).

ఈపాటలో.. స్పెషల్ ఏమిటంటే.. వేణువు..గుండెల్ని పిండేస్తుంది అందుకే.. నాకు బాగా నచ్చిందని అనుకుంటాను 

..
మరి  మీరు వినేసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి!?  వినేసి, విసుగేసి..  వదిలేసినా పర్లేదు సరేనా!.

ఎస్. పి. బాలు.. చంద్రమోహన్ స్వరం నూటికి నూరు పాళ్ళు..

ఈ పాటలో.. ఇన్ని ఉత్తమ అంశాలు..

ఇదిగో ఈ పాట లింక్ మీరే వినండి.

రాగం తీసే కోయిల ...