7, డిసెంబర్ 2010, మంగళవారం

నవమినాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి..నీవు.


Posted by Picasa

నవమినాటి వెన్నెల నేను..
దశమి నాటి జాబిలి.. నీవు.
శివరంజని .. చిత్రంలో పాట..

ఇది.. వినే సమయం ఏదైనా పాటలో లీనమైతే వెన్నెల కురవాల్సిందే!
జాబిలి .. కనబడాల్సిందే.!

మనసైన చెలికాడితోనో.. చెలికత్తెతోనో కలసి వెన్నెలలో సరాగమాడుకోవాలనిపించే మూడ్ లోకి తీసుకు వెళుతుంది.
వేటూరి కలం జాలువార్చిన గీతం.

కృష్ణాతీరంలో ఏ ఇసుక తిన్నెలపైనో వెన్నెల విహారం చేస్తూ.. వ్రాసారేమో అనిపిస్తూ ఉంటుంది ! నాకైతే ఎంత బాగా నచ్చేసిందో..!
 కలుసుకున్న ప్రతిరోజు కార్తీక పున్నమి రేయి

ఒకవేళ  ఆ రోజు అమావాస్య అయినా సరే ...   వెన్నెల లో తేలియాడే  భావన కల్గించే .. సాహిత్యం
ఈ పాట నవమి నాటి వెన్నెల నేను  (అంటూ హీరో తనని తానూ పోల్చుకుని )
దశమి నాటి జాబిలి నీవు  (అంటాడు .  అతనికన్నా హీరోయిన్ వయస్సులో పెద్దది  అన్న ఉద్దేశ్యంలో వేటూరి గారు ఇలాంటి పోలిక నిచ్చారని అంటారు )
పాట ఆసాంతం ఈ బాణీ లోనే సాగుతూ...  ముగుస్తుంది

నీ.. వయసే వసంత రుతువై.. (  యవ్వనంలో  ఉన్నప్పుడు  వసంత ఋతువు లాగా ఇంటారు కాబట్టి నీ వయసే వసంత రుతువై అని అతడంటే )
నీ మనసే.. జీవన మధువై .. ( నీ మనసు జీవితాంతం ఉండే మధువు లాంటిది కదా అంటుంది ఆమె )

ఇక శిశిరానికి చోటెక్కడ !

నీ పెదవే నా పల్లవిగా .. నాయకుడంటే ( ఏ పాట కైనా పల్లవి తో ప్రారంభం. వారిరువురి జీవన మాధుర్య సమాగానికి ప్రారంభం పగడాల పెదవేగా ..  అతని ఉద్దేశ్యం అది )
నీనగవే.. సిగమల్లికగా.. (అతని నవ్వునే తన సిగలో మల్లిక గా తురుముకుంటుందట ఆమె)

చెరిసగమై.. ఏ సగమేదో..
మరచిన మన కలయికలో..(    సమాగంలో ఎవరు ఎవరో తెలియనంతగా మమేకమై )
ఎంత.. అద్భుతమైన ఫీలింగ్.. దేనినే అద్వైతం అంటారేమో !

నీ ...  ఒడిలో వలపును నేనై.. (నీ వొడిలో వలపు చెలికాడును కదా నేను అని అతను)
నీ గుడిలో వెలుగే నేనై..(  నీవు దేవుడివి . .. నీ గుడిలో వెలిగే దీపాన్ని నేను
అందాలే హారతిగా.. ( తన అందాలని హారతిగా చేసి కరిగిస్తాను అని చెపుతుంది ఆమె )
అందించే నా పార్వతిగా..( ఆమె  అతని సగభాగం అని తలపోత )
మనమోకటై రస జగమేలే..
సరస మధుర సంగమ గీతికలో.. ( రస జగత్తులో ఇరువురు ఒకటై  ఓలలాడుతూ  మధుర సంగమ గీతికగా మారి  )
నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతి రేయి కార్తీక పున్నమి రేయి
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలీ నీవు
కాలం మరువ వలసిందే! ఈ.. పాటని.. నేను మొబైల్ ఫోనులో కాలర్ ట్యూనుగా.. పెట్టుకుంటే చాలా అవస్థ పడ్డానండి. కాల్ చేసిన ప్రతివారు రొమాంటిక్ మూడ్ లోకి.. వెళ్ళిపోయామని.. అంటే ఇక్కడ అర్ధం వాళ్ళ.. పాత రోజులుని జ్ఞప్తికి తెచ్చానని చెప్పడం  అనుకుంటాను. అది ఇబ్బందిగా  అనిపించి..  కాలర్ ట్యూన్ మార్చేసుకున్నాను.

అయినా ఈ పాటంటే నాకు.. మోహం.. తనివితీరని మోహం..
ముఖ్యంగా ఎస్.పి. బాలు గారి గళంలో ఆ రొమాంటిక్ టచ్.. ఏదో మాయ చేస్తుందండి.
రమేష్ నాయుడు గారి స్వరాల అల్లిక మహా గమ్మత్తు. మూడే మూడు వాయిద్యాలతో మనసులని మంత్ర ముగ్ధుల్ని చేస్తారు.

ఆలుమగలు.. పోట్లాడుకున్నప్పుడు, మాట్లాడుకోనప్పుడు ఈ పాట .. ప్లే .. చేయండి.
ఎవరో.. ఒకరు వెన్నెల కురవక పోతే జాబిలి రాకపోతే.. ఒట్టే! సినీ ద్రువతారాలు లా మెరిసే.. వేటూరి + రమేష్ నాయుడుగారి.. సాక్షిగా.




ఈ పాట సాహిత్యం :
నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతి రేయి.. కార్తీక పున్నమి రేయి….
నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతి రేయి కార్తీక పున్నమి రేయి
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలీ నీవు

నీ…. వయసే వసంత ఋతువై
నీ మనసే జీవన మధువై
నీ…. వయసే వసంత ఋతువై
నీ మనసే జీవన మధువై
నీపెదవే నా పల్లవిగా
నీనగవే సిగ మల్లికగా
చెరిసగమై యే సగమేదో మరచిన మనతొలి కలయికలో…. ఓ..
నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతి రేయి.. కార్తీక పున్నమి రేయి..
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
నీ…. ఒడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై
నీ…. ఒడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై
అందాలే నీ హారతిగా
అందించే నా పార్వతిగా
మనమొకటై రసజగమేలే సరసమధుర సంగమ గీతికలో…. ఓ..
నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతి రేయి కార్తీక పున్నమి రేయి
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలీ నీవు