19, జనవరి 2011, బుధవారం

అ పాత మధురం సంగీతం-ఆలోచనామృతం సాహిత్యం  సరిగమ స్వరధుని వాణి 
  సారస్వతాక్షర సార్వభౌముడు          

  నాకు చాలా ఇష్టమైన పాట "స్వాతి కిరణం"  చిత్రంలో.. పాట.

  వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మినే ..పాట.
  కే.వి.మహదేవన్ స్వరకల్పనలో.. వాణి జయరాం శ్రీ భారతిని కీర్తించడమే.. ఈ..పాట నేపద్యం.

  సీతారామశాస్త్రి గారి కలం ఒలికించిన సాహిత్యం .. అపూర్వం.

   సాహిత్యానికి,సంగీతానికి శారద కృపకటాక్షములు లభించాలంటే.. ఎంతటి పుణ్యం చేసుకోవాలో!?శ్రీ భారతిని కీర్తించడానికే.. ఆయనకి.. ఈ..పాట వ్రాసే భాగ్యం కల్గి ఉండవచ్చు కూడా!

    నాకు బాగా నచ్చిన అంశం: మొదటి చరణంలో.. చాలా..సూక్ష్మంగా.. గొప్పగా..చెప్పిన..

   ఆ పాత మధురం సంగీతం ..
  సంచిత సంఘాతం సంచిత సంకేతం
  శ్రీ భారతి క్షీర సంప్రాప్తం అమృత సంపాతం.సుకృత  సంపాతం.

  సంగీత సాగరం    
  ఇక రెండవ చరణంలో ..

  ఆలోచనామృతం సాహిత్యం
  సహిత హిత సత్యం శారదా స్తన్యం
  సారస్వాతాక్షర సారధ్యం జ్ఞానసామ్రాజ్యం జన్మ సాఫల్యం..

  ఇంతకన్నా ఏ కవి చెప్ప గలడు  చెప్పండీ!

   సంగీతం సాహిత్యం రెండు మనిషిని.. మనీషిగా మార్చగల సాన్నిద్యంలు. ఈ..రెండింటి తోడు ఉంటే.. సంసార సాగరాన్ని అవలీలగా.. ఈధగలరు అని అనుకుంటాను నేను.

  శారదా కటాక్షం .. నాతో పాటు అందరికి.. లభించాలని  ప్రార్ధిస్తూ..

  సిరివెన్నెల  కలానికి,వాణీ జయరాం గళానికి, మహదేవన్ సుస్వరాలకి..  అభివందనం తెలుపుతూ..


  నాకు.. కనీసం  సంగీతాన్ని, సాహిత్యాన్ని ఆస్వాదించే.. గుణాన్ని  ఇచ్చిన జ్ఞాన సరస్వతి పాదారవిందాలకి ప్రణమిల్లుతూ..  ఈ.. ఆపాత మధురం (అ పాత మధురం) ఆలోచనామృతంల సహజీవనం తొ..హాయిగా జీవించాలని కోరుకుంటూ..
  మీ.. వనజవనమాలి.

  వైష్ణవి భార్గవి     పాట వినేయండీ!!!!.  .                         .

  1 వ్యాఖ్య:

  M. చెప్పారు...

  ఈ పాట గురించి నాకు తెలీదు కానీ,,, మా ఫెండ్స్ర్ కి రింగ్ టో్న్ పంపించాను బాగుందన్నారు.
  ఈ పాట ఇతవరకు పూర్తిగా వినలేదు.
  ఇప్పుడు వింటాను

  shabbu(KNr)