31, జనవరి 2011, సోమవారం

నిగ్గ దీసి అడుగు - సిరివెన్నెలఆవేశం ఆక్రోశం నిండిన ఈ..అక్షర తూణీరం ఎవరిదో.. ఎప్పడిదో.. ఎక్కడిదో.. "సిరివెన్నెల "గురించి తెలిసిన అందరికి తెలుసు.

ఒక పాట ప్రభావం మనుషుల ఆలోచనా విధానంని మార్చుతుందా!? అంటే?.తప్పకుండా అని చెప్పవచ్చు.

అప్పుడెప్పుడో.. శ్రీ శ్రీ గారి కలకానిది విలువైనది పాట విని ఆత్మ హత్య చేసుకుని జీవితాన్ని ముగించాలని నిర్ణయం తీసుకున్నవారు సైతం మనసు మార్చుకుని జీవితాన్ని చాలెంజ్ గా తీసుకున్నారని వింటూ వుంటాం. చాలా మంది.. మన చుట్టుపక్కల ఏం జరిగితే మనకెందుకు.. మన జీవితాలు సాఫీగా జరిగితే చాలు అనుకుని చాప కింద నీరులా వచ్చి పడే వినాశనాన్ని గుర్తించక నిర్లక్ష్యంగా..జీవించడం అలవాటైన జాతి -రీతి మనది.

నిత్యం మన చుట్టూ ఉన్న సమస్యలకి స్పందించి ఆ స్పందనతో జన జాగృతికి కృషి చేసేవాడే కవి.వర్తమాన,సామాజిక,సాంస్కృతిక,ఆర్ధిక రాజకీయ అంశాల పట్ల అవగాహనతో..ఆలోచనలకూ అరుణిమ అద్ది.. గేయ రూపంలో..ఏ.కే.47 లా దూసుకు వచ్చిన పాట.ఈ.. పాట నాకే కాదు..చాలా మందికి నచ్చేపాట." గాయం" చిత్రమే ఓ..గొప్ప సంచలనం.ఆ చిత్రంలో..ఉదహరించిన కొన్నిఅంశాలకి.. వాస్తవికతని జోడించడం.. జగపతి బాబు నటన, వర్మ దర్శకత్వం .. అన్ని గొప్పవే.! ఈ చిత్రంలో..ఇంకొక పాటకి 1993 నంది అవార్డ్ అందుకున్నారు సిరివెన్నెల.. ఆ..పాట "సురాజ్యమవలేని స్వరాజ్య మెందులకని".అయితే.. ఈ.. చిత్రంలో.. సిరివెన్నెల ఆవేశ పూరిత మైన నటన ఎంతో.. స్పూర్తికరం. 1.58 సెకన్ల ముద్ర అందరి హృదయాలలో.. చెరగని ముద్ర. ఇక ఎస్ పి బాలు గారు.. సిరివెన్నెల గారి గళమే అన్నంతగా వారి గళంని అనుసంధానం చేసారు.ఈ..పాట కోసమే "గాయం'' చిత్రాన్ని నేను ఎన్ని సార్లు చూసి ఉంటానో.. లెక్కే లేదు.

సిరివెన్నెల అక్షర శోభ .. చూడండి ఇలా..


" నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోన కడుగు సమాజ జీవశ్చవాన్ని ..
మారదు లోకం మారదు..కాలం..
దేవుడు దిగి రాని ఎవ్వరు ఎమై పోనీ..
మారదు లోకం మారదు కాలం.

గాలివాటు గమనానికి కాలిబాటదేనికి?
గొర్రె చాటు మందకి జ్ఞానభోద దేనికి?
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాటాల్ని
,ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం...
రామ బాణమాపిందా రావణ కాష్టం..
కృష్ణ గీత ఆపిందా.. నిత్య కురుక్షేత్రం (ని)


పాత రాతి గుహలు పాలరాతిగృహలైనా..
అడవి నీతి మారిందా.. ఎన్ని యుగాలైనా..
వేత  అదే! వేట అదే  నాటి కధే.. అంతా!..

నట్టడువులు నడివీధికి నడిచి వస్తే వింత.
బలవంతులు బ్రతకాలనే సూక్తి మరువకుండా.
శతాబ్దాలు చదవలేదా.. ఈ.. అరణ్యకాండ..
మారదు లోకం మారదు కాలం. ..

నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని..
అగ్గితోన కడుగు సమాజ జీవశ్చవాన్ని"..
వీపున చెళ్ళున చరచినట్లు లేదూ..!

అందుకే.. థింక్ గ్లోబల్లీ..యాక్ట్ లోకల్లీ.. అనే భావంతో..

బాధ్యత గల పౌరులుగా మెలగమని హెచ్చరించే.. ఈ..పాట నాకు చాలా చాలా.. ఇష్టం.
సిరివెన్నెల ఆలోచనలలోని అగ్నిని.. పరిచయం చేసిన పాట.
ఎప్పుడు విన్నా.. ఆలోచనలన్నీ.. మనం ఈ.. సమాజం లో.. ఎలా మెలుగుతున్నాం!? అనే ప్రశ్నని.. రేకెత్తిస్తుంది.

ఈ.. చిత్రానికి .. సంగీతం అందించిన "శ్రీ" మంచి సంగీత దర్శకుడు.
కానీ.. ఎందుకో.. పరిశ్రమలో.. ఇమడలేక.. మట్టిలో మాణిక్యంలా.. ఉండిపోయారు..
ఇన్ని.. సుగుణాలు ఉన్న పాట.. ని.. ఎక్కువగా.. వినండి. ఆలోచించండి.సిరివెన్నెల.. ఆలోచనల అగ్ని మన నిత్య జీవితంలో.. దర్శించుకుని..గొర్రెల మందలా.. కాకుండా..చేతనతో.. బ్రతుకుదాం......ఇది.. నా అభిమాన గీత రచయిత.. సిరివెన్నెల శోభ. పాట వినేయండి....