4, జనవరి 2011, మంగళవారం

ఆకాశం నుండి.. దిగి వచ్చే.. దేవ కన్యలా..


Posted by Picasa

ఆకాశమా..! నువ్వెక్కడ?

 అవనిపై ఉన్న నేనెక్కడా..!
వేల తారకలు తనలో ఉన్నా..
ఈ.. నేల పైనే తన మక్కువ.

ఈ.. ఏంజెల్ ఏమిటి ..!వెన్నల రాత్రి..  ఈ.. అందమైన పొదరిల్లు ఏమిటి.. ఈ..పాటికి  అర్ధమై  ఉంటుంది..
ఈ..పాట డా.సి.నా.రెడ్డి పాట అని.

 సాహితీ స్రష్ట


ఏమి వ్రాసినా.. అద్భుతమే.. ఎంత.. మంచి.. అర్ధం ఉన్న..పాటో.. చిన్న పిల్లలకి..కూడా అర్ధం అవుతుంది..

ఇక.. విజయశాంతి.. ఆకాశం నుండి.. దిగి వచ్చే దేవ కన్యలా..  చక్కని.. చందేరి.. చీరల్లో.. నాజూకైన.. అందాల బొమ్మగా.. ఎంత..అందమో..! అలా జడ వేసుకుని.. పూలు పెట్టుకున్న నాయికా మణిలను మనం చూడగలమా.!?

 వందేమాతరం చిత్రం.. సంగీతదర్శకుడు..శ్రీనివాస్  ఈ..పేరుతో.. మన అందరికి. సురపరిచితం..
అభ్యుదయ భావాలు గల దర్శకుడు..టి .కృష్ణ గారి .. చిత్రం.  చిత్రీకరణ అత్యద్భుతం..మంచి సాంఘిక చిత్రం.

ఆ.. చిత్రం హీరో రాజశేఖర్ కి..తొలి చిత్రం. ఇక పాట విషయానికి  వస్తే ...


ఆకాశమా! నీవెక్కడ.. అవనిపై వున్నా నేనెక్కడా..(ఆ) 
యే రెక్కలతో.. ఎగసి వచ్చినా.. నిలువగలనా..నీ..ప్రక్కన.
నీలాల గగనాన.. ఓ.. జాబిలి.. నిను నిరుపేద ముంగిట నిలిపేదెల...(నీ)
ముళ్ళున్న,  రాళ్లున్న నా.. దారిలో నీ..చల్లని పాదాలు..సాగేదేలా...
నీ ..మనసన్నది..నా మది విన్నది.. నిలిచిపోయింది ..ఒక.. ప్రశ్నలా..(ని) 
ఆకాశమా..! లేదక్కడ..నిలిచి ఉంది.. నీ.. పక్కన..
వేల తారకలు.. తనలోన ఉన్న..(వే)
నేల పైనే..తన మక్కువ..(ఆ)
వేల  లేని.. నీ  మనసు..కోవెలలో..
నను.. తలదాచుకొని చిరు వెలుగునై..(వే)
వెనుదిరిగి చూడని  నీ.. నడకలో
నను.. .కడ దాక రానీ.. నీ..అడుగునై.. 
మన సహజీవనం వెలిగించాలిలే.. 
సమతా కాంతులు.. ప్రతి దిక్కులా (స) . 
ఆకాశామా..  లేదక్కడ..  
అది నిలిచి ఉంది.. నా..ప్రక్కన
వేల తారకలు.. తనలో ఉన్నా... 
నేలపైనే  తన మక్కువ 
ఈ.. నేల పైనే తన మక్కువ.. (ఆ) 

ఇప్పటికి..  మంచి పాటల జాబితాలో ఈ పాట  ప్రముఖం.. ఇలాటి పాటలు.. విన్నవారికి.. ఇప్పటి..పాటలు.. రణగొణ ధ్వనులుతో..వినబుద్దికాక... రేడియోలు ..కట్టి పడేసుకుంటున్నారు.. శబ్ద కాలుష్యంతో.. విసిగిపోయెవారికి.. అమృతం పోసినట్లు ఉండే.. పాటలు.. అందరు..వినాలి.. సాహిత్య విలువలు తెలుసుకోవాలని నా..కోరిక.. మీరు.చూడండి .  ఇక్కడే..   ఆకాశమా నీవెక్కడ  -- వందేమాతరం