26, జనవరి 2011, బుధవారం

మువ్వనై పుట్టాలనుకున్నా ఒకనాడు.. దివ్వేనై నీ..వెలుగులు రువ్వనీ..ఈనాడు.

అనురాగ మాలికలు   
రాగాలెన్నో పండిన గారాల నీ మెడలో..
అనురాగమాలికలే వేయాలని ..
నీ చల్లని చరణాలు.. చల్లిన కిరణాలలో..
రేపటికోసం చీకటి రెప్పల తెర తీయాలని..
పిలిచాను.. ఎదుట నిలిచాను..
కోరి కోరి నిన్నే.. వలచాను..
ఏమిటీ.. ఈ.. ఎత్తుగడ ..అనుకుంటున్నారా !?
ఇది పాట. ఎందుకో ఈ.. పాట వెంటాడుతుంది ఈ రోజు. ఎంత అందమైన పాట.

 పద రచనలో కొత్త బాణీలను పరిచయం చేసిన  వేటూరి కలం జాలువార్చిన తొలి  చిత్రం లోని  సిరిసిరిమువ్వల పద విన్యాసం. ఈ చిత్రంలోని అన్ని పాటలకన్నా.. నాకు బాగా..నచ్చిన సాహిత్యం ఇది.

 గంగ కదిలి వస్తే.. కడలి ఎలా పొంగిందో..
యమునా సాగి వస్తే.. ఆ గంగ ఏమి పాడిందో..!
ఆమని వచ్చే వేళ అవని ఎంత మురిసిందో..
మోహన వేణువు తాకిన మోము ఎలా..
మెరిసిందో.. ఊగింది తనువు అలాగే.. పొంగింది మనసు.. నీ..లాగే!"

కవిత్వంలో.. పోలికతో.. ఒక భావాని వ్యక్తీకరిస్తే.. ఎంతటి.. గాఢ ముద్ర ఉంటుందో..
అలాగే.. ఈ.. చరణం శిల్పం అంత మోహనంగా ఉంటుంది..
చిత్రంలో.. నటరాజ ప్రేయసి.. జయప్రద నృత్య హేల.. హావభావ ప్రకటనలు..  చంద్ర మోహన్ నటన.." మామ" సంగీతం  అన్నీ.. మేలిమి బంగారాలే!

శృతి కలసినదెన్నడో సిరిమువ్వల సవ్వడిలో..,
జత కలసినది ఇప్పుడే ఆ గుడిలో..నీ..ఒడిలో..
మువ్వనై పుట్టాలనుకున్నా ఒకనాడు..
దివ్వేనై నీ..వెలుగులు రువ్వనీ..ఈనాడు..
పిలిచాను ఎదుట నిలిచాను ..
కోరి కోరి నిన్నే వలచాను..
ఇది సాహిత్యం

ఈ..పాటని పరిచయం చేయటానికి.. ఎంత శోధన చేసానో! అన్ని చోట్లా.. ఈ.. పాట లేదు. ఆఖరికి "చిమట" లో..  చంద్రమోహన్  హిట్స్ లో.. దొరికింది. పాట.. మొదలు.. 1. రారా  స్వామి రారా  అని తొ..ప్రారంభం.(గమనించండి).

ఫ్రెండ్స్! పాటని జతపరచడం నేర్చుకుని  చెప్పినట్లు పాటని పరిచయం చేస్తున్నాను ..
పాటని పరిచయం చేయకుండా.. ఉండలేను. అది.. నా ..బలహీనత.
పాట నా.. ప్రాణం.మీ అందరికి  ఎంత వేగిరంగా.. మంచి పాట పరిచయం చెయ్యాలనే..నా ..భావావేశం + ఆత్రుత.

భారతీయ చలన చిత్రంలో అపురూప సౌందర్య రాశి "జయప్రద"  పై  ఉన్న అభిమానం ఇది.
కాశీనాధుని విశ్వనాధుని సిరిసిరిమువ్వల విన్యాసంలో  సాహిత్యపరంగా.. కొత్తకోణంలో.. ఈ..పాటని  వినండీ!!ప్లీజ్!!!
మీకు నచ్చుతుందని..నా ..భావన.


అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ  నాటికి-ఏ నాటికి 
ఝుమ్మంది నాదానికి.. సయ్యంది పాదం 
 
నటనాల ఊర్వశి  - నటరాజ ప్రేయసి