4, జనవరి 2011, మంగళవారం

అందమా .. నీ పేరేమిటి అందమా ..!!

అందమా....! నీ..పేరేమిటి..అందమా!
Posted by Picasaవేటూరి పాట..వినకుండా.. మా..క్రిష్ణమ్మ.. పరవళ్ళు చూడకుండా.. ఉండాలంటే.. ఎంత కష్టమో..!
నిత్యం ఆ..నీళ్ళు..త్రాగుతూ.. వేటూరి పాటలు వింటూ.. వావ్ .. విజయవాటిక.. అనుకోకుండా.. ఉండలేం కూడా. కళలకు.. కళాకారులకు పుట్టినిల్లు..అయిన మా..పుర వీధులు... మరింతమంది కళాకారులకు మెరుగులు..దిద్ది.. విశ్వ వీధుల్లోకి.. విసిరి వేస్తుంది.. అలా..విసిరివేయ బడ్డ వారు.. విజేతలై వచ్చి.. కళా తోరణాలై.. భాసిల్లుతూ తమ విద్వత్తు తో.. అంతు లేని ఆనందం మిగుల్చుతున్నారు..అలాటి వారే వేటూరి..

అల్లరిప్రియుడు.. చిత్రంలో.. అందమా..! అనే పాట..ఆయన లోని.. కవి విశ్వరూపాన్ని.. చూపింది.. ఎంత దీర్ఘంగా.. సాలోచనగా.. ఎద లోతుల్లో..నిండిన భావుకతకి..అక్షర రూపం కలిగించారో .. పాట వింటూ.. మీరు ఎప్పుడైనా.. అవలోకించారా.!

అందమా! నీ.. పేరేమిటి .. అందమా..! (అం)
వొంపున హంపీ..శిల్పమా.. ! బాపు గీసిన చిత్రమా..!
తెలుపుమా.. తెలుపుమా..!

పరువమా..! నీపెరేమిటి.. పరువమా.. (ప)
కృష్ణుని మధురా..నగరమా.. కృష్ణా సాగర కెరటమా!
తెలుపుమా.. తెలుపుమా.. (అం)

యే రవీంద్రుని భావమో..గీతాంజలి కడ వివరించే..
ఎండ తాకని పండు వెన్నెల..
గగన మొలికె ..నా కన్నుల..
ఎంకి పాటల రాగమే..గోదారి అలలపై.. నిదురించే..
మూగపోయిన రాగ మాలిక
ముసిరేనపుడు.. నా..గొంతున..
సంగీతమా..! ఈ..నింగిలో..
విరిసిన స్వరములే.. ఏడుగా ..
వినబడు హరివిల్లు.. ఎక్కడ..ఎక్కడ..!?
తెలుపుమా..తెలుపుమా ! తెలుపుమా..! (అం)

భావ కవితల బరువులో..కృష్ణశాస్త్రిలా..కవినైతే..
హాయి రెమ్మల.. కోయిలమ్మకు.. విరుల రూపు వికసించదా ..
తుమ్మెద ఎరుగని మధువులో..
చెలి సాఖి వలుపులే.. వినిపిస్తే..
మాయ జగతికి..యే ఖయ్యామో..
మధర కవితలు..వినిపించడా.. ?

ఓ.. కావ్యమా..ఈ..తోటలో..
నవ రస పోష ణే .. గాలిగా..
నవ్విన పూలే..మాలగా.. పూజకే..సాధ్యమా.. తెలుపమా..!. (అం)

ఇదండీ..పాట సాహిత్యం.నేను వివరించాలిసి వస్తే.. పాట మొత్తం వివరించవచ్చు..
కానీ.. పదాలతో.. ఎన్ని ప్రయోగాలో.. చేసారు.. వేటూరి.. భావం ఉత్కృష్టం .. ఆ భావాన్ని.. అర్ధం చేసుకోగల్గితే..చాలు.

ఎమ్.ఎమ్..కీరవాణి.. వయోలిన్ స్వరాల వొంపులు, వేణువు విన సొంపులు.. అంతకన్నా.. మధురం.

అన్ని పాటలు బాగున్నా సాహిత్యపరంగా క్రిష్ణమ్మని.. సాగర కెరటాలతో.. అభివర్ణించి.. నదీమ తల్లి.. నీళ్ళు తాగిన కృతజ్ఞతని.. చాటుకున్న మహనీయుడు.. వేటూరి .

తెలుగు.. సినిమా పాటల్లో.. సాహిత్య విలువలని.. తెలియ చెప్పిన ఘనుడు..
అందుకే.. ఈ..పాట.. ఇలా.. మీ.. ముందుకు..ముస్తాబు చేసి..అందం పేరు.. ఇంతకన్నా.. ఎక్కువ.. అది.. వేటూరి పాట.. అండీ.. అని సవినయంగా.. మనవి చేస్తూ..
వినండీ.. వింటూనే ఉండండి. .ఎప్పుడూ.. వేటూరి పాటలని.... ఇప్పుడు చూడండీ!!! .
సరేనా!? ఫ్రెండ్స్ ...

కే.ఎస్. చిత్ర గారి.. స్వరం .ఓహ్.. బాలు..గళం చెప్పేదేముంది..కొత్తగా.. ఇక రమ్య కృష్ణ.. పై.. రాఘవేంద్రుడి చిత్రీకరణ.. మీకు తెలుసు.. వెరసి ఈ..పాట..మనసులని దోచేసే ఒక ఆణి ముత్యం.