6, జనవరి 2011, గురువారం

మనసు కవి ..నేనొక ప్రేమ పిపాసిని..నీవొక ఆశ్రమవాసివి

నేనొక ప్రేమ పిపాసిని!

Posted by Picasaవానలో తడవకుండా ఆత్రేయ మనసు పాట వినకుండా ఎవరు ఉండరంట.
మనసు కవి మన "సు"  కవి.. మనసు కవి  వ్రాసిన పాట  ఈ.. నాటి.. నాకిస్టమైన పాట.

ఈ..పాట ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి..ఈ..పాట వెనుక కధ ఒకటి ప్రచారంలో..ఉంది.. 

ఆత్రేయ గారు బ్రహ్మచారి ..అని అందరికి తెలిసిన విషయమే. 

ఈ..పాట వ్రాయక ముందు.. ఆయన గాడంగా..ప్రేమించిన ఆవిడకి.. వారికి.. అభిప్రాయబేధాలు వచ్చి.. ఆమె.. ఆత్రేయ గార్ని బయటికి  నేట్టేసారట.

ఆ బాధలో  నుండి పుట్టిన పాట ఇది..అని ఒక టాక్ అంట అండీ..
నేను  ఎవరో చెబుతుంటే..విన్నా!..  

ఏ  కవి అయినా.. వారి అనుభవంలో నుండో..ఇతరుల అనుభవం నుండో.. వస్తువుని తీసుకోక తప్పదు కాబట్టి.. హృదయంలో నుండి వచ్చిన భావనకి.. బలం ఎక్కువ. అది అలా బలమైన  ముద్ర వేసేస్తుంది..కదా!  

ఈ..పాటని విన్నప్పుడల్లా.. అబ్బ ఎంత వేదన అనుకోకుండ ఉండలేను. 

అనిత పాట మన మద్య మారుమ్రోగేటప్పుడు  కూడ నేను అందరితో.. వాదించాను..  

నేనొక ప్రేమ పిపాసిని పాటకన్నా ఈ.. పాట గొప్పది ఏం కాదని..

 సరే.. ఈ.. సోది అంత..ఆపేసి.. పాట  గురించి

అందరికి..తెలుసు..అయినా సరే.. ఇష్టమైన పాట గురించి చెప్పాలని.. 

కానీ .. నేను క్రొత్తగా..ఏం చెపుతానా అని..  వెయిటింగ్  కదూ.. వస్తున్నా నండీ..  ఈ..పాటల గురించి అందరితో చెప్పాలనే కదా  ఈ..బ్లాగ్ ప్రయాణం  మొదలెట్టాను..రోజుకొక పాట గురించి చెప్పకుండా.. ఏం వదలను.. 

వి యే.కే. రంగారావు గారు.. మా..ఏకలవ్య  గురువండీ.!  అందుకే..పాటల గురించి. చెపుతుంటాను.

మంచినీటి చెలమలో నీళ్ళు లాగా.. ఊరుతూనే ఉంటాయి.. 

నేనొక ప్రేమ పిపాసిని..నీవొక ఆశ్రమవాసివి .. 
నా..దాహం తీరనిది.. నీ..హృదయం కధలినిది... 
తలుపు మూసిన తల వాకిటనే.. పగలు రేయి నిలుచున్నా.. 
పిలిచిపిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా..(త) 

నా.దాహం తీరనిది.. నీ..హృదయం కధలినిది..(నే) 

పూట పూట నీ  పూజ కోసమని పువ్వులు తెచ్చాను 
ప్రేమ బిక్షను పెట్టగలవని దోసిలి ఒగ్గాను. 
నీ అడుగులకు  మడుగులు ఒత్తగా.. ఎడదను పరచాను..
నీవు రాకనే.. అడుగు పడకనే.. నలిగిపోయాను (నే) 

పగటికి రేయి రేయికి పగలు.. పలికే నీతోడు..  
చెదరేగే గుండెకు చెపుతున్న..నీ చెవిన పడితే..చాలు..
నీ..జ్ఞాపకాల నీడలలో..నను ఎపుడో.. చూస్తావు.. 
నిన్ను వలచానని  తెలిసేలోగా..నివురైపోతాను..(నే )

నా.. దాహం తీరనిది..నీ..హృదయం కధలినిది.. 

ఎంత వేదన.. ఈ..పాట వినగానే.. గుండె బ్రద్ధలినట్లు ఉంటుంది.. 

బ్రోకెన్ హార్ట్ సిండ్రోం అంటారే..అది వచ్చేస్తుంది..నాకు.. 

ఒకప్పుడు..ఈ..పాట రెండు చరణాలే.. లభ్యమయ్యేది.. 

మద్యలో చరణం.. తర్వాత తర్వాత లభ్యం. ఇప్పుడు   ౩ చరణాలు.. వింటున్నాం..

ఈ.. చిత్రం  లో..ఇంకొక విషాద గీతం  ఆరుద్ర వ్రాసారు.. 

ప్రేమకి మరణం లేదు పాట. ఆ పాట ఆత్రేయ అని చూస్తున్నాం..కానీ.. కాదని..రామలక్ష్మి గారు  తెలిపారు... 

ఈ పాట వినాలనిపిస్తుంది కదా . 

ఈ..పాటకి  కే.వి. మహదేవన్ సంగీతం. 

అన్నింటికన్నా .. కృష్ణగారి.. ఆక్రోశ  రూపం.. శారద గారి.. .మూగ వేదనన ..వెంటాడుతూ.. ఆత్రేయని.. మన మద్య సజీవ వేదనకి  ప్రతి రూపంగా..నిలిపినాయి. 
కవి కలంకి    మరణం లేదు.. శ్రోతలకి.. వినే దాహం తీరదు.. 
పాట.కి.. జేజేలు. 

ప్రేమ బిక్షకి.. ఇలా .. దోసిలి పట్టవచ్చు.

 దాడులు  చెయ్యటం  చాలా .. తప్పు కదా..అని పాట వినిపిద్దాం ..సరేనా.. !!

చెవిటి వారి ముందు  కూడా.. శంఖం ఊదాలి  ఫ్రెండ్స్! తప్పదు మరి.      .
నీవొక ఆశ్రమవాసివి