8, జనవరి 2011, శనివారం

కలనైనా నీ వలపే

వెన్నెల రాజా!
కలువ నిరీక్షణ 
తుషార శీతల సరోవరాన ..
అనంత నీరవ నిశీధిలోన ఈ..కలువ నిరీక్షణా.. 
నీ..కొరకే..రాజా .. వెన్నెల రాజా...! 

కలనైనా నీ వలపే..(క)
కలవరమంధైనా నీ తలపే..
కలవని తారకు కమ్మని కలలు(క) 
కళలు, కాంతులు నీ..కొరకులే  (క) 

చెలియారాధన,శోధన నీవే!
జిలిబిలిరాజా..జాలి తలచరా..(క) 
కనుల మనోరధ మాధురీ  దాచి (క)  
కానుక చేసే వేళకు..కాచి..(కా) 
వాడే రేకును,వీడని మమతల వేడుక చేసెను 
లేచె..నిలిచే రా..(క).

ఇది ఒక పాత బంగారం లాటి  పాట. 
సాహిత్యం..చాలా..బాగుంటుంది.
నేను పుట్టటానికి ఒక దశకం ముందు..వచ్చిన చిత్రం అట..
కానీ నేను .. ఈ..పాట   రేడియోలో.. వచ్చేటప్పుడు..వింటుంటే ఒక్క ముక్క అర్ధమైతే..ఒట్టు..
తర్వాత తర్వత.. మెల్లిగా..అర్ధం చేసుకోవడం మొదలెట్టాక.. ఓసి..ఇంతేనా! అనుకునే దాన్ని. 

మా.. అమ్మ వాళ్ళ టైములో.."శాంతి నివాసం" సినిమా.. ఛాలా..హిట్ సినిమా అట..
దాని గురించి..మా..పెద్ద ఆడాళ్ళ రాత్రుల మీటింగులు..
పుస్తకాలు..ముందేసుకుని కూర్చున్నా..యావ అంతా.. వాళ్ళ మాటలు మీదే.. ఉండేవి.. 
అలా విని విని. ఇలా.. పాటలు వినడంలో.. చిన్నప్పుడే అరి తేరి.. అన్నం తినకపోయినా.. ఉండగలను కానీ.. పాట వినకుండా.. నా వల్ల కావడం లేదంటే.. నమ్మాలండీ..మీరు..

ఎప్పుడు 80 'ల, 90"ల పాటలేనా..పాత పాటలు తెలియదా? అని అడిగితే.. కోపం వచ్చి..ఇలా ఈ..పాత పాటని.. ముస్తాబు చేసి  మీ..ముందుకు.. తీసుకు వచ్చాను.. 

పాట  రాగా..లో.. లభ్యం.. మీరు.. వినండీ! 

ఈ.. పాట భావం నాకు చాలా..చాల.. నచ్చింది.
సముద్రాల  గారి పద రచన ఘంటసాల గారి సంగీతంలో.. పి.లీల గారి స్వరం... 
ఎంత.. స్వచ్చంగా..ఘాడంగా..మనసుని..దోచేసి.. అలా..వినాలనిపిస్తూనే..ఉంటుంది.. 
ఈ..కాలం వాళ్లకి.. ఇలాటి పాటలు.. అర్ధం అవుతాయా..! 

అమ్మా!ఆపమ్మా.. నీ..పాటలు..వినలేక  ఇల్లు వదిలి పారిపోవాలి.నీకు..ఇష్టమైతే.. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని విను.. అంతే కానీ..వినమని..చంపకు..అర్ధమైందా! అది ఒక పాట.. మళ్లీ మేము వినడం..అంటున్న నా..కొడుకు మాటలు గుర్తు చేసుకుంటూ..  పోరా!.. వెళ్లి.. మీ తరం పాటలకి.. పూనకం వచ్చినట్లు ఊగండి. మీ తరం వారంతా.. రసహీనులు. పాటలో.. మాధుర్యం మీకేమి తెలుస్తుంది.. అంటూ.. నేను.  ఇంట్లో..కూడా.. పాటల యుద్ధమండీ.. బాబూ..

ఎవరైనా.. యంగ్ స్టర్స్ ..ఈ.. పాట విని.. మెచ్చుకోండి..ప్లీజ్.. !
కలనైన నీ వలపే!

2 వ్యాఖ్యలు:

SNKR చెప్పారు...

హాయి గొలిపే హిందోళ రాగం
లీల గళం నుంచి జాలువారిన మాధుర్యం
ఘంటసాల స్వరపరిచిన ఓ అజరామరం

వనజవనమాలి చెప్పారు...

SNKR gaaru Thank you very much!!