5, జనవరి 2011, బుధవారం

నేలమీది జాబిలి..నింగిలోని సిరిమల్లి

నింగిలోని సిరిమల్లి -  నేలమీది జాబిలి 
నేలమీది జాబిలి..నింగిలోని సిరిమల్లి... ఎంత వైరుద్యమైన పోలిక..
ఈ పాట రాజా-రమేష్ చిత్రంలోని పాట. 

నా..చెలి నెచ్చెలి.. చేరుకోరావా నా.. కౌగిలి..  అనే ..(ఏ.యెన్.ఆర్)  రాజా రమేష్  చంద్ర భూపతి కవి హృదయం కి.. ఆత్రేయ కలం అందించిన..అపురూప మాలిక ఈ..పాట. నాకు చాల ఇష్టమైన పాట  

కే.వి.మహదేవన్ సంగీతం. 

మన తెలుగు పాటలలో..తొలి రాతిరి పాటలు.. చాలానే.. ఉన్నాయి.. కానీ.. ఈ..పాటలో..  వైవిధ్యముంది.. మొదటి చరణం.. సాఫీగా.. సాగుతుంది.. రెండో చరణం లో.. పునరుక్తి ఉంటుంది.

అది సాహిత్యం .. బట్టి.. సన్నివేశాన్ని బట్టి..  సాగుతుంది  .. వినేటప్పుడు గమనించండి.. 

ఈ పాటని బాలసుబ్రమణ్యం గారితో..పాటు ఎస్.జానకి గారితో..... పాడించారట.
తర్వాత ఏమైందో కానీ.. సినిమా.. విడుదల తర్వాత   చూస్తే..అ.. ట్రాక్ మారి.. సుశీల గారితో.. పాట ఉందట.. 

ఎస్ .జానకి గారు ఒక సందర్భంలో..ఈ విషయాన్ని  గుర్తు చేసుకున్నారు.. మంచి పాట... అది రొమాంటిక్ సాంగ్  .. 

ఆవిడ గళంలో..ఒదగలేదంటే  ఆశ్చర్యం కలుగక మానదు.  ఆమె పై అభిమానం ఉన్న నాకు  ఛాలా బాధ కల్గింది.. 

ఏమిటో .. ఈ.. తెరవెనుక  లీలలు!? 

సరే.. పాట సాహిత్యం ఇదుగోండి..  

చంద్రహారమే   అందమా...చంద్రముఖికి..

అందమా..చంద్రముఖి చంద్రహారమునకు..

మింట  చంద్రుడు తన పేరు రెంటిలోన కలదు కాన  ..

న్యాయం పలుకలేక నల్ల మబ్బుల చాటుకు.. వెళ్ళినాడు.. చందురుడు.

మబ్బుల చాటుకు వెళ్ళినాడు చంద్రుడు..

నేల మీద  జాబిలి.. నింగి లోన సిరి మల్లీ
నా.. చెలి.. నెచ్చెలి.. చేరుకోరాదా.. నా..కౌగిలి.. (నే)

పిలిచెను కౌగిలింత రమ్మని.. ఉండిపోమ్మనీ..

తెలెపెను పులకరింత ఇమ్మని..దోచి ఇమ్మనీ..

మనసుకు వయసు వచ్చు తీయని రేయిని..

వయసుకు మతిపోయి ఇవ్వని హాయిని..

తొలి.. ముద్దు ఇవ్వని..మలి ముద్దు కొసరని

మలిముద్దు ఏదని  మైమరచి అడగని..(నే)

వెన్నెల తెల్లబోయి తగ్గని తనకు సిగ్గని ..

కన్నులు.. సిగ్గు మాలి మొగ్గని .. కలలు నెగ్గని.. (వె)

పరచిన మల్లెపూలు.. పక్కుమని నవ్వని..

పగటికి..చోటివ్వక ఉండని.. రాత్రిని..

దీపాలు మలగని.. తాపాలు.. పెరగని..

రేపన్నదానిని.. ఈ..పూటే.. చూడనీ.. (నే)

అభినేత్రి వాణిశ్రీ.. అందం ఈ..పాటలో.... ఎక్సట్రా-ఆర్డినరి.

ఎందుకో.. పండు వెన్నెలని.. చూసినా ... మల్లెలని చూసినా.. ఈ..పాట.. మదిలో.. మెదలాడుతుంది.

పాట పరిమళం అది.. వెంటాడుతుంది..  వెంటనే.. వినాలనేంతగా..

 ఓ.కే. బై.   .. నేలమీది  జాబిలీ . నింగి లోని  సిరి  మల్లి ..వినండీ..
1 వ్యాఖ్య:

M. చెప్పారు...

చాలా బాగ చెప్పారు వనజ గారు, నిజంగా మీ ద్వారా నేను చాలా పాటలు మీ ద్వారా తెలుసుకున్నవే,, ఈ సందర్బములో ఒక పాట గుర్తు చేస్తాను, నేనొక ప్రేమ పిపాసిని. . . . . . . .

నేల మీద జాబిలి
పాట చాలా బాగుంది,
పిలిచెను కౌగిలింత రమ్మని.. ఉండిపోమ్మనీ..
తెలెపెను పులకరింత ఇమ్మని..దోచి ఇమ్మనీ.. (Shabbu,Knr)