7, జనవరి 2011, శుక్రవారం

నా చెలిమి కలిమి

కడవరకు ఈ..పయనం ఇలాగే!
అందంగా, ప్రేమగా.. అచ్చు..మీలా!
చిరు దీపమా!
నా చెలిమి కలిమి-మేలిమి బలిమి

ఈ రోజు ఉదయాన్నే..నన్నుపాట పలకరించలేదు..ఒక భావం నన్ను ప్రశ్నించింది.
నేను లేకుండ ఎవరైనా.. మన గలుగుతారా అని?

సమాధానంగా నేను గాలి అని..చెపుతానని అనుకుంటున్నారా? ఒక విధంగా..నిజమే అనుకోండి. కానీ
ఈ.. సృష్టిలో.. పశుపక్ష్యాదులు, జంతుజీవాలు సకల ప్రాణకోటి .. ఏవి కూడ స్నేహించ లేనిదే మనుగడ సాగించలేరు.. స్నేహం ప్రాణవాయువులాటిది. నా..ఊపిరి స్నేహం. నేను సంపాదించుకున్నది ఏమైనా ఉందంటే.. అది నా..చెలిమి కలిమి.

చాలామంది విద్య కూడా.. స్వంత ఆస్తిగా పరిగణిచడం కద్దు. కానీ మనం సంపాదించుకున్నది..స్నేహం మాత్రమే.

మన తల్లిదండ్రులు..మనకి జన్మ ఇస్తే..గురువులు..తమ పాండిత్యాన్ని,అనుభవాన్నిరంగరించి మనకి నేర్పిన విద్య మనం స్వంతంగా సంపాదించుకున్నది కాదని నా..భావన.

చిన్నప్పటి నుండి అమ్మని ప్రేమిస్తాము తోడ బుట్టినవారిని ప్రేమిస్తాము.. చెట్టుని ప్రేమిస్తాము.. పిట్టని ప్రేమిస్తాము..కానీ.. స్నేహాన్ని ప్రేమించడం మాత్రం కేవలం మన స్వంత ఆలోచన.

బాల్యంలో కల్లాకపటమెరుగని అమాయకమైన స్నేహం ..మనం బతుకు పుస్తకంలో.. పదిలంగా.. దాచుకున్ననెమలి ఈక. అది ఎప్పటికి.. మనని సున్నితంగా సృశిస్తూనే ఉంటుంది.

కొంత వయసు వచ్చాక మన అభిరుచులని బట్టి, మన ఆలోచనల బట్టి, స్నేహితులు ఏర్పడతారు. అది కేవలం మన ఎంపిక.

అలా నేను.. స్వాగతించిన స్నేహ బృందంలో వేళ్ళతో.. లెక్కించగల్గిన స్నేహితులు ఉన్నారు.. ఇలా.. ఎందుకు అనుకుటున్నానంటే వారి ప్రభావం నా పై చాలా ఉంది.కాబట్టి. ఒక పది పన్నెండు ఏళ్ళుగా.. నేను చెప్పే మాట ఒకటుంది.

"చెలిమి కలిమి కల్గిన బలిమి కన్నామేలిమి మరేది లేదు లోకాన ..బాధా పల్లవులు చివురించిన చోట స్నేహమే.. నీకున్న తోడు"అని.

ఈ.. మాట నా..హృదయంలో నుండి వచ్చింది. ఆ భావనని.. నాకు ఇచ్చిన నా .. స్నేహితుల గురించి చెప్పడం కూడ..నాకు చాలా ఇష్టం. అలా అని తతిమా..వారిని తక్కువ చేయడం నా.. ఉద్దేశ్యం కాదు.

మా ఇంటి ద్వారాలు నా.. స్నేహితుల కోసం ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి.. నా ఫోన్ కుశల ప్రశ్నలకై.. ఎప్పుడు మ్రోగుతూనే ఉంటుంది..అని గర్వంగా.. చెప్పుకుంటాను.

చిన్నపాటి ఆత్మీయమైన పలకరింపులకే.. ఏళ్ళ తరబడి.. నాతో ఇప్పటికి.. స్నేహంగా మెలిగే నా మిగిలిన మిత్రబృంధంకి.. క్షమాపణలు చెపుతూ వారితో కలిపి.. నాకున్న మంచి మిత్రుల గురించి మీతో..ముచ్చటిస్తున్నాను.

మొదటగా.. నాకుస్నేహపరిమళంఅంటే.. ఏమిటో.. తెలియచెప్పిన నాకన్నాపదేళ్ళు పెద్దది అయినమా.." కుసుమ" గురించి.. తనతో.. స్నేహం యాదృచ్చికంకాదు.. ఒకానొకప్పుడు.. బాధాతప్తహృదయంతో.. జీవితం బరువుగా.. అన్పించినప్పుడు.. ఒకవోదార్పుహస్తం..నాకు ఇచ్చి నన్ను.. నిలబెట్టి.. ఈరోజుకి ననువదలక కదలక.. నిలిచిననేస్తం.. తనంత మంచిమనసు ఎవరికి.. ఉండదు.. చాలా.. సాఫ్ట్. ఎన్నిడిగ్రీలు..ఉన్నా ఎంతోమందిని అలరించే ఉద్యోగంలోఉన్నాఎవరిని ఒప్పించక.. తనే..క్షణక్షణం నొచ్చుకుంటూ.. ఇంకా అమాయకంగా..బతుకులో నేర్పరితనంరాని పిచ్చి..తల్లి. నన్నుఎన్నటికి వీడని కుసుమపరాగం. తనఅండ-దండ ప్రోత్స్చాహం లేనిదే ఈ..వనజ ఇలా. ఉండేదికాదు.

క్రమంగా.. నన్ను నేను నిలబెట్టుకుని..దృడంగా ఉన్నాననుకున్నా లేనని తర్వాత తెలిసింది..ఒక ఆత్మ నూన్యతభావం వెంటాడి వేధించినప్పుడు ఆత్మహత్యప్రయత్నంలో ఉన్నప్పుడు..నన్ను ఆఖరి క్షణంలో అడ్డుకున్నస్వరం .. ప్రకాష్ .నిజంగా.. తేజం. ప్రపంచ పోకడల్ని తన స్నేహంలోనే తెలుసుకున్నాను. ఒక సమస్యని బొమ్మ-బొరుసు..లో.. చూసే..తన దృక్పధం మనిషికి.. ఎప్పటికైనా అవసరం.. సమాజం పోకడల్ని.. నిశితంగా గమనిచడం తను..నేర్పిందే..!

ఇక్కడ ఒక విషయం చెప్పాలి.. ఆడ-మగా స్నేహ సంబంధం గురించి..ఎవరో..ఏదో..అనుకుంటారన్న భయం గురించి.. నేను.. ఆలోచించనేలేదు.. ఒక స్నేహం ..ఒక ఆత్నీయత,ఒక సూచన.. ఇచ్చే వారు జెండర్ ఒకటే అయి ఉండాలన్న నిబంధన ఏమి లేదు కదా! పైగా.. నేను అలా ఆంక్షలు పెట్టె వాతావరణంలో పెరగలేదు. మా అమ్మగొప్ప దార్శనికత కల్గిన స్త్రీ. మమ్మల్నిస్వేచ్చగా.. ఎదగనిచ్చిన హృదయవాది. ఈ..చదువులు సంస్కారం..వ్యక్తిత్వం ఏర్పరచుకోవడం అమ్మే నేర్పింది .మంచిని పెంచడానికి పోటీ...చెడుని కాదు ..అన్న ఆమె ఒక్క మాటే నాకు వేదం.
మా అమ్మ నాకు జన్మ ఇస్తే.. నాకు పునర్జన్మ ..ఇచ్చిన ప్రకాష్..నాకు అమ్మతో..సమానం. ఈ..రోజుకి..వాళ్ళ ఆవిడ.. నాతో..మొత్తుకుంటూ ఉంటుంది. ఆంటీ!ఆయన మీకేమైనా..అర్ధం అవుతారా? అని. నిజంగా.. నా కు అర్ధం కాడు.. నాకన్నాఐదు ఆరేళ్ళు.. చిన్న. సో.. అది.. మా..ప్రకాష్ గురించి.. తనకి..నా సూచనలు నా.. స్నేహం మంచి దిశా నిర్దేశం ఇవ్వవచ్చునూ లేదా.లేకపోవచ్చు..కానీ..తన నుండి చాలా తెలుసుకున్నాను.. ఈ..రోజుకి..నాకు సమీపంలో..మంచి సలహాలతో నాకు అండ గా ఉన్నాడు.

ఇక ముచ్చటగా.. మూడు.నాతో పోటిపడుతూ..తెలివితేటలు.. చురుకు,అందచందం.. అన్ని ఎక్కువైన.. ఓ..అల్లరి పిల్ల.. నేను కి..మరో రూపం ఏమో అన్నంత షార్పుగా.. కుష్భూ.. నిజంగా.. పరిమళమే!.. మాట పరిమళం.. మనసు..సుమధురం. కానీ ఆంక్షల కుటుంబంలో.. కోడలిగా.. అందరికి దూరంగా.. మాటకి కూడా.. అందనంత .. దూరంగా.. తనతో.. నేను పంచుకున్నంత మాట,పాట, అంతరంగం ఇంకెవరితోనూ.. లేదని ఘంటాపధంగా ..చెప్పగలను.

ఇక నాలుగు.. నాకు.. మాత్రమే.. మొద్దు! చదివింది ఏడవ తరగతి అని చెప్పి మనని అత్యత్బుత తెలివితేటలతో ఐ. ఏ.ఎస్ లాటి ఉత్తమ స్థాయి కల వ్యక్తిగా.. మరో.. రూపం అనుకోవచ్చు ఏమో.. అని అనిపిస్తూ.. ఉంటూ.. మనసైన నా.. చల్లని నేస్తం. తనలా.. కూల్ కూల్ గా.. ఉండటం నేర్చుకుంటే.. చాలు..ఎవరికి యే సమస్యలు.. ఉండవు..అని అనిపించే అతి సాధారణంగా కనిపించే..అసాధారణ అత్యంత ప్రేమ భరిత నా..నెచ్చెలి.. లక్ష్మి.చక్కగా..పాడుతుంది. ఏకసందాగ్రహి. అప్పుడప్పుడు.. పిచ్చి ప్రశ్నలతో.. విసిగిస్తుంది..అడక్కుండానే..ప్రాణ మిత్రులకి.. ప్రాణం కూడ.. ఇచ్చేస్తుంది.. తిక్క ఎక్కితే.. నేను ఎక్కడ.. చదువు సంద్యలు రాని మొద్దుని అంటుంది. తన ముగ్గురు బిడ్డలని చక్కగా..చదివిస్తూ.. ఒక ఇల్లాలిగా వ్యాపారిగా..ఒంటి చేత్తో..అన్ని చేయగల సమర్ధతాశీలి.. ఏమి మనసు విప్పి చెప్పవసరం లేదు..అంతా.. గ్రహించేసి మనలని..పిచ్చి వాళ్ళని చేసేసి.. పక పక నవ్వుతూ నవ్విస్తూ ఆహ్లదం పంచుతూ... అమ్మో.. తనే.. నా రోల్ మోడల్.

ఇక అయిదు.. సమీర్..మళ్లీ పరిమళమే.! ముక్కు సూటిగా.. నిర్మొహమాటంగా.. భావ పరిమళం వెదజల్లుతూ.. ఎప్పుడూ.. ఒకేలా.. ఏళ్ళ తరబడి.. నా.. స్నేహ వనంలో.. ఓ.. సమీరం..

అంతరంగం తెలియనివ్వని.. నిగూడ నిశ్శబ్ద భావ సంచనల రూపం. వృత్తికి ..ప్రవృత్తికి. హస్తిమశకంతరబేధం. నాకు.. మనో నిబ్బరాన్ని.. నేర్పిన వ్యక్తి. గామా గామా హంగామా..పాటకి ప్రతి రూపంగా నిలుస్తూ.. స్నేహం పునాదులని అండర్ స్టాండింగ్, కేరింగ్, షేరింగ్, సపోర్టింగ్..అనే..నాలుగు ముఖ్య సూత్రాలకి..అర్ధం గా..నిలిచి.. నా..కష్టాన్నితన కష్టంగా.. నా ఫీలింగ్ని తన ఫీలింగ్ గా.. భావించే మనసైన నేస్తం.

వీళ్ళు..అందరూ నన్ను మంచిగా ప్రభావితం చేసినవారు.. నా.. చేతిలో దీపమై.. నాకు వెలుగు చూపినవారు. వీళ్ళ స్నేహంలో.. నన్ను నేను.. చూసుకుంటాను. నన్ను.. హర్ట్ చేసినా నా మంచిని కోరేవారు...వీరందరు.

స్నేహానికి విస్తృత అర్ధం మారిపోతున్న ఈ.. గ్లోబలైజేషన్లో.. మనుషులు కొన్నిసార్లు..తప్పు అని తెలియకుండానే.. తప్పు చేసినప్పుడు.. స్నేహితులు అది గమనించి సున్నితంగా.. హెచ్చరించి దిశానిర్దేశాన్ని.. చేయాలి. ఎవరు క్లీన్ చిట్ ఉండరు కదా! వ్యక్తిత్వాన్ని కించపరచడం, వారికి.. తెలిసిందే..నిజం అనుకోవడం తప్పు కదా! అంతరంగాన్ని క్యాచ్ చేయగలగడమే.. స్నేహం అంటే! వ్యక్తుల మనస్తత్వం వాళ్ళ ఆలోచన ధోరణిలో.. బయటపడుతుందని.. నాకు గొప్ప నమ్మకం.

స్నేహాన్ని అడ్డుగా..పెట్టుకుని చెడ్డపనులు చేసేవారు..నాకు నచ్చరు.. కుటుంబ జీవనంలో..ఇతరుల ఆనంద జీవనాన్ని.. దోచుకోవాలనుకునే.. దుగ్ధ లేకుండా.. స్వచ్చంగా.. స్నేహం చేయగలను అనుకుంటే స్నేహం చేయాలి కదా!

మనిషిగా మనుషులని, మనసులని ప్రేమిస్తూ.. స్నేహన్ని,ప్రేమని లింగ భేదాలు లేకుండా..పంచగల్గే మనస్సు అందరిలో.. ఉండాలని కోరుకుంటాను.

స్నేహం అంటూ ప్రవేశించి ఎవరి జీవితంలోను.. మూడవ వ్యక్తి కాకుండా.. ఆత్మీయంగా.. కష్ట-సుఖాలు పంచుకునే తోడుగా.. మనలని అందరూ కష్టకాలంలో తలుచుకుంటూ మన సలహాను, ఆదరణను.. పొందే విధంగా ఉండగలగటమే.. స్నేహం అంటే.. అంటాను.


వీరు కాక.. నా జీవన ప్రయాణంలో.. ఎంతో మంది మిత్రులు, హితులు,సన్నిహితులు, ఆత్మీయులు.. అందరు..నాకు.. ప్రీతిపాత్రమైన వారే! ముఖ్యంగా.. సంజయ్ (డిల్లి). ఫోన్ ఫ్రెండ్ గా.. పరిచయమై.. స్నేహ అమృతాన్ని పంచిన వ్యక్తి.. బాష రాకున్న.. స్నేహ బాష తిలిసిన మంచి కవితాప్రియుడు, హాస్య చతురత కల్గినవాడు తన కూతురికి.. నా పేరు పెట్టుకున్న స్నేహప్రియుడు.

అలాగే.. హీరా.. నా.. ప్రేమని  పొందిన పుత్రికా సమానురాలు .

ఆఖరిగా.. మా.. కుసుమ కుసుమపరాగం.. మా..సమీర్.. పరిమళం.. స్వచ్చంగా, స్నేహంగా.. నాకెంతో ఇష్టంగా..

ఇది.. నా.. చెలిమి..కలిమి. జన్మ జన్మలకి.. మీరే..మీరే.. నా.. మనసెరిగిన నేస్తాలు కావాలని కోరుకుంటూ.. ఇలాగే మిమ్మల్ని నేను విసిగించాలని కోరుకుంటూ..

నేను నవ్వితే..నవ్వి, నేను ఏడిస్తే ఏడ్చి నా కోసం నాలా..తపన పడిన.. మీ అందరికి ఐ...లవ్ యు..సో.. మచ్ మై డియర్స్

నా.. ప్రతి పథంలోను, నా..మనసులోనూ..మీ చోటు పదిలం పదిలం.

కృతజ్ఞతలు చెప్పటానికి మీ నేస్తానికి మళ్లీ ఇంకో జన్మ కావాలి.

ప్రేమతో..మీ....వనజ.

దీపమై దారి చూపుతూ.
నా చెలిమి కలిమి


స్నేహం పునాదిగా
మరు జన్మకైనా.. మీరే నా నేస్తాలుగా..!!!!!
క్లిష్ట సమయంలో..తోడుగా