3, ఫిబ్రవరి 2011, గురువారం

దూరాకాశ వీధుల్లో.. తారా దీపాలు.. భారమైన గుండెల్లో ఆరని దీపాలు...

ఓ" అన్వేషణ 
ఆశా దీపం 
ఎదురు చూపుల బాధలో ఎందుకో..ఈ..తీయదనం. ఎదురుపడితే ఎదను తెరచి చెప్పలేని మూగతనం..

ఇలా నేను చెప్పడంలేదు ఎక్కడో చదివి.. బాగా నచ్చేసి అలా..మైండ్ లో.. స్టోర్ చేసి పెట్టుకున్నాను.

నిజంగా  వలచిన  మనసెంత మధురమో!వగచిన హృదయం యెంత భారమో! అన్వేషణ ఎంత శూన్యమో!.

ఒకో సారి దుఖం  ఆనవాలు కనపడకుండా దొంగలా మనసుని కృంగదీసి,మనిషిని ఒంటరిని చేస్తుంది..ఎన్ని ఒంటరి హృదయాలు..తోడు కోసం పరితపిస్తూ.. లభించిన వాటిలో.. ఏది.. సత్యమో.. ఏది అసత్యమో..తెలియక జీవన పర్యంతం మోసంలోను,అయోమయంలోను,వేదనతోను ..భారంగా రోజులు వెళ్ళదీస్తూ పాడుకునే పాట..

 నా చిన్నప్పుడు నుండి ఈ..పాటంటే  ఎందుకో.. ఇష్టం. రేడియోలో ఈ పాట వింటూ..చాలా.. విషాదంగా మౌనంగా.. ఉండేదాన్ని. ఈ పాట వింటుంటే ఏదో.. చెప్పలనవికాని బాధ అమాంతం  మనలని..విషాద సాగరంలో ముంచెత్తుతుంది. కలకూజితం ఎస్.జానకి గళంలో ఒలికిన ఈ.. గీతం" మాయావి" అనే కన్నడ  డబ్బింగ్ చిత్రంలో పాట." సత్యం" సంగీతం.. డి కృష్ణ మూర్తి... పద రచన..విన్నప్పుడల్లా.. నేను ఎంత మూగగా రోదిస్తానో! ఎందుకో,ఏమిటో నాకే తెలియదు.

 పాట సాహిత్యం మీరు.. గమనించండి..

దూరాకాశ వీధుల్లోతారా దీపాలు
భారమైన  గుండెల్లో ఆరని దీపాలు
ఆరక, ఊరక ఊగాలి ఆశాదీపాలు (దూ)

 తోడు దొరకని బ్రతుకులలో..తోచే శోధనలు..
మాయలెరుగని మనసులలో మండే వేదనలు..
కనిపెట్టి కరుణించేవి, కరుణించి కాపాడేవి (దూ)

మూసే చీకటి ముసుగులలోదాగినవి ఎన్నెన్నో
చేసే మాయలవేషం వెనుక దాగినవి ఏమేవో
పయనించి పరికించేవి,పరికించి పాలించేది (దూ)
పాట సాహిత్యం  ఎలా ఉంది..!? ఫ్రెండ్స్ఈ పాట ఎస్ జానకి గారి గళం లో వచ్చిన మంచి పాట .
అంత అరుదైన పాట ఇది. విషాదం అయినా ఆనందం నాకు..

 అందుకే వింటూ ! వినిపిస్తూ..విసిగిస్తూ..  నాకు ఎన్నెన్నో..పాటలు పరిచయం చేసి..జీవన ప్రయాణంలో.. నన్నుసేద తీర్చిన ఆకాశవాణికి.. కృతజ్ఞతలతో..ఈ..పాట పరిచయం .  దూరాకాశ వీధుల్లో తారా దీపాలు  

1 వ్యాఖ్య:

అజ్ఞాత చెప్పారు...

chala kalam thravatha naku gurthu theppincharee paatani. thanks andi.
ramakrishna