12, ఫిబ్రవరి 2011, శనివారం

రమణి చెరని దాటించిన రామ చంద్రుడా! రాధ మదిని వేధించిన శ్యామ సుందరా!

 ఓల్డ్  ఈస్  గోల్డ్ అన్న నానుడి..
అందుకు భిన్నంగా..న్యూ ఆల్సో గోల్డ్.. అని అప్పుడప్పుడు అనుకుంటూ.. ఉండాలి కూడా..
అది..ఈ కాలం పాటల విషయంలో..నాకు నచ్చిన పాట..
ఈ..కాలపు పాట..(అంటారేమో) స్వరాల "మణి" శర్మ కంపోజీషన్లో.. కే  ఎస్ .చిత్ర  పాడిన పాట. 

"నిన్నే నిన్నే..అల్లుకుని కుసుమించే గంధం నేనవనీ..
నన్నేనీలో కలుపుకుని కొలువుంచే మంత్రం నీవవనీ..
ప్రతి పూట పువ్వై పుడతా.. నిన్నే చేరి మురిసేలా..
 ప్రతి అణువూ కోవెలనవుతా..నువ్వే నెలవు తీరేలా.. 
నూరేళ్ళు..నన్ను..నీవవనీ.. 

వెన్నుతట్టి మేలుకొలిపిన వేకువ నువ్వే..
కన్నెఈడు వేళ మరచిన వేళవు నువ్వే ..
 వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే..
 తాళి కట్టి ఏలవలసిన దొరవి నువ్వే..
రమణి చెరని దాటించిన రామ చంద్రుడా!
 రాధ మదిని వేధించిన శ్యామ సుందరా! 
మనసిచ్చిన నెచ్చెలి ముచ్చట పండించవా!? (నిన్నే)

 ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా..
 శ్వాస వీణలోని మధురిమ నీవే సుమా..
గంగ పొంగునాపగల్గిన కైలాసమా..
కొంగు ముళ్ళలో ఒదిగిన వైకుంటమా!
ప్రాయమంత కరిగించి ధారపోయనా..
ఆయువంత వెలిగించి హారతివ్వనా..(నిన్నే)

ఇది పాట సాహిత్యం.. ఎక్కడ..పునరుక్తి అనేది లేకుండా..
పల్లవి..చరణాలు రెండు..అంతే..పాట వింటుంటే..
పాటకి సాహిత్యం ఇచ్చిన తర్వాతే.. ట్యూను కట్టినట్లు..అర్ధం అవుతుంది. 
కృష్ణవంశీ కదా!..పాట సాహిత్యం ఎంత బాగుంటుందో! 

ఒక కన్నె మదిలోని..అంకిత భావం పురుషుడి చుట్టూ  పరిభ్రమిస్తూ..
వ్యక్తీకరణలో..అంతటి  గాడతని చెప్పడం.." సిరివెన్నెల" కే సాధ్యమేమో! 

అది.. పోలికతో.. చెప్పడం.

 అందుకే.. సిరివెన్నెల పాటంటే..నాకు అభిమానం..

 "శశిరేఖాపరిణయం" లో.. ఈ..పాటంటే..నాకు.. చాలా ఇష్టం. 

చిత్రం ఆఖరిలో.. ఈ పాట   ఉంటుంది. 
అందుమూలంగా ఈ పాటని.. చాలా మంది అయిష్టంగా.. వదిలి బయటికి రావాల్సి రావడం బాధాకరం.. వేరే విధంగా.. చూసి  ఆనందపదాల్సిందే! 

చిత్రీకరణ ఛాలా బాగుంటుంది.పాట పాతధైతే ఏమిటి కొత్త దైతే ఏమిటి..భావం బాగుండాలి కానీ..వినసొంపుగా.. ఉండాలి కానీ..అందుకే..న్యూ ఆల్సో..గోల్డ్.. అంటాను నేను.. నచ్చితే మీరు వినండీ! .ఈ  లింక్  లో నిన్నే   నిన్నే  అల్లుకుని      ..