22, ఫిబ్రవరి 2011, మంగళవారం

పరదేశి కోసం ఈ..అన్వేషణ .

ఒక ప్రేమికుడి అన్వేషణ హృదయాన్ని తాకితే
దానికి సుమధర సంగీతం తోడైతే..  
ఆ భావన.మధురమైన వేదన మీకు ఎలా ఉంటుంది!? 
నాకైతే.. మళ్ళీ మల్లి .. వినాలనిపిస్తుంది. 

నాకిష్టమైన ఆ పాటే.. 

చూశారా.. చూశారా.!? చూశారా ..!?? చూశారా......!? 
నా పరదేశిని! ప్రియభాసిని!  
అనురాగ సీమలోని ప్రేమ సుమాన్ని.. చూశారా!? 
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. రోజు నిన్ను పూజిస్తున్నాను...
చేయి చేయి కలవని, వెయ్యేళ్ళ ఈ స్నేహం నిలవని, 
జతలో తుదిలేని కథలే మొదలవనీ, 
హాయి రెమ్మల కోయిలమ్మల కొంటె పలుకుల ఆ.. పరదేశిని.. సహవాసిని..
హృదయ్యాన్ని దోచుకున్న సౌందర్యాన్ని చూశారా..? మీరైనా.. చూశారా!?  

రాగం -భావం మనమే కావాలి,
లోకం మొత్తం మనదై పోవాలి.. 
అందని చుక్కల సాక్షిగా, నీకు అందిన చెక్కిలి సాక్షిగా...
చేరి సగమవ్వాలి...చరితగా మిగలాలి.. 
జన్మజన్మకి తోడు నేనని జోల పాడిన నా ద్రువతారని, యువరాణిని..  
తోలిప్రేమలోని తీపి తెలిపిన చెలిని .. అమ్మా మీరైనా చూశారా..!?  
అంటూ..ఆర్తిగా అడుగుతూ.. వెతుకుతూ.. ఓ..ప్రేమికుడు ..గుండె పిలుపు వినబడుతుంది..
ఈ.. అందమైన పాట మీరు వినండి .  Permalink లో.. వినండీ ..