4, ఏప్రిల్ 2011, సోమవారం

ప్రియురాలి నిరీక్షణ,ఆమని పిలుపు వేరసీ ఈ పాట. అందమైన భావం వెంటాడుతూ..

ఏటి  దాపున  తోట లోపల ఎవరినే పిలిచేవు కోయిల ఈ ఎడమ  ప్రక్కనే ఉన్నఈ లింక్ లో.. చక్కని తేనెలొలుకు తెలుగు పాత  పాట ... ఈ.. శ్రీ ఖర నామ  సంవత్సర "ఉగాది " పూట వినండి.. మత్త కోకిల కుహు రాగాలని అంతకు మించిన సాహిత్యాన్ని ఈ తెలుగు వెలుగులుని, పాట పరిమళాన్నిఆస్వాదించండి . . నాకు ఎంతో ఇష్టమైన పాట "ప్రేమ కానుక" చిత్రం లో.. పాట. సంగీతం.. తాతినేని చలపతిరావు. పద రచయిత  భావకవి దేవులపల్లి కృష్ణ శాస్త్రి. గానం: పి.సుశీల. వసంతం ఆగమనం కోయిల పిలుపులు.. మల్లెల పరిమళం. ప్రకృతి కన్య .. వసంతుడి ఒడిలో..ఒదగడానికి.. చెంగు  చెంగున దుముకుతూ.. అతని రాకకై ఎదురుతెన్నులు  చూస్తూ  .పలికే కోయిల ని అడుగుతుంది. ఆకు రాలిన చోటనే చిగురు పుడుతుంది. ప్రేమ ఉన్న చోటనే విరహం ఉంటుంది..ప్రియురాలి నిరీక్షణ,ఆమని పిలుపు వేరసీ ఈ పాట. అందమైన భావం వెంటాడుతూ..