4, ఏప్రిల్ 2011, సోమవారం

శూన్యాక్షరాల గవాక్షాలలో నిలిచాను నిరుపేద గీతాలతో. మది గాయాలుగా,మధు గేయాలుగా... ఎన్నాళ్ళు ఈ వేదనా

ఊహాసుందరి  
ఇది నా జీవిత ఆలాపన . ప్రియ దేవతాన్వేషణ.. ఏమైనదో..ఏట దాగున్నదో.. ఎన్నాళ్ళీ అన్వేషణ? ఆ అన్వేషణ ముగిసేనా?

ఒక మది గాయం గేయమై ఆవేదనతో.. ఆలపించే వేళ..
ఆ "వేదన " వినడం కూడా.. మధురమైన వేదనే!
ఒకోసారి మనది కాని వేదన కూడా మనదిగా అనుభవిస్తూ ఉంటాము.
అలా ఏదైనా పాట విని ఆ పాటకి అభిమానిని అయి  విన్న ప్రతి సారి నేను గాడమైన వేదనని రోజుల తరబడి..అనుభవిస్తూ..అందులో లీనమైపోతాను.

 అలాటి పాటే "సువర్ణ సుందరి"  చిత్రంలో.. ఈ పాట. సాహిత్య చూడండి.. ఎంత ఎక్సలెంట్!

"పోలి మేర దాటాను భావాలలో..
పోలి కేకనయ్యాను రాగాలలో..
శూన్యాక్షరాల  గవాక్షాలలో
నిలిచాను నిరు  పేద గీతాలతో..
మది గాయాలుగా మధు గేయాలుగా...
ఎన్నాళ్ళు ఈ వేదనా ?
ఎన్నాళ్ళు ఈ వేదనా!!!?

మంజీరమైనాను నీ పాటలో..
మందారమైనాను..నీ తోటలో..
మౌన స్వరాన  ఈ పంజరానా..
కరిగాను కడ లేని స్వప్నాలలో..
విధి నటనాలలో..ఋతుపవనాలలో..
ఎన్నాళ్ళు ఈ వేదనా?

ఈ.. పాట సాహిత్యానికి.. నేను వీర అభిమానిని.
అందునా ఎస్ .పి.బాలు,కలకూజితం ఎస్ జానకి గళం పాటకి జీవం పోశాయి.

వేటూరి సాహిత్యం -రమేష్ నాయుడు సంగీతం అద్భుతం.

ఎందుకో వేటూరి గారి సాహిత్యానికి నాయుడు గారి సంగీతానికి అవినాభావ సంబంధం.వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చినన్ని హిట్ పాటలు.. ఇంకెవరికి రాలేదు. వేటూరిగారు  ఎన్నోసార్లు స్వయంగా చెప్పారు కూడా..!

 చిత్ర కథానుగుణంగా పతాకస్థాయి  సన్నివేశంగా...ఈ అంతిమ శ్వాస నీ కవితలో ప్రాస అవుతుందని చేసానులే బాస..అంటూ..సాగిపోయే పాట..మీరు విని ఆనందించాల్సిందే.!  ఇది పాటల తోటమాలి వేటూరి పాట.నాకిష్టమైన పాట.

 ఇక్కడ ఇచ్చిన లింక్లో నినండి..ఇది  నా  జీవిత  ఆలాపన ..    నాలా నచ్చితే మరీ మరీ వినండి  ప్లీజ్ !!!!