12, ఏప్రిల్ 2011, మంగళవారం

ఒక తోటలో....

"మరకతమణి" సతీమణి తో.. 
కీరవాణి సంగీతం అంటే..ఏమిటంటే..

అమ్మో..!నేను చెప్పడమే..? లబ్ద ప్రతిష్టులైన వారు చెబితే తెలుసుకోవడమే తప్ప..విని భాషతో..చెప్పలేని భావ స్వాదనలో తెలియాడడం తప్ప..వారి స్వరకల్పనని నిర్వచించే సాహసం చేయడమే!!

స్వీట్ మెలోడి కి పేరెన్నిక మాత్రమే కాదు...బీట్ తో..కూడా సంగీత ప్రియులని ఉర్రూతలూగించగలగ  "మరకతమణి" ఎమ్.ఎమ్.కీరవాణి స్వరకల్పనలో.. ఒక మంచి పాటని పరిచయం చేయబోతున్నాను. ఆ పాట నాకు చాలా చాలా ఇష్టమైన పాట.


ఒక తోటలో.. ఒక కొమ్మకి ఒక పూవు పూసింది ...అంటూ. "చంద్ర బోస్" పదాల అల్లిక..

ఈ..అందమైన అక్షర గీతిక.విన్నంతనే ఎంతగా అలరిస్తుంది అంటే.. ఓహ్..చెప్పలేం.సాహిత్యం + సంగీతం

ఎస్.పి.చరణ్,మాళవికల గళాలు..దర్శకేంద్రుడి చిత్రీకరణ.. ఒకటేమిటి .. అన్ని..అందంగా అమరిన ఒక మంచి భావ గీతిక ఈ..పాట. ఎందుకో సాహిత్యం అమితంగా నచ్చేస్తుంది నాకు.

ఒక తోటలో.. ఒక కొమ్మలో ఒక పూవు పూసింది..
మహారాజులా..మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది...
ఇలాగే నవ్వుతూ ఉండాలని..
చెట్టు చేమ గువ్వా గూడు ఆశ్వీరదించాలి...

ఎన్నో రంగుల పువ్వు ఎండ కన్నె ఎరుగని పువ్వు
సుందరమైన పువ్వు సుకుమారమైన పువ్వు
ఏ గుడిలోఅడుగు పెట్టునో..దేవుడు చల్లగా చూడాలి ..
దేవుని గుడిలో ఆ పువ్వు హాయిగా ఉండాలి..
ఇది మాలి కోరిక .. 

మరి  పువ్వు ఏం కోరుకుంటుందో మీరే వినండి..చూడండి.

 ఒక తోటలో ఒక కొమ్మకి  ఒక పూవు పూసింది.


అలాగే.. కీరవాణి గారు  సతిసమేతంగా ఉన్న చిత్రం చూడండి.


ఎవరికైనా మనసు బాగోలేకపోతే కీరవాణి పాట వినండి..మెలోడి అయిన,బీట్ అయినా,ఆఫ్ బీట్ అయినా,లిరిక్ అయినా,గళ మైనా.. "అమ్మ"ఒడిలో..సేదతీరినట్లే.. అని.. నా భావన.


ఈ..పాట "గంగోత్రి" చిత్రం లో పాట. విని నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో..చెప్పండి ప్లీజ్!!!