16, ఏప్రిల్ 2011, శనివారం

ప్రతి ఎదలో ఏదో ఒక రాగాన్ని మీటుతూ..వెళ్ళిపోయావా!? సౌందర్యమా! అనంత సౌందర్యమా!

  మాయదారి మాయదారి అందమా !!!!  మహా మాయ చేయోద్దమ్మా!?కల లాటి ఒక  నిజం మనల్ని మాయ చేసి మాయమైంది. ఒక అనంత సౌందర్యం అగ్ని కీలలలో మాడి మసి అయిపోయి ఏడేళ్ళు అవుతుంది. ఆమె కోసం కన్నీరు కార్చని గుండె  లేదంటే..అతిశయోక్తి కాదు.ఆమె ముద్ర.. చెరగని,తరగని మేలిమి ముద్ర...అయ్యో!! భగవంతుడు ఎంత కర్కశడు...నిర్దయగా ఎంత మంది హృదయం .లో.. తీరని బాధ కల్గించాడు. ఆమె లేదంటే.. ఎవరికీ ఈ నాటికి .. జీర్ణం చేసుకోవడం ఎంత కష్టం?.పువ్వు లాంటి సౌందర్యం,చెరగని దరహాసం ని..మేమెలా మరువగలం..!? నటన కాదు కాదు.. ప్రతి ఇంటా తెర మీద చూసి.. నట్టింట్లో..తిరుగాడే..సొంత చెల్లినో..లేక తమ  చెలినో.. చూసుకున్నారు ఆ  ఆనందం తో..పది కాలాలు.. ఆమెని చూసి మురవకుండానే.. మనసులకి మరింత దగ్గర చేసి మనిషిని దూరం చేసి.. గుండెల్లో గుడి కట్టండి..అని.. చెప్పి తన నివాసాన మరో సౌగంధి కగా .. ఆమెని నిలుపుకున్నాడేమో!  ప్రతి ఎదలో.. ఏదో ఒక రాగాన్ని  మీటుతూ..వెళ్ళిపోయావా!? సౌందర్యమా! అనంత సౌందర్యమా!!  నిన్ను ఎడ బాసిన  ప్రతి ఎద .. నిను  తన ఇంటి ముందు ఉన్న తులసి మొక్కలో..చూసుకుంటుంది. నీ ముద్ర..వర్ణింప శక్యం కాక, నీ జ్ఞాపకం  నా నయనం ని చెమరింప చేస్తుంది.  హృదయాన్ని సంద్రం చేస్తుంది. నీవు  లేవన్న వాస్తవం వెక్కిరిస్తింది.. నిన్ను చిత్రాలలో చూస్తూ.. ఉన్నావని భ్రమపడుతూ .. కాలం నెట్టమంటుంది. గుండె గుడిలో.. కొలువైన సౌందర్యమా.. నీవు లేక ఏడేళ్ళా? ఏడేడు కాలాలు..నీ ముద్ర కమనీయం.  కాదు కాదు రమణీయం. ఆమె జ్ఞాపకం  వెన్నెల  సోయగం.పువ్వుల పరిమళం. ఘటన క్రూరం..నటన అజరామరం.. అందరి యెదలో..సుమధరం. ఆమె అందం ఒక పాటలో. పైన లింక్ లో .. ...