21, ఏప్రిల్ 2011, గురువారం

"నగ్నసత్యం" ఎక్కడో పుట్టి,ఎక్కడో పెరిగి, ఎక్కడో కలసి...ఏకమైపోతారు ఎందుకో!?

"నగ్నసత్యం" చూసారా! ఎప్పుడైనా  విన్నారా?ఏమిటో !ఈ మద్య అంతా..నర్మగర్భంగా చెబుతున్నట్లు పెద్ద బిల్డప్ లు ఇస్తున్నావు.చెప్పేదేదో..సూటిగా చెప్పకూడదూ..చంపక.. అంటూ...నన్ను తొందర చేసే నా నేస్తం కోసం.. ఈ నగ్నసత్యాన్ని..దొరకబుచ్చుకుని.. బ్లాగుముఖంగా చెబుతున్నా.. ఇది చూసి  నగ్నసత్యాన్నివినడం అవలేదని నా నేస్తంతో పాటు.. మీరు కోపగించుకోకండి.ఎందుకంటే.. ఈ.. టైటిల్ చూడగానే..నేనేదో.. ఇంటరెస్టింగ్..మేటర్ ని.. మోసుకుస్తున్నాను..అనుకున్నారేమో!( నీకు అంత లేదమ్మా!అనుకున్నా..ఐ డోంట్ ఫీల్ ఇట్) అదేం కాదండీ! కానీ.. చాలా రోజులుగా మనసులో..మెదిలే  ఆ విషయం వెళ్ళ గ్రక్కాలని.. తెగ తొందరపడుతున్నాను. అందుకే.. ఇప్పుడు.. ఇలాగే.. చెబుతున్నాను.. అందరు..వినేటట్లు..ఆ "నగ్నసత్యం" చెప్పాలంటే..ఏ "సాహిత్య అభిమాని"  "జాను సొగసులతెనుగు" బ్లాగ్ వారులో.. శబ్ద ముద్రణ లోకి తేగలరు... తప్ప నా వల్ల కాదండీ!! ఎందుకంటే ఎన్నో..అపురూపమైనవి మన బ్లాగర్లకి పరిచయం చేసే వారు ఇరువు మాత్రమే! ఇది మాత్రం "నగ్నసత్యం" సుమండీ!!

          నేను పరిచయం చేయబోయేది.. ఒక పాట మాత్రమే! ఆ పాట "నగ్నసత్యం" అనే చిత్రం లో..పాట. జి.ఆనంద్ గళంలో..వినడం నాకు బాగా నచ్చేసింది. అభ్యుదయ రచయిత యు.విశ్వేశ్వరరావు గారు వ్రాసిన పాట అది. స్వరాలూ ఏమో..చక్తవర్తి గారు అన్నమాట. తారాగణం నాకు తెలియదు. ఈ పాట మన వలలోకంలో..వలవేసినా  పట్టలేంకూడా..ఎందుకంటే? అక్కడ ఉంటేగా!! వినిపిస్తూ పరిచయం చేద్దామని అనుకున్నాను. కానీ ఇది చూసి ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకేసి.. పాటని వాళ్ళ బ్లాగ్ లో.. (పోస్ట్ లో ).. అయినా వెనకేసుకుంటే.వినవచ్చని  నా ఆశ..
                                       
 పాట సాహిత్యం.. ఇదుగోండి..


ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో కలసి 
ఏకమైపోతారు ఎందుకో..
ఎందుకో.ఎందుకో ఎందుకో..
అనుకోనిబందాలు అనురాగబంధాలు 
అవి ఏమిటో అవి ఎందుకో... 
ఏమిటో ఎందుకో.

ఎక్కడక్కడో తిరిగి తిరిగి కొన్నాళ్ళు 
ఎవరినో చూసారు ఒకనాడు
ఆలుమగలయ్యారు మరునాడు {ఆ} 
ఎందుకో ఎందుకో ఎందుకో..
అంతవరకులేని  దాంపత్య బంధం 
ఏమిటో ఏమిటో అది ఎందుకో 
ఏమిటో ఎందుకో {ఎ}
ఒకడు జీవించేది తన కోసం
ఒకడు శ్రమించేది నీ కోసం 
ఇద్దరు ఒకటైన సంతోషం {ఇ}
ఎందుకో ఎందుకో 
విడరాని బంధం ఆ స్నేహ బంధం 
ఏమిటో ఏమిటో అది ఎందుకో 
ఏమిటో ఎందుకో{ఎ}
 అడివిలో  పుట్టింది ఒక పువ్వు 
నడివీధి నలిగింది అ పువ్వు 
నా చెంత చేరింది ఈనాడు 
ఎందుకో ఎందుకో ఎందుకో 
చెంత చేరిన బంధం 
చెల్లాయి అనుబంధం 
ఏమిటో ఏమిటో ఇది ఎందుకో 
ఏమిటో  ఎందుకో{ఎ}
     
                               నిజం కదండీ! ఏమిటో.. ఎందుకో..బంధాలు-అనుబంధాలు. ఎవరికి ఎప్పుడు ఎందుకు అనుబంధమో ! ఈ పాట విన్నప్పుడల్లా.. ఆకాశం తెగిపడితే ఎలా అన్నట్లు ఆలోచిస్తూ..ఉంటాను. పాట వింటూ లిరిక్స్ వ్రాసుకోవడం నాకు అలవాటు. కానీ.. ఈ పాటకి . లిరిక్స్ అందించించిన మా "మై డియర్ వైషూ" కి (వైష్ణవికి) థాంక్స్ .. చెబుతూ.. ఆ అనుబంధం ఏమిటో ఎందుకో.. అన్నిటికన్నా ఈ..పాటల అనుబంధం ఏమిటో!! ఎక్కడైనా