8, మే 2011, ఆదివారం

అమ్మ" అంటే...

"అమ్మ" అంటే  ఇవ్వడానికి అందరికన్నా ముందు ఉండే  అవని..  
'అమ్మ"అంటే..ఆది గురువు.
"అమ్మ " అంటే.. ఇలలో..దైవం 
"అమ్మ" అంటే .. ఈ సృష్టికే  ఆకృతి 
అమ్మ" అంటే బిడ్డలని ఉన్నత శిఖరాలకి చేర్చే వాహకం 
"అమ్మ" అంటే నెత్తుటి ముద్దకి ఊపిరి ఊదిన "బ్రహ్మ"
"అమ్మ"  అంటే ఋతువులన్ని నింపుకున్న "ప్రకృతి" 
'అమ్మ' అంటే కరుణా అంతరంగ 
 "అమ్మ" అంటే మమతల ఖని 
"అమ్మ" అంటే గగన సదృశ్యం  
"అమ్మ" అంటే  అన్నీ! 
 అందుకే అమ్మ మాటలు విందాం.. కొన్ని అయినా ..
" ఏ కవి కలానికి అందనిది... ఏ సూక్ష్మ దర్శినికి చిక్కనిది "అమ్మ"
  

 "అమ్మ"  కి  నిత్యం తొలి వందనం.. "అమ్మ" కి  శతసహస్ర పాదాభివందనం. అమ్మ లందరికి.. అమ్మ మనసు ఉన్న అందరికి ..మాతృ  దినోత్శవ  శుభాకాంక్షలు     

2 వ్యాఖ్యలు:

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

baagundi "amma" kavita :-)
Happy Mothers Day!

వనజవనమాలి చెప్పారు...

andhariki dhanyavaadhamulu