9, మే 2011, సోమవారం

కష్టాలన్నీఆర్ టి సి బస్ ల్లా వెంట వెంటనే వస్తాయి!? కాదు గాక కాదు ఇప్పుడు ఎప్పుడు రావాలో అప్పుడే!.

బెజవాడ  రోడ్లపై  పరుగులు 
 అవునండీ! నేను చెప్పినది నిజమే! ఎక్కడైనా బస్సు లు నడుస్తాయి.. నడుస్తున్నాయి అంటారు .. కానీ పరుగులు పెడతాయా!? అంటారా? నిజం మా బెజవాడ రోడ్లపై .. పైన చూస్తున్న మెట్రో బస్ లు పరుగులే పడుతున్నాయి. మహానగరాల్లో..ట్రాఫిక్ ఎక్కువ..కాబట్టి.. అక్కడ ప్రజలకి,బస్సులకి  నత్త నడక అలవాటు. టూ వీలర్స్ సందులు గొందులు చూసుకుని దూరి దూరి మరీ వెళతారు.. మా బెజవాడ కి.. అంత కష్టం ఇంకా రాలేదు  లెండి.. ఏదో..ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ..ఏదో.. ఒకటి రెండు చోట్ల .. అది బెంజ్ సర్కిల్,బస్ స్టాండ్, ప్రకాశం బ్యారేజి దగ్గర మాత్రమే.. ట్రాఫిక్ బాధ కి.. గురి అవుతూ ఉంటాం. ఆఫీసులకి, కాలేజెస్ కి, స్కూల్స్ కి  సరి అయిన సమయాలకే చేరుకుంటారు.. ఎప్పుడైనా వ్యక్తిగత ఆలస్యాలు పడినా ట్రాఫిక్ జాం అండీ..అనే వీలు మిస్ అవుతూ.. ఉంటాం..

ఇక విషయం లోకి వచ్చేస్తున్నాను. ఈ మద్య ఎండలకి.. భయపడి.. ట్రాఫిక్ కి..భయపడి.. ఎందుకంటే.. మనం ఎంత జాగ్రత్త గా ఉన్నా పక్క నుండో ఎదురు నుండో.. ఎవరు వచ్చి  అప్రయత్నంగా డీ కోడతారనే భయం వల్లో... వాహన చోదకురాలుగా ఉండటం మానేసి..ప్రయాణీకురాలిగా  మారిపోయాను.  నాకు ఏదైనా జరిగితే కూడా మా అబ్బాయి దగ్గర లేడని జాగ్రత్త కూడా లెండి. ఒకసారి ఏడేళ్ళ క్రితం వాహనం నడపడంలో..నా తప్పు ఏమి లేకపోయినా.. నాకు ఒకరు యాక్సిడెంట్ చేసి అలాగే వదిలేసి వెళ్ళినప్పుడు.. మా అబ్బాయి అందుబాటులో ఉండి నన్ను హాస్పిటల్ కి కన్నీళ్ళతో  తీసుకు వెళ్ళడం నాకు బాగా గుర్తుంది. మళ్ళీ  నేను అలాటి పరిస్థితి లోకి  వెళితే.. తన చదువు చెడ కొట్టుకుని వచ్చేస్తాడని భయం అన్నమాట. అందుకే ఎక్కువగా బస్ ప్రయాణం చేస్తున్నాను.. ఆటో బాబుల మోర్ చార్జింగ్ బెడద తట్టుకోలేక అదేమిటండీ. అంత ఎక్కువా ?.అంటే..అన్నీ పెరిగాయి కదమ్మా! అంటారు. అందుకే బస్ ప్రయాణం పై ముచ్చట పెంచుకుని.. నిలబడి వెళ్లి అయినా..  ప్రయాణాలు చేస్తూ.. బడ్జెట్ పెరగకుండా బహుజాగరుకులు అన్పించుకుంటున్నాను.


ఈ మద్య మా "అత్తమ్మ"ని " ఐ " క్లినిక్ కి చెకప్ కి.. తీసుకుని వెళుతూ..ఆమె  "నేను బస్ లో.. ప్రయాణం చేయలేను.. అంత ఎక్కువ ఎత్తు మెట్లు ఎక్కి బస్ లో నిలబడి ప్రయాణం చెయ్యలేను " అని అంటూ ఉన్నా కూడా వినిపించుకోకుండా.. పర్లాంగ్ దూరంలో.. సగం ఉన్న బస్ స్టాప్ కి తీసుకెళ్ళి  నాలుగు హాస్పిటల్స్ కి ఇవతల ఆగే బస్ స్టాప్ లో..బస్ దిగి ఎంతో.. సౌకర్యంగా తీసుకు వెళ్ళాక కానీ.. మెట్రో బస్ ప్రయాణం సౌకర్యమే! పర్వాలేదు..అని అనుకున్నారు.. అంటే.. పర్వాలేదన్న మాటేగా!. పదిహేను నిమిషాలకి ఒక సర్వీస్ నడుపుతూ.. అట్టే నిలబెట్టడం లేదు. అంతకు ముందు అయితే.. నేను  ఒక   జోక్ చేసేదాన్ని."కష్టాలన్నీ ఆర్ టి సి  బస్ ల్లా వెంట వెంటనే వస్తాయి.. సుఖాలన్నీ ఆలస్యంగా వచ్చే రైళ్ళు లాగా వస్తాయి అని " అన్నట్లు రెండు మూడు వరుసలలో  ఎదురెదురుగా ఉండే సీట్లు లో..అయితే  ఒక అదనపు ఆనందకర సౌక్యం ఉంది. అది ఏమిటంటే.. సీనియర్  సిటిజేన్సకి  ఆరు , ఏడు సీట్లుని  ప్రత్యేకం గా కేటాయించారు. స్తీల సీట్ల లోనుండి విరగకోసి మరీ.. ఇచ్చారు. అన్యాయం కదండీ! అయినా ఇక్కడ  ఏముంది లెండి.. పార్లమెంటే..అన్యాయం మిగుల్చుతుంటే! ఇది ఏ పాటి అన్యాయం లే అంటాను నేను. అయినా..స్త్రీలు సహనమూర్తులు.. ఓపిక లేనివాళ్ళు కాదు కదా! అనారోగ్యంగా ఉన్నా నిలబడే ప్రయాణం చేస్తారు. వారికి కేటాయించిన సీట్ లని.. పురుషలకి త్యాగం చేసి మరీ.. ప్రయాణం చేస్తూ..ఉంటారు. కండక్టర్ ని అడిగామా..! వెరీ ఫస్ట్ వాయిస్ మీదండీ!..ఆ తర్వాత మేము చెపుతాం అంటారు...కానీ.. నోరు మెదపరు.. దర్జాగా స్త్రీల సీట్ లలో  కూర్చున్నవారిని  నోరు తెరిచి  అడిగినా  లేవరు కాక లేవరు. కొంత మంది కుర్రవాళ్ళు పుట్టుకతో..వృద్ధులు..అనుకుని.. వ్రేలాడుతూ.. చెమట స్నానాలు చేస్తూ.. ప్రయాణాలు చేయడం అంటేనే  విసుక్కునే నేను ఇప్పుడు హాయి హాయిగా బస్ ప్రయాణం చేస్తున్నాను.      

 ఈ మెట్రో బస్ లు రాకముందు ఎలా గడిచిందో..ఏమో కానీ.. ఒక సంవత్సరం కాలం నుండి.. మేము అంటే మా బెజవాడ వాసులు మాత్రం కొంచెం డబ్బు ఎక్కువ చెల్లించి అయినా.. దర్జాగా.. జాం జాం గా..తెగ తిరిగేస్తున్నాం.. లో ఫ్లోర్ పుట్ బోర్డ్ మూలం గా వృద్ధులు..మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కూడా.. హాయిగా ఎక్కడానికి వీలుగా.. ఉన్నాయండీ.. అలాగే ప్రయాణంలో..విసుగు  పుట్టకుండా ..ఎఫ్ ఎమ్..మోత కూడా ఉంటుంది. రూరల్ ప్రాంతాల నుండి.. నడిచే ఈ బస్ లు.. ఒక మూల నుండి ఇంకొక మూలకి ..తిరుగుతూ..240 బస్   లతో.. నాలుగు డిపోల పరిధిలో..మంచి నిర్వహణతో.. జనాలకి.. సౌకర్యవంతమైన సేవ చేస్తున్నారు. లాభాలు ఆర్జించి.. ఈ రీజియన్ ని మంచి రేంజ్ లోకి తీసుకు వెళుతూ ఉన్నారు.

 సి యెన్ జి ..తో..నడిచే ఈ.. బస్ లు..ని నడిపే తీరు చూస్తే.. నాకు నవ్వు వస్తుంది.. డ్రైవర్ గారి చేతిలో..స్టీరింగ్  విష్ణు మూర్తి చేతిలో..సుదర్శన చక్రం ఉన్నరీతిలో ఏమి దర్జా గా తిరుగుతూ ఉంటుంది. మిగతా బస్ లని ఓవర్ టేక్ చేస్తూ..  నిలబడిన ప్రయాణికుల ని డాన్స్ చేపిస్తూ.. కొండకచో.. సడన్ .బ్రేకులతో.. పళ్ళు ఊడ కొట్టే ప్రయత్నం చేసి.. దంత వైద్యులకి.. ప్రాక్టీస్ పెంచుతూ..ఉంటారు.ఆ పళ్ళు ఊడ కొట్టుకునే  బాధ స్త్రీలకే.. లభించిన వరం లెండి. ఎంతైనా డ్రైవర్ బాబు పురుష పక్షపాతి ..కదా..!  దెబ్బ తిన్నప్పుడు.. తిట్టుకుని ఇంటికి వెళ్ళాక కూడా గుర్తు తెచ్చుకుని తిట్టుకుని మరీ రాజీ పడిపోతాం. జీవన  పోరాటమే  రాజీ పడి పోయిన  పోరాటం. కలకాలం బస్ లలో.. కాపురం ఉంటామా-ఏమిటి!? కాసేపు కళ్ళు మూసుకుంటే.. కొంపకి.. చేరుకుంటాం అని మన బంగారం లాంటి గృహాన్ని మనమే.. విసుగా తిట్టుకుంటాం. కదా!.. ఆ బాధలన్ని కొంత తగ్గి... ఇప్పుడు.. నిలబడి అయినా బాగానే  ప్రయాణం చేసి.. తొందరగా ఇంట్లో పడి వేళకి ఇంత వండి.. ఇంట్లోవాళ్ళకి పెట్టి... అమ్మయ్య రోజు బాగా గడిచింది  అనుకుంటున్నాను. థాంక్స్ టూ .. మెట్రో..సర్వీసెస్.

 సేవో పరమావధి.. ఆర్ టి సి. ఇప్పుడు అయితే.. మా సర్వీస్ లని హైజాక్ చేసి.. రద్దీ  తట్టుకోవడానికి... భాగ్యనగరానికి తిప్పుతూ..సంస్థని  బహు భాగ్యవంతం చేస్తున్నందుకు మెచ్చుకుంటూ.. తిట్టుకుంటూ.. ప్రతి ఏడాది ఇదే తంతు.. అదనపు బస్ లు కొనుగోలు చేసుకోవచ్చుగా అని విసుక్కుంటూ..  ఈ పోస్ట్ తో.. నా బ్లాగ్ ని సుసంపన్నం చేసుకుంటూ..  మీతో పంచుకుంటూ..  బెజవాడ  లో..ప్రయాణం అంటే  భయం వద్దు అని చెప్పే ప్తయత్నం చేస్తూ ఇదో.. తృప్తి... అంతే.!!.బై  ఫ్రెండ్స్ ... 

1 వ్యాఖ్య:

Vineela చెప్పారు...

ఆహ విజయవాడ లో మెట్రో బస్సు ల..నాకు ఆటో కన్నా బస్సు ఎక్కడమే చాల బాగుంటుంది అనిపిస్తుంది అండి..చక్క గ చుట్టు పక్కల షాప్ లు జనాలని చూసుకుంటూ వెళ్లోచు..ఈ సరి బెజవాడ రాగానే మళ్ళి బస్సు ఎక్కాలి అయితే :)