14, మే 2011, శనివారం

సినిమా పాటకి..ఎస్.జానకి.గళం..."కామధేనువు" లాటిదని..


మరుగేలరా.. ఓ..రాఘవా.. అంటూ .అచ్చ తెలుగు  అమ్మాయి  ..సబిత (భమిడిపాటి అనుకుంటాను.ఒక చిత్రంలో... కనిపించి..తన ముద్ర వేసుకుని వెళ్ళింది )  తన అభినయం తో..ఎంత బాగా ఆకట్టుకుంటుందో! చిత్రం ఆసాంతం నయనాలతోనే నటించి నటనలో..జీవించింది..

 అందమైన అమ్మాయి.. ఒక అబ్బాయి పై మనసు పడి.. ఆ..విషయాన్ని.. తను చెప్పలేక బిడియపడి.. ఆ అబ్బాయే.. ఆమె అంతరంగాన్ని గ్రహించి.. చొరవజూపి...తనని గైకొనమని..చెపుతూ..  ఆ అందాల భరిణ విన్నమించుకోవడం  ని..  ఎంత హృద్యంగా...చిత్రీకరించి..  తెర మీద అతివ మనసు ఇలా ఉంటుందని దృశ్య మనోహరంగా..చూపి   మనసు దోచేసే... మధురమైన పాట.. .. మరుగేలరా..పాట. 

 "సప్తపది " చిత్రం అనగానే ఎస్.జానకి..గళంలో  వైవిధ్యభరితమైన పాటలు.. గుర్తొస్తాయి. నాకు ఆ చిత్రంలో.. అన్ని పాటలకంటే.. "మరుగేలరా..ఓ..రాఘవా" చాలా ఇష్టం.  సంగీత పరిజ్ఞానం  లేని నాలాటి వారికే ఈ..పాట అంతగా నచ్చేస్తే.. సంగీతజ్ఞాన సంపన్నులకి..ఈ పాట ఇంకా బాగా నచ్చేస్తుంటుంది.. ఈ..పాట ఆస్వాదనలో..నన్ను  నేను మరచిన సందర్భాలు ఎన్నెన్నో!  ఎన్నిసార్లు..పాకాలు మాడ్చి .. తిట్లు తిని పాటని కట్టుకునేపని..అన్పించుకుని ఉంటానో  ! ...  "మరుగేలరా..చరాచరరూప పరాత్పర సూర్య సుధాకర లోచన ".. అన్న చోట..నాకు.. ఎంత బాగా నచ్చుతుందో! అలాగే రెండో..చరణం లో.."నిన్నేగాని   మదిన్ని".... .. అని నొక్కి చెప్పడం.. "ఎన్నజాల నొరుల ".. అంటూ..గట్టిగా అంతరంగాన్ని  వ్యక్తీకరిస్తూ  ..పునరుక్తిలో.."నిన్నేగాని మదినెన్నజాల"..అంటూ..సరళంగా సాగటం  వినడం..మధురం మధురం. 

మామ "మహాదేవన్ " స్వరాలకి.. జానకమ్మ గళం లోని మాధుర్యం .. ఎంత.. మధురమో! సంప్రదాయ కీర్తన లో.. ఒక  కన్నెపిల్ల అంతరంగం ని..  హృద్యంగా చూపించగలగడం.. ఎవరికి సాధ్యం కాదేమో.. అన్నంతగా  అత్యున్నత భావం ఒలికించిన ఆ.."సబిత" ఇప్పటికి కళ్ళ ముందు కదలాడుతుంటుంది.

  ఇక జానకమ్మని.. విశ్వనాథ్ గారు.. ఈ పాటకి.. ఎంతో ప్రశంసించారట. సినిమా  పాటకి..ఎస్.జానకి.గళం.. "కామధేనువు" లాటిదని..   ఏం కావాలంటే ఆ భావం ఒలికిన్చగల.. అత్యున్నత గాయని  అన్న ప్రశంస తో..పాటు.. విశ్వనాథ్ గారు  దర్శకత్వం వహించిన..ప్రతి చిత్రంలోనూ.. ఆమెతో.. పాటకి..పట్టం కట్టించారు. అని ..నా ఫ్రెండ్ ఒకరు.. చెబుతూ..ఉంటారు. నాకు లాగే ..ఎస్.జానకి..గళం అంటే..ఎంత పిచ్చో! అందుకే..ఇలాటి ఆసక్తికరమైన కబుర్లు..నాకు చెబుతూ..ఉంటె.. నేను.. ఇలా చెబుతూ..ఉంటాను.. ఒక వేళ.. ఇవేమైనా తప్పు అయితే (సాధారణంగా కాదు) మన్నించాలి మరి.  నాకు నచ్చినవారి గురించి  నచ్చిన విషయం చెప్పడం నాకు..ఇష్టం.

పాటని..చూడడం కంటే..వినడమే  బాగుంటుంది. అందుకే..ఈ పాట .. మరుగేలరా ..ఓ  రాఘవా     వినేయండీ!!!... మళ్ళీ మళ్ళీ వింటారు  ... నాకైతే ఈ పాట ఆస్వాధన  మాగాయ పచ్చడి అంత రుచి..మరి..


3 వ్యాఖ్యలు:

రాజి చెప్పారు...

nijamenandi marugelaraa paata chaalaa

baaguntundi.

naaku kuda chala ishtam ee paata.

voleti చెప్పారు...

ఇన్ని రాసారు.. ఆ పాట రాసిన మహానుభావుని గురించి కూడా తెలిసికుని రాసి వుంటే ఇంకా బావుండేది...ఆ విషయం తెలిస్తే ఆఖరుకి ఆ పాట ఇలా చిత్రీకరించ బడి, ఇందుకు ఉపయోగపడిందా అని ఆశ్చర్యపోక తప్పదు.

వనజవనమాలి చెప్పారు...

వోలేటి గారు మీరు ఏ ఉద్దేశ్యంతో.. అన్నారో..అర్ధమైనది.. సంప్రదాయ కీర్తన లో.. ఇంతకు మించి అని చెప్పాను. చాలా పాటలు.. ఎందరో..మహానుభావుల కీర్తనలని... పాటలకి..బాణీలుగా వాడుతున్నారు. ఆ పాటలకన్న ఈ.. మరుగేల ఓ..రాఘవ.. విభిన్నం అని చెప్పడమే..నా ఉద్దేశ్యం. త్యాగరాజ కీర్తనలు ఇంతకన్నా శ్రుతి మించి ఉన్నాయి.. వాటిగురించి..నేను చెప్పను. ..ధన్యవాదములు..
ధన్యవాదములు...రాజీ గారు.