16, మే 2011, సోమవారం

యద్దనపూడి నవలా నాయిక
యద్దనపూడినవలానాయికలు
ఆత్మగౌరవం,ఆత్మీయులు,సెక్రెటరీ,జీవనతరంగాలు,ప్రేమలేఖలు,మీనా,బంగారుకలలు,జైజవాన్,విచిత్రబంధం, రాధాకృష్ణ , మధురస్వప్నం,అగ్నిపూలు, చండీప్రియ కాంచన గంగ.. ఇవి నాకు తెలిసిన  చిత్రాలు. 
సౌకుమార్యం,ఆత్మాభిమానం,అందం.. ఇంకా ఉత్తమ గుణగణాలు కల అమ్మాయిలూ అబ్బాయిల పాత్రల  చిత్రీకరణకి.. యద్దనపూడి పెట్టింది పేరు.  తెర మీద  ఆమె "నాయికలు" కొందఱు...ఇక్కడ...చూడండీ!!!       

8 వ్యాఖ్యలు:

కొత్త పాళీ చెప్పారు...

చివరి వీడియో (నెమలి పాము నృత్యం) ఏం సినిమా? నా దృష్టిలో కీర్తికిరీటాలు సినిమాతియ్యకపోవడం పెద్దలోటు.

కొత్త పాళీ చెప్పారు...

కొందరు ముఖ్యమైన నాయికల్ని కంపేర్/కాంట్రాస్ట్ చేస్తూ మీరు విశ్లేషిస్తే చదవాలని ఉంది. సినిమాగా రాని ఇంకో మంచి నవల (బలమైన వయ్క్తిత్వం గల నాయిక) - ఈదేశం మాకేమిచ్చింది.

మురళి చెప్పారు...

'చదువుకున్న అమ్మాయిలు' సినిమాకి మాతృక డాక్టర్ పి. శ్రీదేవి రాసిన 'కాలాతీత వ్యక్తులు' అనే నవల. (నిజానికి నవలకీ, సినిమాకీ పోలిక ఉండదు లెండి.) కాబట్టి మీ జాబితాని సవరించండి...

వనజవనమాలి చెప్పారు...

మురళీ గారు.. ధన్యవాదములు.. జాబితాను సవరించాను...ధన్యవాదములు.. కొత్తపాళీ గారు..జయ ప్రద గారి ఆ నృత్యం "అగ్నిపూలు"చిత్రం...లో పాట. సమయం చూసుకుని "నవలానయికల పాత్రలని విశదీకరించే సాహసం చేస్తాను.

జ్యోతి చెప్పారు...

వనజగారు, యద్దనపూడి నవలానాయికలను, సినిమాల్లో ఆ నవలా నాయికలను విడివిడిగా విశ్లేశించండి వీలైతే..

వనజవనమాలి చెప్పారు...

Jyothi..garu.. Thankyou for your suggestion.. I will..Try..Thank you very much.

మాలా కుమార్ చెప్పారు...

చండీప్రియ యద్దనపూడి నవల కాదు . పోల్కంపల్లి శాంతాదేవిది .
మీ విశ్లేషణ బాగుంది .

వనజవనమాలి చెప్పారు...

మాలా కుమార్ గారు ధన్యవాదములు.. యద్దనపూడి సులోచనారాణి ఆన్ ది ఇంటర్నెట్ >> 174 రిజల్ట్స్ చూసి నిర్ధారణ చేసుకున్నాకనే.. నేను.. చిత్రాల పట్టిక పెట్టాను. అయినా మీరు శ్రద్దగా తెలియజేసారు. ధన్యవాదములు..