7, జూన్ 2011, మంగళవారం

చిటిక లో..చిక్కబడ్డ ఈ కటిక చీకటి..కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి.

జాము రాతిరి..జాబిలమ్మ..
జోల పాడనా ఇలా..
జోరు గాలిలో..జాజి కొమ్మ..
జారనీయకే కలా..
వయ్యారి వాలు కళ్ళలోన..
వరాల వెండి పూల వాన..
స్వరాల ఊయలూగు వేళ..(జాము రాతిరి)

ఈ.. పాట వింటూ ఉంటె.. నాకు.. ఒకటి  గుర్తుకు వస్తుంది.. "ఊరు వాడా నిద్దురపోతుంది.. నా మనసుకేమో.. నిద్దుర రానంటుంది..నువ్వు జోలపాడలేదని.. పాపం.. జాబిలమ్మకి  .. జోల పాడేవారు ఎవరు లేరు.. అందుకే.. నిదరపోలేదు.. నాకు లాగానే .. అనుకున్నదట..ఓ.. కన్నె పిల్ల..తన చెలికాడు దూరంగా ఉన్నప్పుడు..      
ఈ..పాట సాహిత్యం సిరివెన్నెల.  వారి ప్రతి పాటకి.. నేను వీరాభిమానిని..ప్రక్కనే ఉన్న mix pod లో చూడండి.. ప్రధమం ఈ..పాటే..ఉంటుంది.. సాహిత్యం + మరకతమణి సంగీతం.. ఎస్.పి.బాలు చిత్ర.. గళం వెంకటేష్..శ్రీదేవి..నటన ..అన్నీ..గొప్పవే..ఈ..పాటలో..జాము రాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా.. అంటే..జాబిలమ్మకి..జోలపాడే.. వ్యక్తి..పురుషుడు.  నట్టడివిలో..దారి తప్పిపోయిన వారికి....ఆహారము  లేక మనసులో.. భయంతో.. వణికిపోతున్న ఆమెకి.. ఓదార్పుగా.. దైర్యంగా.. తను ఉన్న సంగతి.. చెబుతూ.. నిడురపుచ్చే పాట.  అక్కడ స్త్రీని.. జాబిలమ్మతో..పోల్చి అతనిని.. సూర్యుడిని చేసారు.. సూర్యుడు వస్తే  కానీ జాబిలీ.. సెలవు తీసుకుని..నిదుర ఒడికి జారదు.. ఆ జాబిలే..గుబులు గుబులు గా ఉంటె..అందుకే.. జోరు వానలో.. జాజి కొమ్మ జారనీయకే కలా.. అంటారు.అసలే.. జాజి..పువ్వులాటి అమ్మాయి.. జాజికొమ్మ అంటే వాళ్ళ అమ్మని విడిచి..జోరువానలో..అంటే..ప్రమాదంలో..పడింది..కదా.... వయ్యారి వాలు కళ్ళ లోన .. అమ్మాయిలకి..వాలుకళ్ళు అందం.. వాటినే సోగకళ్ళు అనికూడా..అంటారు.. (బాలివుడ్ బంగార సుందరి..సోనాలి కళ్ళు.. వాలు కళ్ళు కదా! ) వరాల వెండిపూల వాన..  ఎన్ని వరాలు.. వెండి పూల వాన లాగా వెన్నెల లాగా కురుస్తున్నాయి.. స్వరాలూ
ఊయలూగుతుంటే..ఆ వేళలో..అంటున్నాడు అతను..

కుహు కుహు సరాగాలే శ్రుతులుగా..
కుశలమా అనే స్నేహం పిలువగా..
కుశలమా..అని స్నేహం..కుహు కుహు..స్వరాల శ్రుతులతో..పిలుస్తుంది.

కిల కిల సమీపించే సడులతో..
ప్రతి పొద పదాలేవో పలుకగా..
కిల కిల అనే సవ్వడులు వినిపిస్తుంటే..స్పందనతో.. ప్రతి పొద కూడా  ఏవేవో  ..పాటలు  పాడుతున్నా కానీ..

కునుకు రాక బుట్ట బొమ్మ గుబులుగుందని..
వనము లేచి వద్దకొచ్చి నిద్రపుచ్చనీ.. 
ఈ.. బుట్టబొమ్మ లాటి అమ్మాయికి..(బుట్ట బొమ్మశ్రీదేవి కి..సరి అయిన పోలిక. ఎందుకంటే..ఎంత వయసు వచ్చినా  గౌన్ లో..శ్రీదేవి ఉన్నంత సౌకర్యంగా అందంగా ఎవరు ఉండరు.. అయితే.. దివ్య భారతి కూడా.. గౌన్ లో..చాలా..బాగుండేది)   నిద్ర రాక  అమ్మ పై..గుబులుగా..భవిష్యత్ పై..దిగులుగా..ఉందని.. వనము(ఇక్కడ  వనం స్త్రీ వర్ణన)  లేచి అమ్మలా వద్దకు వచ్చి.. నిద్ర పుచ్చనీ.. అని కోరుకుంటాడు..అతను.

మనసులో భయాలన్నీ మరిచిపో..
మగతలో మరో లోకం తెరుచుకో..
నీ మనసులో..ఉన్న భయాలు అన్ని మరచి పోయి..నిద్ర మగతలో.. మరో లోకం తలుపుల్ని.. నువ్వే తెరుచుకో.. 

కలలతో ఉషా తీరం వెతుకుతూ..
నిద్రతో నిషా రాణి నడిచిపో..
నిద్రతో.. చీకటి అనే..మత్తు నింపుకున్న నిషా రాణి.. చీకటి రాణి.. కలలతో.. అయినా  వెలుగు తీరం వెతుకుతూ..వెళ్ళు..
చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి..
కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి.
చిటిక లో..చిక్కబడ్డ ఈ కటిక చీకటి.. ఉదయ కాంతి కి.. కరిగిపోక తప్పదు.. అంటూ..స్ఫూర్తి కరంగా 
నిద్రకి.. జీవితానికి  ..కూడా  అన్వయించి..వ్రాసిన  మంచి పాట. నాకు చాలా ఇష్టమైన పాట.

  ఇంత  చిన్న చిన్న పదాలతో.. గాడ మైన భావ ప్రకటన.. సిరివెన్నెల సొత్తు. వేటూరి గారిని అనుసరించి..అనుకరించి.. చాలా మంది..పాటలు వ్రాసారు.. కానీ..సిరివెన్నెలలా  ..ఎవరు..వ్రాయలేరు.. వ్రాయరు..కూడా.ఉపమానం తో..  బలంగా చెప్పడం ఆయన ఒరవడి.. ఆయన శైలి..ని..అందిపుచ్చుకునే వారు.. దరిదాపుల్లో  ..ఎవరు..లేరు.. అని కూడా అనిపిస్తుంది..నాకు.అందుకే..ఈ..పాట ..ఈ పూట.. ఇక్కడ ..చూడండీ..జామురాతిరి   జాబిలమ్మ  .. ఇక్కడెమో.. ..జామురాతిరి  వినేయండి...!    

1 వ్యాఖ్య:

అజ్ఞాత చెప్పారు...

keeravANi tune ki sirivennela padaalu baagaa fit avutaayi. aayana chinna chinna padaalatO raasinaa, kashTamaina padaalatO rAsinaa pratipadaanikii entO lOtaina bhAvAlu unTay. adE aayana paaTallOni pratyEkata.

naaku ishTamaina paaTa. non telugu friends chaalaa mandiki ee paaTanTe ishTam ee paaTa. BhAshatO pramEyam lEkunDaa keeravaaNi ni aaswaadistaaru ee paaTakOsam...

ee sinimaalo Sreedevi bhalE mucchaTagaa unTundi. raamgOpAl gaariki ishTamaina heroine kaabaTTEnEmO marinta andangaa chUpinchaaru aa andaala bhAmani.

avinEni bhAskar.