2, జులై 2011, శనివారం

"వెన్నెల వర్షం " ప్రారంభం ఓ..పరిచయం

సింహపురి సాహితీవనంలో ... ఒక దశాబ్దపు సాహితీ యానం లో పదకవితా అభినవ తిక్కనగా  అభివర్ణించ దగిన  కవి  మిత్రుడొకరి పరిచయం గా.. నా ..ఈ పోస్ట్.  ఓ..పరిచయం. 

రవి కాంచని చోటు కవిగాంచున్ ..అంటారు. ఇక్కడ ఈ కవి కాంచకుండానే.. మది గాంచిన భావానికి..అక్షర  రూపంబు ఇచ్చి..నవ్యం గా.. "నవ్య"లోకం లో.."సి"రియల్ గా కన్పించబోతున్నారు. ఆంద్ర జ్యోతి నవ్య వార పత్రికలో.. 13   జూలై  సంచిక నుండి.. కొత్త సీరియల్ "వెన్నెల వర్షం " ప్రారంభం కాబోతుంది. 

భావ చిత్రాలు,వెలుగుపూలు(త్రిబాష లో ) నాన్న (దీర్ఘ కవిత్వం)  సాయి పదాలు,పెన్నేటి పదాలు , ఆకు పచ్చని జరీ (నానీలు),ఇలా..కవితా సంపుటాలు వెలువరించడం వెనుక..ఓ.. ఆత్మ విశ్వాసం..ఆనవాలు ఉంది. ఓ..అంతరంగ ఘర్షణా తరంగం ఉంది.  అనుకోకుండా వచ్చే..పెన్నవరద లాంటి భావ ఉదృతి ఉంది.అలాటి  కలం   నవ్యం గా నర్తించబోతుంది. నిజ జీవితం లోని పాత్రలు..అక్షర చిత్రాలై.. మనముందుకు..రాబోతున్నాయి.

విధి ఆడిన వింత నాటకంలో.. అతను చూపునే కాదు..నమ్మకం ని  పోగొట్టుకున్నాడు. ఓ..వర్ష  కన్యక .. జీవితంలో..హర్షం నింపు తుందనుకుంటే వెగటు వర్షం కురిపించి..జీవితాన్ని చిత్తడి చిత్తడి చేసి ..వెళ్ళాక  అతని ఆశల వనం  ధ్వంసం అయ్యాక.. ఇక అక్కడ పూలు ఏం పూస్తాయి.. కాయలు ఏం కాస్తాయి..? కానీ..మనసు-మనిషి  ఆచూకిని  తెలిపే  .. ఓ..ఆప్త మిత్రుని..ఆలింగనం   అతన్ని మనిషిని చేసింది. నల్ల కళ్ళద్దాల వెనుక.. నలు దిక్కుల ని గాంచె అంతరంగ నయనం ఉందని..నిక్కం దెలిపి.. భుజం తట్టి ప్రోత్సహించింది..అక్షరం తోడుగా.. మది పెన్న పరవళ్ళు.. తొక్కింది.  
    
నైరాశ్యపు మేఘాలను చీల్చుకుని..
హృదయం లో ఆత్మ  విశ్వాసపు 
సూర్యుడిని ఉదయింప జేసుకుని..
స్ఫూర్తి కిరణాలను ప్రపంచంలో..
ప్రసరింపజేస్తూ..
స్నేహ కమలాలను వికసింప జేస్తూ ఉంటాను.
చిమ్మ చీకట్లు నన్ను చుట్టుముట్టాలని 
విఫలయత్నం  జేస్తున్నప్పుడు
నా మదిలో..ప్రశంసల  చప్పట్లు మార్మోగుతుంటాయి..
ఈ చీకటి ప్రపంచంలో..నేను వెలుగు.రేఖను..అంటాడు..ఈ కవి.

కవిత్వం ఊపిరి అయిన చోట.. ఓ.. వెన్నెల ..ఈ వెలుగుకి..రేఖ ఎలా అవుతుందనేదే.."వెన్నెల వర్షం".
 తప్పక చదవండి. 6 వ తేది గురువారం మార్కెట్  లోకి..వచ్చే.. ఆంద్ర జ్యోతి "నవ్య" సంచిక లో..   

రచయిత : మోపూరు పెంచల నరసింహం..         

3 వ్యాఖ్యలు:

కొత్త పాళీ చెప్పారు...

Very nice.
Wish this new venture all success.

Raj చెప్పారు...

చాలా బాగుందండీ.. ఆరోజు పత్రిక కోసం ఎదురుచూస్తాను..

లత చెప్పారు...

వనజ గారూ ఏడు వారాల సీరియల్ గా మొదలవ్వబోతోంది కదండీ
యాడ్ చూశాను.నవ్య రెగ్యులర్ గా చదువుతాను నేను