14, జులై 2011, గురువారం

ఒకే భావం రెండు భాషల్లొ.. ఆష-అనురాగదేవత


నాకు బాగా నచ్చిన పాట చూసుకోపదిలంగా.. "అనురాగదేవత" చిత్రం చాలా మంచి చిత్రం. నేను పదవ తరగతి చదివేటపుడు ఆ చిత్రం చూశాను.వేటూరిగారి గీతరచనలు,చక్రవర్తి గారి సంగీతం ఈ చిత్రానికి..హైలెట్. అలాగే కథ,కధనం అన్నీ బాగుంటాయి.
చూసుకో పదిలంగా పాట సాహిత్యం..ఆ పాటలొ.. శ్రీదేవి గారి నటన యెవరికైనా నచ్చుతాయి. తాతినేని రామారావుగారి దర్శకత్వంలో శ్రీదేవి నటన హింది చిత్రంలో.. "ఆష" చిత్రంలొ..నటనతో..పోల్చుకుంటే..యెంత మంచి నటనను శ్రీదేవి ఇచ్చారో!! ముఖ్యంగా..ఈ పాట లో యెన్.టి.ఆర్ గార్కి..తలవంచి చెసే అభివాదం యెంత బాగా గుర్తుండిపోతుందో! ఇక పాట సాహిత్యంలో..ఎంత లోతులు ఉన్నాయో!"అనురాగదేవత" గా ఆ ముద్ర..మరపురానిది. మన అని కాదు కానీ..శ్రీదేవి అందం కానీ.. నటన కానీ...
రీనారాయ్ తక్కువే అని చెప్పాలి.డ్రస్సింగ్ విషయంలోను..హాహా భావాలు వొలికించడంలో..శ్రీదేవి గారి నటన పరిపూర్ణం అనిపిస్తుంది నాకు. మీరే గమనించండి. రెండు పాటల్లో..తేడాని నటనా చాతుర్యాన్ని. "అనురాగదేవత" లాటి మంచి చిత్రం ని ఇప్పుదు చూడలేం కూడా!అందుకే యెప్పుడు వచ్చినా..నేను ఈ చిత్రాన్నిచూస్తూ ఉంటాను.


Sheesha Ho Ya Dil Ho…2
Aakhir…
Toot Jaata Hai….4
Lab Tak Aate Aate Haathon Se,
Sagar…
Choot Jaata Hai….3
Sheesha Ho Ya Dil Ho,
Aakhir Toot Jaata Hai….
Kaafi Bas Armaan Nahin,
Kuch Milna Aasaan Nahin….
Duniya Ki Majboori Hai,
Phir Taqdeer Zaroori Hai…
Yeh Jo Dushman Hai Aise,
Donon Raazi Ho Kaise…
Ek Ko Manao To Duja…..
Rooth Jaata Hai….3
Sheesha Ho Ya Dil Ho Aakhir,
Toot Jaata Hai….
(Baithe The Kinaare Pe,
Maujon Ke Ishare Pe)…2
Ham  Khelein Toofanon Se,
Is Dil Ke Armaanon Se,
Hamko Yeh Maloom Na Tha,
Koi Saath Nahin Deta…2
Maajhi Chod Jaata Hai,
Saahil….
Choot Jaata Hai….3
Sheesha Ho Ya Dil Ho,
Aakhir….
Toot Jaata Hai…4
Sheesha Ho Ya Dil Ho…..
Duniya Ek Tamaasha Hai,
Aasha Aur Niraasha Hai….
Thode Phool Hain Kaanten Hain,
Jo Taqdeer Ne Baante Hain….
Apna Apna Hissa Hai,
Apna Apna Kissa Hai,
Koi Lut Jaata Hai,
Koi…
Loot Jaata Hai….3
Sheesha Ho Ya Dil Ho,
Aakhir…
Toot Jaata Hai…4


Lab Tak Aate Aate Haathon Se,
Sagar…
Choot Jaata Hai….3
Sheesha Ho Ya Dil Ho…….


చూసుకో పదిలంగా
హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైనా రగిలేను నీలో వేదన

వికసించే పూలు ముళ్ళు విధి రాతకు ఆనవాళ్ళు(2)
ఒకరి కంట పన్నీరైనా ఒకరి కంట కన్నీళ్లు(2)
ఎండమావి నీరు తాగి గుండె మంటలార్చుకోకు(2)
ఆశ పెంచుకోకు నేస్తం అది నిరాశ స్వాగత హస్తం(చూసుకో)

కాలమనే నదిలో కదిలే ఖర్మమనే నావ మీద(2)
ఎవరు తోడూ ఎన్నాళ్ళున్నా చివరి తోడు నువ్వేలే(2)
సాగుతున్న బాటసారి ఆగి చూడు ఒక్కసారి(2)
కలుసుకోని ఇరు తీరాలు కనిపించని సుడి గుండాలు(చూసుకో)


గుండెలు పిండేసే ఓ విషాద గీతం..వెంటాడి,వేటాడే ఓ..జ్ఞాపకం. విషాదం ఓ..మది భావతరంగమే కదా!ఈ పాట వింటూ,చూస్తూ..హేట్సాఫ్ చెప్పాలిసింది ముగ్గురికి. వేటూరి,శ్రీదేవి,తాతినేని రామారావు గార్లకి. .