21, జులై 2011, గురువారం

నా మనసే ఒక తెల్లని కాగితం

అర్దాంగి ..పాత చిత్రం కాదండీ ! జయసుధ,మురళి మోహన్ జంటగా నటించిన చిత్రం. అందులో నా మనసే..ఒక తెల్లని  కాగితం అనే పాట గురించి..ఆ పాట చాలా బాగుంటుంది. అర్ధాంగి  కి అర్ధం ఆ చిత్రం ..ఆ అర్ధాంగి  మనసే ..ఈ పాట. పాటని కొంచమే వీక్షించగలం. అంతవరకే లభ్యం అయింది .. అయినా  చూడండి..ప్లీజ్!

నా  మనసే  ఒక  తెల్లని  కాగితం .పాట సాహిత్యం :

నా మనసే ఒక తెల్లని కాగితం 
నీ వలపే తోలి వెన్నెల సంతకం (నా)
అది ఏనాడైనా ఏనాడైనా 
నీకే నీకే అంకితం (నా) 

తెరచిన నా కన్నులలో..ఎప్పుడు నీ రూపమే 
మూసినా నా కన్నులలో ఎప్పుడు నీ కలల దీపమే (తె)
కనులే కలలై కలలే కనులై... 
చూసిన అందాలు అనుబందాలు.. అవి నీకే నీకే అంకితం (నా)

నిండిన నా గుండెలలో ఎప్పుడు నీ ధ్యానమే 
పండిన ఆ ధ్యానంలో ఎప్పుడు నీ ప్రణయ గానమే (నిండిన)
ధ్యానమే గానమై గానమే ప్రాణమై (ధ్యా)
పలికిన రాగాలు అనురాగాలు 
అవి నీకే నీకే అంకితం (నా )


ఇక్కడ పాట వినండీ! నా  మనసే  ఒక  తెల్లని  కాగితం . . -- అర్ధాంగి    సుశీలమ్మ గొంతులో..ఓ..మధురిమ ఈ పాట. తాతినేని చలపతి రావు గారి స్వరకల్పన .. ఓ..స్వరప్రాభవం..

2 వ్యాఖ్యలు:

ఆత్రేయ చెప్పారు...

మంచి మంచి పాటల పాతర తవ్వి , తంపటేసి మరీ పెడుతున్నారు.
చాలా బాగున్నాయి. థాంక్స్

M. చెప్పారు...

సూపర్ సాంగ్ నాకు వింటుంటే భలేగా అనిపిస్తుంది.