24, జులై 2011, ఆదివారం

మాతృత్వంలోనే ఉంది

మాతృత్వం లోనే  ఉంది   కులగౌరవం  చిత్రం లో.. ఈ పాటకి.. పెద్దగా పరిచయం అవసరం లేదు అనుకుంటాను. చాలా చక్కని పాట.

రేడియో పుణ్యమా అని ఇప్పటికి..ఈ పాట వింటూ ఉంటాను.

కొసరాజు రాఘవయ్య చౌదరి గారి సాహిత్యంలో.. టి.జి.లింగప్ప గారి సంగీతంలో..ఆలు-మగల అనురాగాన్ని..మాతృత్వం గొప్పదనాన్ని చెపుతుంది. నాకు చాలా ఇష్టమైన పాట ఇది.
పాట సాహిత్యం:
మాతృత్వంలోనే  ఉంది ..ఆడ జన్మ సార్ధకం
అమ్మా! అని పిలిపించుకునుటే  స్త్రీ మూర్తికి గౌరవం (మా)
స్త్రీ -పురుషులు ఒకరినొకరు ప్రేమిస్తారు 
సృష్టికి ఒక వింత శోభ కలిగిస్తారు  (స్త్రీ)
మబ్బు  వెంట  నీరు వలె 
పువ్వునంటు తావి వలె (మబ్బు)
అనుకృతముగా వచ్చును ఈ సంబంధం ..
ఈ అనుబంధం ఆలుమగలు బ్రతుకున పండించుకున్నపరమార్ధం (మా)

ప్రకృతి కాంత పురుషుని  ఒడిలోన పరవశించినది 
భూమాత మురిసి పచ్చ పచ్చగా నవ్వుతున్నది  (ప్ర )
అంతా అనురాగామయం ఆనందానికి నిలయం 
పతి హృదయమే సతికి నిత్య సత్యమైన.. ఆలయం 
పూజించే దేవాలయం..
భర్తయే భార్యకు ఇలలో వెలసిన దైవం (మా)