19, ఆగస్టు 2011, శుక్రవారం

అభినయ వాణీశ్రీ..ని చూడండీ.

పి.సుశీల గళంలో.. చక్రవర్తి  గారి  స్వరకల్పనలో..ఈ పాట...చూడండీ...బాలు గారి ఆలాపన కూడా వినసొంపుగా ఉంటాయి. వాణీశ్రీ అభినయం.. హాట్స్ ఆఫ్.. ఇంత మంచి పాటలని వెతుక్కుని మరి మరి వినాలనిపుస్తుంది. క్రొత్త  ఒరవడిలో.. కొట్టుకుని పోకుండా..పాటని పది కాలాలు వీనులవిందుగా ఉంచే పాటల్లో..ఈ..పాట ఒకటి.    మన "సు'కవి.. సాహిత్యం ఇదుగోండి...

ఈ..సంజెలో..కెంజా యలో.. ..(ఈ)
చిరుగాలుల కెరటాలలో..
ఏ మల్లి మరులెల్ల  ఎగబోసేనో..
ఏ  రాజు  ఎద  లోతు  చవిచూసేనో ..ఆహ హ హా..(ఈ)

ఈ మేఘమే రాగ స్వరమో..
ఆ రాగమే మూగ పదమో ..(ఈ)
ఈ చెంగు ఏ వయసు పొంగో 
 ఆ పొంగు ఆర్పేది ఎవరో..
ఎవరో అదెవరో .. రెప రెపరెపరెప (ఈ సంజెలో)

పులకించి ఒక కన్నె మనసు 
పలికింది తొలి తీపి.. పలుకు(పు )
చిలికింది అది లేత కవిత
కరిగింది తనలోని మమత
మదిలో..మమతలు.. రిమ జిమ రిమ జిమ రిమజిమ (ఈ సంజెలో)

నా కళ్ళలో..ఇల్ల రికము ..ఆ..
నా గుండెలో..రాచరికము  (నా కళ్ళలో)
నీదేను  నీదేను  నిజము
నేనుందు  నీలోన సగము..
సగమే జగముగా 
కల కల కల కిల కిల కిల(ఈ సంజె లో) 

ఈపాట "మూగప్రేమ " చిత్రం ..లో.. పాట. అభినయ వాణీ శ్రీ ..చూసారు కదా.. నేను వినే,చూసే పాటల  అభిరుచి..నచ్చితే..పాటలని ఎక్కువగా చూడండి..ధన్యవాదములు. ఓ.కే. బై. 

2 వ్యాఖ్యలు:

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

అద్భతమైన సాహిత్యంగల పాట ఇది. గుర్తుచేసినందుకు నెనర్లండి.

మురళి చెప్పారు...

ఈమధ్యనే 'పాడుతా తీయగా' లో ఓ అమ్మాయి పాడగా విన్నానండీ ఈ పాట.. మీ పుణ్యమా అని వీడియో కూడా చూసేశాను..