25, అక్టోబర్ 2011, మంగళవారం

ఏదారి అయినా గోదారి కే ! (1 వ భాగం )అతను చూదు   ఎంత బాగా ఉపన్యాసం  ఇస్తున్నాడో..! తన స్నేహితురాలికి వినమన్నట్టు చెప్పింది గీత. 


చాలా అద్భుతంగామాట్లాడుతున్నాడు అతను, అతని మాటల్లో విషయం, వివరణ తో పాటు స్పష్టమైన మాటతీరు..చాలా ఆకర్షణీయంగా ఉంది.సరదాగా వినసాగింది.. పావు గంట సేపు అతని ప్రసంగం వినేటప్పటికి.. అతని భావాలపై అభిమానం పుట్టుకొచ్చింది. కవిత్వం పై అతనికి ఉన్నఅవగాహన బాగా నచ్చింది. వెంటనే కొంచెం శ్రమపడి.. అతని అడ్రెస్స్ కనుక్కుని అభినందనలు తెలుపుతూ.. ఓ.. ఉత్తరం వ్రాసి పడేసింది.

తర్వాతా చాలా కాలం అతని నుండి రిప్లయ్ వస్తుందని ఎదురు చూసింది.తర్వాత ఆ సంగతి మర్చిపోయింది. మళ్ళీ ఒకరోజు అతని ప్రసంగం వింది.చాలా బాగుంది అనిపించింది. మళ్ళీ అభినందనలతో ఒక ఉత్తరం వ్రాసింది. ఎందుకే అలా మర్యాద తెలియని వ్యక్తులకి.. ఉత్తరాలు వ్రాసి అభినందనలు తెలుపడం..నీకు అన్నీ అతిగా స్పందించడమే తెలుసు... అని చివాట్లు పెడుతుంది గీత. 

గీత,సరిత ఇద్దరు రూం మేట్స్. ఇద్దరు  కూడా వృత్తి  నైపుణ్యం కోసం  ఓ.. ఆరు నెలల కోర్స్ చేయడానికి  .ఆ మహా నగరంకి వచ్చారు. ప్రభుత్వం సమకూర్చిన వసతి గృహంలోను   కోర్స్ నేర్చుకుంటున్న అందరిలోను   ఇమడలేక   వేరే .. ఇంకో ఇద్దరితో కలసి ఇల్లు తీసుకుని వంట  చేసుకుని తింటూ... కష్టం-సుఖం పంచుకుంటూ భాద్యతల గురించి ఆలోచనలు పంచుకుంటూ కొద్ది కాలంలోనే మంచి స్నేహితులయ్యారు .అభిరుచులు కలవడం తో.. కాస్త ఖాళీగా ఉండే సమయాన్ని పుస్తకాలు చదువుకుంటూ..రేడియో వింటూ.. సాహిత్య సభలకి   వెళుతూ..  కాస్త పాండిత్యాన్ని వంటబట్టిన్చుకున్నారు. 

కొన్నాళ్ళకి కవిత భోజనం చేస్తుండగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. కాస్త ఆ కాల్ చూడవే! చెప్పింది గీతతో.. 
ఎవరో.. శ్రీనివాస్ అట. భోజనం చేస్తున్నారు తర్వాత చేయమని చెప్పాను అంది గీత.
అవునా.. ఆ కవి శ్రీనివాస్ ఏమోనే అంది..కవిత.

ఏమో! నాకైతే అతను కాదు అనిపిస్తుంది.. ఆ మొహం దగ్గర అలాటి కర్టేసి కూడా ఉంటుందని నేను అనుకోను. అయినా మాటలు విని మనిషిని అంచనా వేయడం తప్పు. మాటల్లో ఉన్న సంస్కారం,రచనల్లో ఉన్నగొప్పదనం మనుషుల్లో ఉండదు. అందుకే.. రచయితలు,కవులతో..నాకు పెద్ద పరిచయాలు అక్కర్లేదు. వాళ్ళ భావాలని,ఆలోచనా క్రమాన్ని క్యాచ్ చేసుకోవడం,మనదైన రీతిలో..రసాస్వాదన పొందటం తప్ప వ్యక్తి గత పరిచయాలు వద్దనిపిస్తుంది. నిష్కర్ష గా చెప్పింది గీత. 

నిజమే !మనకి తెలిసిన ఓ..పెద్ద రచయిత..ఆంద్ర దేశాన్ని తన రచనలతోనే కొన్ని దశాబ్దాలు ఉర్రూత  లూగించాడు. కానీ అతని రచనలు అన్నీ ఇంగ్లిష్ నవలలకి మక్కీకి మక్కీ దిగుమతి అని చాలా మందికి తెలియదు. ఒకవేళ తెలిసినా అనువదించడం కన్నా..కాపీ కొట్టడం ఒక విధమైన  కళయే  కదా!అనుకుని నవ్వుకుంటారు.అలాగే ఆ రచయితకి అభిమాని అయిన ఒక అమ్మాయి తో ప్రేమ వ్యవహారములు నడిపి  ఆఖరికి ..హ్యాండ్ ఇచ్చాడని చెప్పుకుంటారు అందులో నిజమెంతో!? 

నువ్వు చెప్పింది నిజం కవితా.. నా అభిమాన గీత రచయిత..గురించి చెప్పాలి. ఆయన ఎంత గొప్ప సాహితివేత్తో! ఆయనని అనుకరించ గల్గినవారు కూడా దరిదాపూలలో  ఎవరు లేరు . అలాటి ఆయనకి కనీస మర్యాదలు పాటించడం కూడా తెలియదు అన్నట్లు ప్రవర్తిస్తారు..అంది. 

అవునా?.. చెప్పు చెప్పు ఎలా ఆసక్తిగా అడిగింది..గీత  ఆయన టీవి షో కి ఇంటర్ వ్యూ ఇవ్వడానికి వచ్చారు  అనుకో.. కూర్చవడం దగ్గరనుండి.. మాట్లాడటం దగ్గర నుండి రకరకాల  విన్యాసాలు చూడ లేక చావాలి. ఇయర్ బడ్స్ తిప్పినట్టు కళ్ళ జోడు ప్రేమ్ కొస చివిలో తిప్పుతూ ఉంటాడు.నశ్యం   పీల్చుకున్నట్లు ..తుమ్మడం,కాళ్ళు బార్లా చాపడం..యాంకర్ కి ముచ్చెమటలు పట్టించడం చేస్తూ ఉంటారు...  చూస్తున్న వాళ్లకి ఆయన అక్షరాలతోనే  కాదు చేతలతో ఆడుకుంటున్నట్లు ఉంటుంది. పర్సనల్ కలిసి మరీ . అయ్యా.. కొంచెం డీసెన్సి   పాటించండి అని చెప్పాలనుకుంటాను. అంత విరక్తి కల్గుతుంది నాకు ఆయనని చూస్తే. అందుకే భావాలు,సాహిత్యం నచ్చినంత  మాత్రాన మనిషి నచ్చడం అంటూ ఏమి ఉండదు. వాళ్ళు మనుషులే! వాళ్లలోను లోపాలు ఉంటాయి. మనం ఊహించినంత  గొప్పగా ఉంటారని అనుకోకూడదు.అలా అని గొప్పవారు కాదని తీర్మానించ లేం. కాబట్టి మనిషి ని కొంత సమయం లోనే అంచనా వేయలేం. 

ఇకపోతే ఈ శ్రీనివాస్ గురుంచి.
అతను సమాధానం వ్రాయకపోవడానికి.. మర్యాద తెలియదు అనుకోనవసరం లేదు. అతని తీరిక లేకపోవచ్చు.లేదా ఆసక్తి లేక పోవచ్చు. లేదా.. అతను తాను ఎక్కువ స్థాయి కల రచయితగా భావించుకుంటూ ఉండవచ్చు. అందుకుని మనం ఆ రచయితకి అభినందనలు చెప్పడం మానేయడం కంటే..మన స్పందనని తెలియజేయడం అని ఎందుకు అనుకోవు.అతను సమాధానం ఇస్తాడని నేను అభినందించడం లేదు.

అయినా ఓ.. రహస్యం చెప్పనా ?

అప్పుడప్పుడే   ఎదుగుతున్నవాడిని.. ఎదగనీయ కుండా  ఆపాలంటే .. ఒక్కటే బాణం. మీరు బాగా శ్రమిస్తున్నారు. మీరు నిజంగా చాలా గొప్ప .. ఎప్పుడో.ఎక్కడో ఉండాలిసినవారు. ఇప్పటికైనా చాలా ఎత్తులో ఉన్నారు...లాటి పొగడ్తలు తో..ముంచేస్తే చాలు.. ఉబ్బితబ్బిబ్బు అయిపోయి.. తన గురించి ఎక్కువ అంచనా వేసుకుని.. ఇక ఏమి చేయకుండా..సాధించాల్సింది అయిపోయినట్లు తన ఎదుగుదలకి..తనే అడ్డుకట్ట  వేసుకుంటాడు.. అదే  వినయశీలి ,   విజ్ఞుడు  అయితే  మరింత  సాన  పెట్టుకుని  తన స్థానంని  పదిలపర్చుకుంటాడు . అన్నమాట . . అంటూ  చెప్పింది .

వ్వా .. ఏం చెప్పావ్ డియర్.. అంటూ.. ఓ..హాగ్ ఇచ్చింది  గీత.


ఇక చాల్లే ఎవరైనా చూస్తే .. ఏదో తేడా అనుకుంటారు.. అంటూ నవ్వింది.

అవును .. విదేశాల్లో సరే.. వాళ్ళ  సంస్క్రతి  వదిలేయి. మన ఉత్తర భారతంలో.. ఇలా హత్తుకుని ప్రేమ, వాత్సల్యం  ప్రకటించడం తప్పు ఏం కాదు. ఏమిటో..మనకి అన్ని తప్పులే!.నిట్టూర్చింది.

ఏ దారి అయినా గోదారి కే !
మిగతా భాగం తర్వాత..    .

మిత్రులందరికీ గమనిక. నేను వ్రాస్తున్న ఈ సీరియల్ .. కొనసాగుతూ ఉంటుంది. పూర్తి సాహిత్య వాతావరణ నేపద్యంలో.. సాగుతూ ఉంటుంది. ఈ సీరియల్ ఎవరిని ఉద్దేశించి వ్రాస్తున్నది కాదు. యే పాత్ర అయినా పూర్తిగా కల్పితం.ఎవరిని నొప్పించడానికి వ్రాస్తున్నవి కాదని మనవి..చేస్తూ..  వనజ వనమాలీ.  

1 వ్యాఖ్య:

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

తరువాయి భాగము కొరకు వేచియుంటాము.
మరి మీరు టైటిల్లో "భాగం 1" అని కూడా పెట్టండి. చివరిదాక చదివితేగానీ నాకు తెలియలేదు ఇది సీరియల్ అని.