21, జనవరి 2012, శనివారం

హృదయ కాంక్ష

హృదయ కాంక్ష
                                            అని చెప్పే ఈమె అంతరంగాన్ని తెలుసుకోవాలంటే..


ఆమె ఒక గృహిణి. ఏదైనా ఒక సాహితి కార్యక్రమానికి విచ్చేసినా.. వక్తల ప్రసంగాలు వింటున్నా.. వింటూనే పదే పదే గడియారం చూసుకుంటూనే ఉంటారు. ఎందుకంటె..ఇంటి దగ్గర ఉన్నవారికి అన్నీ అమర్చి వచ్చినా సరే..వారికి సమయానికి అన్నీ అమరుతున్నాయో లేదో అన్న ఆరాటం తో పాటు..ఇంటికి వెళ్ళేటప్పటికి యెంత పోద్దుపోతుందో..అని లోలోపల కించిత్ బిడియం,ఆదుర్దా.. అప్పుడప్పుడు మ్రోగే పోన్ తీసి ఇంటి వారికి సమాధానం చెప్పడం.. చూస్తుంటాను. 
మనిషి కనబడగానే ఒక ఆత్మీయతతో కూడిన చిన్న చిరునవ్వు, అరకొర మాటలు అంతే! కవిత వినిపించేటప్పుడు.. సమావేశపు హాలు అంతా నిశ్శబ్దం. ఆమె చెప్పే కవిత యెంత..చురకత్తిలా ఉన్నా..ఆవిడ వ్యక్తీకరించే తీరు.. బహు సున్నితం. 
అందుకేనేమో..ఆమె రాతలలో ఉన్న మహా గట్టిదనం మనిషిలో..కనబడదు. ఆమె పుష్ఫం   లాటి సున్నిత మైన మనసున్న మహా మనీషి. యెంత సున్నితంగా  తన భావాలని వ్యక్తీకరిస్తారో! 

నాకు దాదాపుగా ఏడేళ్ళ గా   పరిచయం.  ఈ కాలంలో.ఆమె మౌనంగా    ఎదిగిన నిబద్దత కల్గిన కవయిత్రి.  ఆమె కవిత్వానికి  ఆంద్ర రాష్ట్రంలో ఎన్నో..పురస్కారాలు  లభించాయి. అయినా ఆమెలో..కించిత్ గర్వం కూడా కనిపించదు. ఆమె కవిత్వంతో పాటు.. కథలు అల్లుతారు. ఆ కధల్లో పాత్రలు మన చుట్టూ ఉన్న మనకి పరిచయం ఉన్న పాత్రలే.. ఇలా.. కథలో పాత్రగా కనిపించాయా అన్నంత సహజంగా ..ఉంటాయి. 
ఆమె కవితా సంకలనాలు:
పుష్పరాగాలు,స్నేహమయి,వాడని పూలు,మరో కోణం,పూల రేకులు,హృదయకాంక్ష
ఈ కవితా సంకలనాలు ఆమె కన్నా ఆమె గురించి ఎన్నో చెప్పాయి. ఆమె భావాలలో ప్రపంచాన్ని చెప్పాయి.  
మచ్చుకి ఈ కవిత చూడండి.. 
  
ఇప్పటికి .. అనే కవితలో.. 

పోయిన పదవ రోజు 
పూసలు తెగాయి 
కాదు 
ఉరి రద్దు 
గాజులు పగిలాయి  
కాదు 
శృంఖల విముక్తి !
భాష్పాంజలా?
 కాదు దీపావళి !

ఆమె  హృదయ కాంక్ష ఏమిటో చూడండీ!.. 
మనిషిలోని  ద్వంద   వైఖరిని ..ఇలా ఎండ గట్టారు.


సాహిత్యం లేని చోట అంతా వట్టిపోయినట్లే అంటున్న వీరి కవిత చూడండి.


సాధారణంగాకనిపిస్తూ..  మంచి కవిత్వాన్ని అందిస్తూ.. ఉన్న కోపూరి పుష్ప దేవి గారి  అన్ని కవితా సంచికల్లోన్ని కవితలన్నీ.. ఏదో ఒక పత్రికల్లో ప్రచురితమై మనలని పలకరించే ఉంటాయి. 

ఈ హృదయ కాంక్ష అనే కవిత సంకలనాన్ని మా " ఎక్స్ రే - నెల నెల   వెన్నెల వేదిక కి అంకితం చేసిన ఆమెకి ధన్యవాదములు ..అందిస్తూ.. ఈ చిరు పరిచయం.