9, ఫిబ్రవరి 2012, గురువారం

కథా జగత్ లో నా కథ


"మనం స్వయంగా చిత్రించుకున్న చిత్రం జీవితం లాటిది. జీవిత చిత్రంలో లోపాలు చిత్రిస్తారా ఎవరైనా? ఒకవేళ లోపాలు ఉన్నా ఎన్నిమెరుగులు దిద్దినా, నగీషీలు పెట్టినా కూడా కనబడే లోపం లోపమే కదా. చూసే కళ్ళని బట్టి చిత్రం ఉంటుందేమో కానీ లోపం తెలిసి సరిపుచ్చుకునే చిత్రకారుడు ఉండడు. ఏ విధమైన లోపం లేకుండా ఉండాలనే చూస్తాడు" అంది హేమ.

చదివి మీ అభిప్రాయం చెప్పండి!

4 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

కథ చాలా బాగా రాసారండీ. అభినందనలు.

voleti చెప్పారు...

కధ బావుంది.. కాని..భర్తలో మార్పు వచ్చేలా ప్రవర్తిస్తుందేమో అని ఆశించాను..

కాయల నాగేంద్ర చెప్పారు...

కథ బాగుంది. అయితే హేమ ఇంట్లోంచి వెళ్లి పోవడం నచ్చలేదు.ఆ ఇంట్లో దేవతలాంటి అత్తగారు ఉన్నారు. వాళ్ళ అనుబందం చక్కగా వుంది. హేమ అక్కడే వుంటూ భర్తకు గుణపాఠం నేర్పితే బాగుండేదని నా అభిప్రాయం. చెప్పుతో సుధాకర్ మొహంపై వాయించిన హేమ " ఇలాగే నీ భార్య కూడా నా భర్తను కొట్టాల్సింది" అనడం బాగుంది.

వనజ వనమాలి చెప్పారు...

రామ కృష్ణ గారు..కథ నచ్చినదుకు.. ధన్యవాదములు.
@ వోలేటి గారు.. @ కాయల నాగేంద్ర గారు..ఇంకా అలాటి భర్తని మార్చడం అవసరం అంటారా? స్త్రీలకి.. గౌరవం,ఆత్మాభిమానం ఉంటాయి కదా! అన్నీ తెలిసి కూడా అతనిని తో.. కలసి బ్రతకడం ఆత్మ హత్యా సదృశ్యం అవదూ!!!!
అందుకేనేమో.. కథా జగత్ లో స్త్రీ వాద కథ అని మురళీ మోహన్ గారు ఉదహరించారు.వారు కథని అర్ధం చేసుకున్నారు. ధన్యవాదములు మురళీ మోహన్ గారు.