20, ఫిబ్రవరి 2012, సోమవారం

సర్ప పరిష్వంగం

నాకు నచ్చిన కవిత్వం సర్ప పరిష్వంగం

"నిషిద్దాక్షరి " అనే కవిత సంకలనంలో  ఉన్న కవిత ఇది.


90  వ దశకంలో స్త్రీవాద కవిత్వంగా చెప్పుకునే కవితలలో ఒక మంచి కవిత ఇది.

"నిషిద్దాక్షరి " లో ఉన్న ఈ కవిత తో పాటు.. ఆంద్ర జ్యోతి ఆదివారం అనుబంధం లో వచ్చిన "స్పర్శోత్శాహం " అనే కవిత కూడా నాకు బాగా నచ్చిన కవితల్లో ఒకటి.


అది లభ్యం కాక "నిషిద్దాక్షరి" లో కూడా ప్రచురితం కాలేదు.

ఈ కవిత వ్రాసిన కవయిత్రి ని (మందరపు హైమవతి) మా ఎక్స్ రే వేదిక..పై   .."నా కవిత్వం లో నేను " అనే కార్యక్రమం నిర్వహించాము.

స్థానికం గా ఉంటాం కాబట్టి "మందరపు హైమవతి " గారితో.. వేదికలపై,సభలు,సమావేశాలలో అప్పుడప్పుడు కలసి.. పలకరించుకుంటాం.

ఆమె చాలా  మంచి కవయిత్రి .    మంచి కవిత్వమే ఆమెని మేటిగా నిలబెట్టింది.


1 వ్యాఖ్య:

కాయల నాగేంద్ర చెప్పారు...

'సర్ప పరిష్వంగం' కవితలు చాలా బాగున్నాయండి!