20, మార్చి 2012, మంగళవారం

పిచ్చుకమ్మా ! ఇటు రావే!

ఈ రోజు పిచ్చుకుల  దినోత్సవం అని చూసాను.
వెంటనే,, పాపినేని శివ శంకర్  గారు ఆకాశవాణి "వెలుతురు చినుకులు " శీర్షిక తో..ప్రసారమైన కథానిక "ఆఖరి పిచ్చుక" గుర్తుకువచ్చింది. తరవాత ఆ కథానిక కథ రూపంలో సండే మాగజైన్ లో   వచ్చింది.
ఏదైనా ...పర్యావరణ కాలుష్యం వల్ల..చాలా పక్షి జాతులు అంతరించి పోయే ప్రమాదం ఉంది అని మనకి తెలుస్తూనే ఉంది. సేల్పోన్   టవర్స్  ద్వారా విడుదలయ్యే రేడియో   ధార్మిక తరంగాలవల్ల పిచ్చుకల జాతికి,చిన్న చిన్న పక్షుల మనుగడకి  ప్రమాదం ఉందని గత పదేళ్ళు గా  మనం చదువుతూనే ఉన్నాం. అయినా కిలోమీటర్ కి ఒక నాలుగు సెల్ టవర్లు కనబతాయి. మరి చేవికొక   పోన్ ఉన్నవారికి సేవలు నాణ్యంగా అందించాలి కదా!
వెన్నెల దారిలో ఒక కదిలించే కవిత చూసోచ్చక.. అప్పుడెప్పుడో.."అందెశ్రీ"గారు వ్రాసిన కవిత గుర్తొచ్చింది.అప్పుడు ఆ కవిత బాగా నచ్చి భద్రంగా దాచుకున్నాను. ఇప్పుడు  వెతికి తీసి  ఇక్కడ పంచుకుందామని..
                                           "చూడబోతే ఏలేడంత సృజన చూస్తే ఆకాశమంత "      ..
                                             "అందెశ్రీ"గారి కవిత ఇది..(ఆంధ్ర జ్యోతి..వివిధ లో)

అలాగే మరో కవిత.. రేడియో మిర్చి ఆర్ జే  హేమంత్ బ్లాగ్ సౌజన్యం తో..

  బాగుంది కదా..! మనం మాత్రం సెల్ పోన్ విపరీతంగా వాడటం తగ్గిద్దాం. చక్కగా తిరిగే కిచ కిచ లని బ్రతకనిద్దాం రేపు మనం అలాగే అంతు  తెలియని రోగాలు పాలవకుండా..కాస్త జాగ్రత్తతో..ఉండాలి అనుకుంటాం కదా! అయ్యో  ... ..నా  మొబైల్ పోన్ ఎక్కడ?. కనబడకపోతే..క్షణం తోచదూ... ఇది సంగతి.
నేను కూడా అతీతురాలిని ఏమి కాదండి :(((((...