21, ఏప్రిల్ 2012, శనివారం

ఎవరివి లలన

ఎవరివి లలన .. ఎవరివి లలన ..!?

నేను ఎవరివి లలన అని అడుగుతున్నాను  అనుకున్నారా ? ఆగండి  ఆగండి ...

ఇది ఒక పాటండి. మీరందరూ వినే ఉంటారు. ఇప్పుడు పైన లింక్ గమనించి పాట వింటూ ..విషయం చూడండి. .

"ఇష్టపడి" అనే చిత్రంలో పాట..ఈ పాటలో సాహిత్యం చూడండి.. కాస్త అతిశయంగా ఉంటుంది.

 రాజ్ కపూర్ హీరొయిన్ లా ఉంది సొగసు.. ఈస్టమన్ కలర్ లో ఉంది ఫిగరు..అంటూ..హీరోతో వర్ణింప జేసి  హీరోయిన్లని బతికించిన దర్శకేంద్రుడి తరం కాస్త దాటుకుని..

ఎందుకంటే ..ఓ..ప్రేమికుడికి తన ప్రియురాలో లేక ఊహా సుందరో..అలా అనిపించడం తప్పు కాదు కదా!
అప్పుడెప్పుడో రాఘవేంద్రరావు గారి చిత్రంలో . రమ్య కృష్ణ లా గ ఉంటుందా !అని   53  మంది  హీరోయిన్ పేర్లతో..చెడుగుడు ఆడేసి వాళ్ళలా ఉంటుందా..వీళ్ళ లా   ఉంటుందా అని అడుగుతూ.. ఒక సౌందర్య దేవతని కనుగొంటాడు అనుకోండి. "పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా " అంటూ భువనచంద్ర లిరిక్స్ తో.. వందేమాతరం శ్రీనివాస్ స్వరాల ఆట ఆడుకుని మనని మురిపించారు. జగపతి బాబు అందరి చేతా.."ఆహా"  అనిపించేస్తూ ప్రియురాలి అడ్రెస్స్  చెప్పమని బతిమిలాడాడు అనుకోండి. సినిమా పాటలలో అతిశయంగా ఉండే పోలికలతో..పాటు.. వ్యాపార చిహ్నం ల పేరులని.. (బ్రాండ్ నే మ్) ల తోనూ పాటల సాహిత్యం ని పరిచయం చేసారు, అలాంటి పాటలు ఇవి.
  "నీకు నాకు నోకియా,..." .అంటూ శంకర్ అపరిచితుడు లో.. సేల్పోన్ బ్రాండ్ తో..సందడి సందండి చేయించారు. చందనా చీరను చుట్టి బొమ్మనా బ్లౌస్ ని తొడిగి.. ఇలా.. బ్రాండ్ నేమ్స్ తో చాలా పాటలే వచ్చాయి.. కానీ ఇప్పుడు సమయానికి గుర్తుకు రావడం లేదు. 

మీకేమైనా గురుకు వస్తే చెప్పండి.

ఇక ఎవరివి లలన .. ..అన్న పాట.. సాహిత్యం చూడండి. ఎన్నో రొమాంటిక్ సాంగ్స్ ని తెలుగువారికి అందించిన "భువన చంద్ర" ఈ పాట కి సాహిత్యం అందించారు. సంగీతం...ఎమ్.ఎమ్.శ్రీ లేఖ.
నాకు బాగా నచ్చిన పాట.  మీరు కూడా నచ్చి మెచ్చి..తే..సంతోషం..

ఎవరివి లలన  ఎవరివి లలన.. 
నీ సౌందర్యమే మేడ ఇన్ హేవేనా (ఎ)
ఫెయిర్ అండ్ లవ్ లీ మోడల్ నీవా 
వాలెంటైన్ హార్ట్ వి నీవా (పె) 

మైదానంలో నువ్వడిగిడితేయువ హృదయాలే జంకయి  పోవా 
స్విమ్ సూట్ వేసి ఈడుతుంటే స్విమ్మింగ్ ఫూలే సెంటై పోదా 
రోడ్డుపై నువ్వుంటే ట్రాఫిక్ జామే 
నీ మోము చూస్తుంటే చాలదే టైమే   
కాళిదాసు కయినా నిన్ను  వర్ణింప తరమే (ఎ )

నీ చిరునవ్వే పుల్ మూన్ లైట్ 
నీ స్మార్ట్ పిగర్ ఈఫిల్  టవర్ 
నిను చూడలేదంటే లైఫే వేస్ట్ 
నీ స్నేహముందంటే సాల్టే స్వీట్ 
నీ పైట చెంగును చూసి షేక్ అవదా ఎవరెస్ట్  
ఎవరివి లలన  ఎవరివి లలన.. 
నీ సౌందర్యమే మేడ ఇన్ హేవేనా (ఎ)
ఫెయిర్ అండ్ లవ్ లీ మోడల్ నీవా 
వాలెంటైన్ హార్ట్ వి నీవా (పె) 

3 వ్యాఖ్యలు:

రాజి చెప్పారు...

వనజవనమాలి గారూ.. ఈ పాట, "హృదయాంజలి" అనే సినిమాలో "మానస వీణా మౌన స్వరానా" అన్న పాట ఒకటే ట్యూన్ లో ఉన్నాయండీ..
మీకు తెలిసే వుంటుందేమో తెలియకపోతే ఒకసారి ఈ పాట కూడా చూడండి..

http://raaji-telugusongslyrics.blogspot.in/2011/05/blog-post_7605.html

వనజవనమాలి చెప్పారు...

రాజీ..గారు..తమిళ చిత్రం మే మాతం(తెలుగులో హృదయాంజలి) లో ఈ పాట ఉంది. ఆ చిత్రానికి ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. నేను ఈ పాటలు రెండింటిని శబ్దాలయం లో.. పరిచయం చేసాను.మీరు పరిచయం చేసారు. :) పాట బాగుంటుంది కదా!

ఈ లింక్ చూడండి. ..http://shabdhaalaya.blogspot.in/2011/08/blog-post_27.html
థాంక్ యు!
చాలా రోజుల తర్వాత మీ పునర్దర్శనం. ఆనందం.

జలతారువెన్నెల చెప్పారు...

ఇంతకు ముందు వినలేదండి. బాగుంది పాట