22, మే 2012, మంగళవారం

"ప్రేమలు-పెళ్ళిళ్ళు"


ఓ..మంచి పాట .

ప్రేమలు-పెళ్ళిళ్ళు చిత్రంలో.. పాట.

ఈ చిత్రం మాదిరెడ్డి సులోచన గారి "ప్రేమలు-పెళ్ళిళ్ళు" నవల ఆధారంగా నిర్మింపబడినది.

ఎమ్.ఎస్ విశ్వనాధన్, ఆచార్య ఆత్రేయ గారి కలయికలో..ఈ పాట ..సందర్భోచిత పాట ..అనుకుంటున్నాను.(నేను చిత్రం చూడ లేదు.)

చిన్నప్పటి నుండి రేడియో లో వినడం వల్లనేమో..ఈ పాట అంటే చాలా ఇష్టం ఏర్పడింది.

ఈ పాట సాహిత్యం కన్నా కూడా సంగీతం ఇష్టం నాకు.

పాట సాహిత్యం ..

ఎవరు నీవు నీ రూపమేది
ఏమని పిలిచేది .. నిన్నేమని పిలిచేది .. [ఎవరు ]
నేనని వేరే లేనే లేనని .. [2]
ఎలా తెలిపేది … మీకెలా తెలిపేది …

నిదుర పోయిన మనసును లేపి ..
మనిషిని చేసిన మమతవు నీవో ..[2]
నిదురే రాని కనులను కమ్మని ..
కలలతో నింపిన కరుణవు నీవు ..
పూజకు తెచ్చిన పూవును నేను .. [2]
సేవకు వచ్చిన చెలిమిని నేను ..
వసివాడే ఆ... పసి పాప లకై .. [2]
దేవుడు పంపిన దాసిని నేను ..
నేనని వేరే లేనే లేనని ..
ఎలా తెలిపేది .. మీకెలా తెలిపేది .. [ఎవరు ]

చేదుగా మారిన జీవితమందున ..
తీపిని చూపిన తెనేవు నీవు .. [చేదుగా ]
వడ గాల్పులలో వడలిన తీగకు ..
చిగురులు తొడిగిన చినుకే మీరు .. [2]
కోరికలేక కోవేలలోన వెలుగై కరిగే దీపం నీవు
దీపం లోని తాపం తెలిసి .. [2]
ధన్యను చేసే దైవం మీరు ..
దైవం మీరు …
అహః ….ఒహోహో ….ఉహుహు ….

ఈ పాట వినండి..

8 వ్యాఖ్యలు:

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

Nice Song Nadi Manchi Paatanu Praicheyam Chesharu.. Dhanyavaadamulu

కాయల నాగేంద్ర చెప్పారు...

వనజగారు మీరు వినిపించిన పాట అద్భుతంగా వుంది. మీరు రాసిన వాటిలో కొన్ని పదాలలో అక్షరాలు తారుమారయ్యాయి. మీరు రాసినప్పుడు కరెక్టుగానే రాసివుంటారు. పోస్ట్ చేసేటప్పుడు అక్షరాలు తారుమారు అవుతాయి.
నిదురపోయిన
పూజకు తెచ్చిన
పసిపాపలకై
తేనెవు

వనజవనమాలి చెప్పారు...

ప్రిన్స్ ..గారు.. పాట నచ్చినందుకు ధన్యవాదములు. ఇలాటి ఆణి ముత్యాలు లాంటి పాటలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి పాటలు అయితే నాకు వంటి తెప్పిస్తాయి. అందుకే ఓల్డ్ సాంగ్స్ ప్రేమి ని నేను. అప్పుడప్పుడు ఇలా వస్తుంటాను..:)
నాగేంద్ర గారు.ఈ అచ్చు తప్పులతో.. చాలా ఇబ్బందిగా ఉంటుంది.పోస్ట్ వ్రాసే టప్పుడు కరక్ట్ గానే వ్రాస్తుంటాను. తర్వాత చూస్తే చాలా తప్పులు ఉంటున్నాయి.వ్రాసే దానికన్నా..అచ్చు తప్పులు సరిచేయడం కే ఘన సమయాలు గడచి పోతున్నాయి.:(
పాట నచ్చినందుకు ధన్యవాదములు. అందుకు నలుగురకి మనం ధన్యవాదములు చెప్పుకుందాం.

C.ఉమాదేవి చెప్పారు...

మీరు వినిపిస్తున్న ఆనాటి మేటి పాటలు జీవితాన్ని రివైండ్ చేస్తున్నాయి. ఆనాటి చిత్రాలు,వాటిలోని పాటలు,ఓహ్! జ్ఞాపకాలు అలరిస్తున్నాయి.

మాలా కుమార్ చెప్పారు...

ఈ నవల బాగుంటుంది . సినిమా కూడా నీట్ గా తీసారు బాగుంటుంది .ఆ సినిమా వచ్చిన కొత్తల్లో చూసాను .మళ్ళీ సి .డి కోసం ప్రయత్నం చేస్తే ఇంకా రాలేదన్నారు .
ఈ పాట శారద , నాగేశ్వరరావు మీద చిత్రీకరించారనుకుంటా .

రాజి చెప్పారు...

""ప్రేమలు-పెళ్ళిళ్ళు"" బుక్ అమ్మ దగ్గర వుంది
కానీ చదవలేదు..
మంచి పాటను వినిపించారండీ థాంక్యూ..

వనజవనమాలి చెప్పారు...

C.Uma devi gaaru Thank you very much.

@Mala kumar gaaru Dhanyavaadamulu.

@Rajee gaaru.."premalu-pellillu" navala chadivesi parichayam cheyandi.yeduru choosthoo untaanu.

andariki boledu dhanyavaadamulu. paata hrudayaalani taaki spandinchaaru kadaa..anduku.

శ్రీ చెప్పారు...

మంచి పాట
వనజ గారూ!
@శ్రీ