20, జూన్ 2012, బుధవారం

శరపంజరం


మృత్యువు క్షణం లో ఎవరిని కబళి స్తుందో తెలియదు. మృత్యు వాత పడినవారిని చూసినప్పుడు అయ్యో! అనిపిస్తుంటుంది..మనం ఎప్పుడో ఒకప్పుడు అలా వెళ్ళక తప్పదని తెలిసి కూడా.

మరణం
చెపుతుంది అంట మనిషి అంటే ఏమిటో అన్నది.

మృత్యువన్నది
సునాయాసంగా అనుకోని అతిధిలా రావాలని కోరుకుంటాం.మరణం లో కూడా సుఖం ఉండాలనే ఒక ఆకాంక్ష. అది అందరికి రానే రాదు.

కణాల
సముదాయ మయిన శరీర పంజరం లో ఎప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయో..!

వ్యాధులు భాధలు తుదముట్టించి క్షీణింప జేస్తాయో! మృత్యువు ముంచుకు వస్తుందని తెలిసి మృత్యువు కోసం ఎదురుచూడటం లో ఎంత వేదన,బాధ దాగి ఉంటాయో. పెదవి విప్పి చెప్పలేని ఎన్నో భావాలు,మనకై తోడూ రాని ఎన్నో బంధాలు..అన్నీ శూన్యం. ఎన్ని నిశ్శబ్ద సంకేతాలు.

మరణం
సత్యమని జీవికి తప్పదని తెలిసినా జనన మరణ సత్య మాగదు..కదా!

కేన్సర్
రాకాసికి చిక్కిన .. సాటి మనిషిని చూసి వేదన అంతా సిరా లో ప్రవహించి అక్షరాలగా ఘనీభవించిన "శర పంజరం" కవితని చూడండి.

కవిత జూన్ 27 నవ్యలో వారం కవితగా ప్రచురితమైనది.

కవితని వ్రాసినవారు శ్రీమతి ఆవాల శారద. ఆమె గళం విప్పితే ..చైతన్య ప్రవాహం. కలం కదిపితే.. కవిత.

నా
అభిమాన రేడియో వ్యాఖ్యాత ..శ్రీమతి ఆవాల శారద గారు. విజయవాడ ఆకాశవాణి లో సీనియర్ వ్యాఖ్యాత గా ఉన్నారు. "నవకవితా వేదిక"ని నిర్వహించేవారు.

ఆమె
కలం చిందించిన కవిత ..అక్షరం అక్షరం ఆవేదన. సాటి మనిషిని పీడించే ..పెను రక్కసి పై పోరాడలేని అసక్త తో..మనీషిగా స్పందనతో..వ్రాసిన కవిత.

పదిహేను ఏళ్ళ క్రితం కేన్సర్ తో.. "మా అమ్మ " అనుభవించిన బాధని నేను మరువనే లేను. మళ్ళీ ఆ బాధని గుర్తు చేస్తూ..ఈ కవిత.. నన్ను ఎంతగానో కదిలించింది.భయం కల్గిస్తుంది.

ఏ కేన్సర్ వ్యాది గ్రస్తులని చూసినా .. మరణ వేదికపై నిలబడి రా రమ్మని ఆహ్వానిస్తున్న ..ఓ..రెండు గాజు కళ్ళు కనిపిస్తాయి.

ఆరాటాల పోరాటాల జీవన గమనం లో మరణం కూడా ఎదురు చూపేనా..అన్న భాద తో..
ఈ కవిత షేర్ చేసుకుంటున్నాను.

8 వ్యాఖ్యలు:

భాస్కర్ కె చెప్పారు...

chaalaa vedhaanatho raasaraavida, manchi kavithanu parichayam chesarandi.

Alapati Ramesh Babu చెప్పారు...

కేన్సర్ రాకాసీ ఎంత భయకంరమయినదో నేను కూడా
మా నాన్నగారి విషయంలో ప్రత్యక్షముగా గమనించా నిజముగా భయంకరమయిన నరకము.

srinivas చెప్పారు...

Superb...
http://blogillu.com

జలతారు వెన్నెల చెప్పారు...

Nice poem andi!

అజ్ఞాత చెప్పారు...

బాగుంది

పల్లా కొండల రావు చెప్పారు...

చనిపోతామనీ తెలిసీ బ్రతకడమే జీవితం. ప్రతి జీవితం ఓ పోరాటం. ప్రతి పోరాటం ఓ ఫలితాన్ని ఇస్తుంది. ఇవ్వాలి.

కన్ను తెరిస్తే జననం - కన్ను మూస్తే మరణం. జననమరణ చక్రమాగేది కాదు.

మా దగ్గరి బంధువు కేన్సర్ తో బాధపడి మరణించినది నేను దగ్గరుండి హాస్పిటల్ లో గమనించినప్పుడు ఇలాంటి ఆలోచనలే ప్రశ్నలుగా - సవాల్ గా నిలిచాయి.

అయితే యాక్సిడెంట్ లాంటి ఇలాంటి బాధలను అరికట్టే మానవ పరిశోధనలు మంచి ఫలితాలనివ్వాలని ఆశిస్తూ ..... నైస్ షేరింగ్ వనజ గారూ !

Meraj Fathima చెప్పారు...

వనజ గారూ, చాలా గొప్పగా అర్ధవంతంగా చెప్పారు, మీ కలంతో కొత్త ఊరట కలిగించండి వ్యాదిగ్రస్తులకు, బాగా రాసారు.

వనజ తాతినేని చెప్పారు...

ది ట్రీ భాస్కర్ గారు
@ఆలపాటి రమేష్ బాబు గారు
@ శ్రెనివాస్ గారు
@జలతారు వెన్నెల గారు
@కష్టేఫలె గారు
@పల్లా కొండలరావు గారు
@మేరేజ్ ఫాతిమా గారు..
స్పందించిన అందరికి హృదయ పూర్వక ధన్యవాదములు.