23, జూన్ 2012, శనివారం

ఆనాడు - ఈనాడు - ఏనాడు
ఒక పాట .. నా పరిశీలన

ఒక స్త్రీ-ఒక పురుషుడు పరస్పరం నిందించుకుంటూ.. ఏమనుకుంటున్నారో ఒక సారి చూడండి.

ఆమె:

ఆనాడు ఈనాడు ఏనాడు
ఆడదాన్ని ఆట బొమ్మగా చేసాడు మగవాడు
ఆడించాడు ఆడకపోతే పీడించాడు

అడుగుల మడుగుల ఒత్తించాడు మగవాడు మన పగవాడు
ఒకడు ఆమ్ముకుపోయాడు ఒకడు అడవికి పంపాడు
ఒకడేమో జూదంలో పందెం కాసాడు
తల్లిని చేసి ఒకడేమో తపస్వి అన్నాడు
తండ్రి భయపడి ఒకడేమో తాగి చచ్చినాడు
ఏ మగవాడు ఏ మగువని మనసున్నడిగా చూసాడు.
మగవాడే మన పగ వాడు
మగవాడే మన పగ వాడు
ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాన్ని ఆట బొమ్మగా చేసాడు మగవాడు
ఆడించాడు ఆడకపోతే పీడించాడు

అతను: ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాని కీలు బొమ్మే అయ్యాడు
ప్రేమించాడు దేవత నీవని పూజించాడు
పరువు బ్రతుకు నీవన్నాడు మగవాడే బలి పశువయ్యాడు.
నెత్తిన కూర్చుంది ఒకటి
నెత్తిన తన్నింది ఒకటి
ఒకటేమో శపథం చేసి యుద్ధం చేసింది
నాయకురాలై ఒకతేమో యుద్ధం చేసింది
తండ్రికి భయపడి ఒకతేమో ధనాన్ని పెళ్ళాడింది
ఏ మగువైనా మగవాడ్ని మనిషిగా చూసిందా?
మగవాడే బలి పశువయ్యాడు
మగవాడే బలి పశువయ్యాడు
ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాన్ని ఆట బొమ్మగా చేసాడు మగవాడు

ఆమె:సగమే ఇచ్చి మగువను మొత్తం దోచేస్తాడు
అతను:సగము ఇచ్చాకే సన్యాసి మిగులుతాడు ఈమగవాడు
ఆమె:యుగయుగాల బానిసే ఆడది
అతను:యుగాయుగాలే శాపమే ఈ ఆడది .

ఇది ఒక పాట. "తాయారమ్మ-బంగారయ్య"చిత్రం లో పాట.

ఇలా తర తరాలుగా .. ఒకరి మీద ఒకరు నెపం వేసుకుంటూ .. కయ్యానికి కాలు దువ్వుకుంటూ ఉండటమేనా!
ఒకరికి ఒకరై.. ఇరువురు ఒకటై... ఉండేనా!!??? ఇప్పుడు కాలం లో అయితే మరీ ఎక్కువగా వర్తిస్తుంది. స్త్రీవాదమో,పురుష వాదమో కాదు కావాల్సింది .. కలసి ఉంటే కలదు సుఖం అని తెలిసేది ఎప్పుడో..!!??

ఈ పాట వినండి.

13 వ్యాఖ్యలు:

the tree చెప్పారు...

bhagundandi,

Palla Kondala Rao చెప్పారు...

స్త్రీ వాదమూ - పురుష వాదమూ అనేవి అసంపూర్ణ లేదా అర్ధం లేని వాదనలు. ఎవరూ ఎవరిని అణగదొక్కడం అనాగరికమే. స్త్రీ - పురుషుల మధ్య ఉండే ప్రకృతిపరమైన - అవసరమైన - సహజమైన అవసరాల కలయిక ఎక్కువ తక్కువలతో కాకుండా సమాజ అభివృద్ధిలో భాగం గా , మానవ వికాసానికి ఆయువు పట్టుగా ఉండాలి. ఆ అవసరాలలోనుండి వచ్చిందే కుటుంబ వ్యవస్థ . ' ఒకే సమాజం - ఒకే కుటుంబం దిశగా ' నిజమైన ప్రేమలతో ఒకరి పై ఒకరికి అధికారాలు కాకుండా ఉండే పవిత్ర కుటుంబాల దిశగా కృషి చేసేందుకు స్త్రీ పురుషులు కలసికట్టుగా కృషి చేయాలి.

సీత చెప్పారు...

బాగా చెప్పారు వనజగారు...
ఒకరికిఒకరై ఉండాలి కానీ, ఎప్పటికీ నెపాలు వేసుకుంటూ ఉంటే జీవితం అంతే...అయినా అలా పోట్లాడుకునే ముందు ఇంతకుముందు ప్రేమ ని ఆవేశం కప్పేస్తుందేమో...?! అలా జరకకుండా ఉంటే బాగుంటుంది..
చక్కని పోస్ట్ వనజ గారు..

oddula ravisekhar చెప్పారు...

ఆనందం జీవితం లో నిండాలంటే ఇరుహృదయాలు ఒక్కటవ్వాలి.రెండు మనసులు నిరంతరం ఆలోచనలు పంచుకోవాలి.అప్పుడు ఒకరికి ఒకరు అర్థమవుతారు.పాట వింటే కొందరికి కనువిప్పు కలగవచ్చు.మంచి పాయింట్ ఫోకస్ చేసారు.

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

విడి విడిగా సగమే కద!
కడు 'పరిపూర్ణత' లెపుడును కలిసున్నపుడే ,
విడి విడి 'గొప్పలు' వోవుట
పడతులకును, పతులకైన ప్రకృతి విరుధ్ధమ్ .
-----సుజన-సృజన

SNKR చెప్పారు...

ఖాళీగా వున్నపుడు, తీరిగ్గా కొట్టుకు చావడానికి ఇలాంటి పాటలు, సినిమాలు, డైలాగులు, నవలలు వుపకరిస్తాయి

కాయల నాగేంద్ర చెప్పారు...

మన వివాహ వ్యవస్థ ఎంతో గొప్పది. భిన్నమైన అభిరుచులు , అభిప్రాయాలు , అలవాట్లు కలిగిన స్త్రీ పురుషులను ఒకటిగా చేస్తుంది. ఆ బంధానికి కట్టుబడి జీవితాంతం ఒకరికొకరు తోడుగా వుంటూ ముందుకు సాగుతారు దంపతులు. అప్పటినుండి ఇద్దరికీ ఒకరికి మరొకరు అవసరం. ఒక్కోసారి మనస్పర్ధలు వచ్చినా వాటిని మొగ్గలోనే తుంచేయాలి. కుటుంబ క్షేమమే ద్యేయంగా భావించి ముందుకు సాగితే ఇద్దరి మధ్య విభేదాలు వుండవు. మంచిపోస్ట్!

సాయి చెప్పారు...

ఇంతకు ముందు ఎప్పుడూ ఈ పాట వినలేదు. చాలా బాగుంది..మంచి విషయాన్ని టార్గెట్ చేసారు..

వనజవనమాలి చెప్పారు...

SNKR గారు.. అయ్యో..ఏమిటండీ అలా అనేసారు!?
పని పాట లేనివాళ్ళే ఇలాటి వాటికి ప్రాముఖ్యత ఇస్తారా!? నిజమేనేమో! :)
ఆఫ్కోర్స్..నేను కూడా అంతేనేమో! బఠానీలు తింటూ కూడా ప్రోటీన్స్ గురించి ఆలోచిస్తాను నేను.:) :)
థాంక్ యు వేరి మచ్.

వనజవనమాలి చెప్పారు...

ది ట్రీ భాస్కర్ గారు.. జస్ట్ సరదాగా ఉంది అని చెప్పి పోస్ట్ చేసాను.
అయితే ఇప్పటి వారు.. కూడా ఇలా వాడులాడుకుంటున్నారు కదా!
సమయాలు లేని వాళ్ళ గురించి నేను చెప్పలేను.
ప్రతి రోజు కంటెంట్ ఉండే పోస్ట్ వ్రాయాలని ట్రై చేస్తూ.. తీరిక లేక, మూడ్ లేక ఇలా వస్తూ ఉంటాను. థాంక్ యు.. అండీ!
@కొండల రావు గారు.. ఏ వాదాలు లేకుండా.. ప్రేమగా,అవగాహనతో..ఒద్దికతో జీవితాలు సాగడంలో ఆనందం ఉంటుంది..కదండీ!
అలా ఉండాలనే ఆశతో..ఈ చిన్నపాటి పాట పోస్ట్. ధన్యవాదములు.
@ సీత గారు.. థాంక్ యు వేరిమచ్ !!

వనజవనమాలి చెప్పారు...

ఒద్దుల రవి శేఖర్ గారు.. మీ స్పందనకి ధన్యవాదములు.
@వెంకట రాజారావు లక్కాకుల గారు.. మనసెరిగి బ్రతికిన బ్రతుకులలో ఆనందం శాశ్వతంగా ఉందును కదా! వాదములు, భేదములు..ఎలా?
ధన్యవాదములు.
@ నాగేంద్ర గారు..అవగాహన లేకుండా..ఆవేశాలతో జీవితం నాశనం చేసుకున్తున్నవారిని చూస్తే ఈ పాట గుర్తుకు వచ్చింది. జస్ట్ అలా పోస్ట్ చేసాను.మీ అందరికి నచ్చినందుకు ధన్యవాదములు.
@సాయి గారు.. థాంక్ యు వేరి మచ్.

SNKR చెప్పారు...

/బఠానీలు తింటూ కూడా ప్రోటీన్స్ గురించి ఆలోచిస్తాను నేను/
హా హా నేను కొద్దిగా వేరేనండి. బఠాణీలు తింటున్నప్పుడు ఏమీ ఆలోచించను, రుచిని ఆస్వాదించడంలో లీనమవుతాను. :))

Rao S Lakkaraju చెప్పారు...

అందరూ ఒకే విధంగా (ఆలోచనలూ వగైరా)ఉంటారని ఎక్కడా చదవలేదు. వినలేదు. ఆడా మగా కూడా ఆ అందరిలోనే. అయినప్పుడు బేధాలు తెలుసుకొని, వాటిని మార్చలేమని గ్రహించి సంసారం చేస్తే సుఖంగా కలసికట్టుగా ఉండచ్చేమో.