11, ఆగస్టు 2012, శనివారం

పాడాలనే ఉన్నది..


"చిల్లర దేవుళ్ళు" చిత్రం లో ఈ పాట
సాహిత్యం : ఆత్రేయ
సంగీతం:కే.వి.మహాదేవన్
గళం; ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం
పాడాలనే ఉన్నది ఈ లింక్ లో వినండి.

పాట సాహిత్యం

పాడాలనే ఉన్నది
విని మెచ్చే మనసిచ్చే మనిషుంటే
పాడాలనే ఉన్నది.

పాడాలనే ఉన్నది
విని మెచ్చే మనసిచ్చే మనిషుంటే
పాడాలనే ఉన్నది.

పాడాలంటే హృదయం ఉండాలి
పాడాలంటే హృదయం ఉండాలి
హృదయానికి ఏదో కదలిక రావాలి
భావం పొంగాలి రాగం పలకాలి దానికి జీవం పోయాలి..
భావం పొంగాలి రాగం పలకాలి దానికి జీవం పోయాలి..

పాడాలనే ఉన్నది
విని మెచ్చే మనసిచ్చే మనిషుంటే పాడాలనే ఉన్నది

పాడానంటే రాళ్ళే కరగాలి
ఆ రాళ్ళకు నోళ్లోచ్చి కథలే చెప్పాలి
పాడానంటే రాళ్ళే కరగాలి
ఆ రాళ్ళకు నోళ్లోచ్చి కథలే చెప్పాలి

ముసుగులు తొలగాలి మసకలు పోవాలి
గదిలో దేవత కను తెరవాలి.
పాడాలనే ఉన్నది4 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

చాలా మంచి పాట.. ఇదే చిత్రం లో "కలువకు చంద్రుడు ఎంతో దూరం..." అన్న గీతం కూడా సాహిత్య పరంగా ఎంతో బాగుంటుంది..

Meraj Fathima చెప్పారు...

vanajaa dear baagundi manchi prayatnam

కాయల నాగేంద్ర చెప్పారు...

మంచి పాటను గుర్తుచేశారు. ఈ పాటకు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం గారు జీవంపోయడంతో భావం పొంగి, రాగం పలికింది.

వనజవనమాలి చెప్పారు...

mhsgreamspet రామకృష్ణ గారు.. ధన్యవాదములు. మీరు చెప్పిన పాట సాహిత్యం కూడా చాలా బాగుంటుంది అండీ !
@ మేరాజ్ ఫాతిమా.. పాడాలనే ప్రయత్నం కాదండీ! మంచి పాట వినిపించే ప్రయత్నమే సుమా!! థాంక్ యూ వెరీ మచ్.
@ కాయల నాగేంద్ర గారు.. బాలు గారు పాట పాడిన విధానమే నాకు బాగా నచ్చుతుంది. పాటకి జీవం ఉండబట్టే ఎప్పటికి నిలిచి ఉండే పాట అయింది. పాట నచ్చినందుకు వ్యాఖ్యకి ధన్యవాదములు.