9, ఆగస్టు 2012, గురువారం

అందరికి నచ్చిన ...

రెండు రొమాంటిక్ సాంగ్స్ ...
వేటూరి కలం జాలువార్చిన ఈ రెండు పాటలు 'ఇంటింటి రామాయణం" చిత్రంలో పాటలు.
స్వర కల్పన :రాజన్-నాగేంద్రఈ పాట సాహిత్యం:

మల్లెలు పూసే ..వెన్నెల కాసే..ఈ రేయి హాయిగా..
మల్లెలు పూసే ..వెన్నెల కాసే..ఈ రేయి హాయిగా..
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా!!

మల్లెలు పూసే ..వెన్నెల కాసే..ఈ రేయి హాయిగా!!

ముసిముసి నవ్వులలో.. గుసగుస లాడినవే..నా తొలి మోజులే నీ విరజాజులై..
ముసిముసి నవ్వులలో.. గుసగుస లాడినవే..నా తొలి మోజులే నీ విరజాజులై..

మిస మిస వన్నెలలో.. మిల మిల మిన్నవిలే..నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే..
కాటుకలంటుకున్న కౌగిలింతలెంత వింతలే!!

మనసులు పాడే..మంతనమాడే..ఈ పూట జంటగా..
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా!!

మల్లెలు పూసే ..వెన్నెల కాసే..ఈ రేయి హాయిగా!!

ఆహా..ఆ ఆ ఆ
ఆహ..హా
ఆ ఆ ఆ..ఆ ఆ ఆ

తొలకరి కోరికలే..తొందర చేసినవే..ఈ విరిశయ్యకే ఆవిరి తీరగా..
తొలకరి కోరికలే..తొందర చేసినవే..ఈ విరిశయ్యకే ఆవిరి తీరగా!!

సొగసరి కానుకలే..సొద పెడుతున్నవిలే..ఏ తెరదాటునో ఆ చెర వీడగా..
అందిన పొందులోనే అందలేని విందులీయవే!!

కలలిక పండే..కలయిక నేడే..కావాలి వేయిగా..
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా!!

మల్లెలు పూసే ..వెన్నెల కాసే..ఈ రేయి హాయిగా..
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా!!

మల్లెలు పూసే ..వెన్నెల కాసే..ఈ రేయి హాయిగా!!


ఇంటింటి రామాయణం చిత్రం లోని మరొక పాట ...

"వీణ వేణువైన సరిగమ విన్నారా.. "
10 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

రెండూ మంచి పాటలేనండి.. రెండో పాట అప్పట్లో కన్నడ లో ఎక్కువగా విన్నట్లు జ్ఞాపకం

మాలా కుమార్ చెప్పారు...

manchi paatalu .

శ్రీ చెప్పారు...

వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ ఓ ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహ తహ లాడాల చెల రేగాల
చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో !

మల్లెలు పూచే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా...

హై స్కూల్ లో ఉన్నపుడు బాగా విన్న పాటలు ఇవి
మంచి సాహిత్యం..
మంచి పోస్ట్...
@sri.

Meraj Fathima చెప్పారు...

వనజ గారూ, మంచి పాటలు చాలా ఇష్టమైనవి అందరికీ నచ్చేవి పెట్టారు.

వనజవనమాలి చెప్పారు...

మాలా గారు ఈ పాటల వీడియో చాలా కాలం అన్వేషణ తర్వాత దొరికాయి. అందుకు మనకందరికీ సంతోషమే!
ఆ వీడియోస్ అప్లోడ్ చేసిన చిమట మ్యూజిక్ వారికి మనమందరం ధన్యవాదములు చెప్పాలి.
@mhsgreamspet రమ కృష్ణ గారు.. సంగీత దర్శకులు కన్నడ వారు కదండీ! ఆ ట్యూన్స్ తో పాటలు ఉన్నట్లున్నాయి. వివరాలు అంతగా తెలియదు. థాంక్స్ అండీ!
@శ్రీనివాస్ గారు... పాటలు బాగా నచ్చినాయి కదండీ !! :) థాంక్ యు వెరీ మచ్!!

వనజవనమాలి చెప్పారు...

మేరాజ్ ఫాతిమా .. థాంక్ యు! పాటలని మనఃస్పూర్తిగా ఆస్వాదించండి.

oddula ravisekhar చెప్పారు...

నాకు నచ్చిన మంచి పాటల్లో ఈ రెండు ఉన్నాయండి.

శశి కళ చెప్పారు...

వీణ వేణువైన ..పాట నాకు ఇష్టం

రాజి చెప్పారు...

ఈ రెండు పాటలు చాలా బాగుంటాయండీ
"వీణ వేణువైన సరిగమ విన్నావా" పాట నాకు చాలా ఇష్టం..
ఇప్పటిదాకా వీడియో దొరకలేదు ఈ పాటలకి..
మొదటిసారి మీ బ్లాగ్ లో చూస్తున్నాను

ThankYou!!

chinni v చెప్పారు...

నాకు ఈ రెండు చాల ఇష్టం .