20, మే 2013, సోమవారం

"వెలుతురుబాకు " ఇలా ఉండాలని

నా మొదటి కవితా సంకలనం .. త్వరలో ..

కవర్ పేజీ ఇలా ఉండాలని నా అభిలాష ..

ఎలా ఉందంటారు?అజ్ఞాన అంధకారం నిండిన సమాజానికి ప్రతీకగా "నలుపు " ని   మూల చిత్రంగా ఎంపిక చేసి ఆ అజ్ఞానాన్ని చీల్చే వెలుతురు (వెలుగు) బాకు ని కవిత్వంగా ఉదహరిస్తూ నేను ఈ చిత్రాన్ని ఎంపిక చేసాను. వెలుగు కి  ,వెలుతురు పర్యాయపదం

నా కవితలో వెలుతురు బాకు  గుచ్చాలి..అనే ప్రయోగం ఉంటుంది

చీకటిని చీల్చే వెలుగు "బాకు" లా  ప్రతి హృదిని గుచ్చాలి, స్థబ్ధతని పారద్రోలాలి   వెలుతురు బాకు హింసకి ఆనవాలు కాదు .  చైతన్యానికి ప్రతీక అని భావిస్తున్నాను.

ఇంకా ఈ చిత్రం చిత్ర కళా కారుడి  చేతిలో పడి నాజూకుగా మారాల్సి ఉంది :)

2 వ్యాఖ్యలు:

Padmarpita చెప్పారు...

వెలుతురుబాటకై మీరు సంధించిన వెలుతుబాకు బొమ్మ వివరించిన తీరు బాగుందండి. అభినందనలు!

Sharma చెప్పారు...

మీ వెలుతురు బాకు బాగుంది ,చాకులా పని చేయాలని ఆశిస్తున్నాను , అభినందనలు .