ఎవరున్నారని -వనజ తాతినేని వర్కింగ్ ఉమెన్ కి పది చేతులున్నాయా? ఇంటి పనిలో పురుషుడి భాగస్వామ్యం వుండనవసరం లేదా!?
#వనజ తాతినేని
ఎవరున్నారని -వనజ తాతినేని వర్కింగ్ ఉమెన్ కి పది చేతులున్నాయా? ఇంటి పనిలో పురుషుడి భాగస్వామ్యం వుండనవసరం లేదా!?
#వనజ తాతినేని
ప్రేమ రాహిత్యంతో వొంటరిగా బ్రతుకుతున్న వొక స్త్రీ హృదయవిదారకమైన కథ ఈ ప్రేమ లేఖలు. రష్యన్ కథ. తప్పక వినండీ! Maxim Gorky కథ ఇది.
" ది యాంబియస్ గెస్ట్ " అనేది నథానియల్ హౌథ్రోన్ రాసిన చిన్న కథ . జూన్ 1835లో మొదటిసారిగా ది న్యూ-ఇంగ్లాండ్ మ్యాగజైన్‌లో ప్రచురించబడింది, ఇది 1841లో ట్వైస్-టోల్డ్ టేల్స్ యొక్క రెండవ సంపుటిలో తిరిగి ప్రచురించబడింది .
The Ambitious Guest
Short story by Nathaniel Hawthorne
“అతిథి” పేరుతో N R చందూర్ అనువదించిన కథ ను వినిపించబోతున్నాను.
ఈ కథ చదువుతున్నప్పుడు wayanad landslides గుర్తుకు వచ్చాయి. కథ వినండీ..
కంప్యూటర్ యుగంలో శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం ఆర్జించిన వారు యాప్ లను తయారుచేయగలరు, డిజిటల్ స్క్రీన్ పై ఆటలు ఆడగలరు కారు నడపగలరు యుద్దాలు చేయగలరు పంటలు పండించగలరు. వ్యవసాయదారుడైన తండ్రితో నీ వృతి గొప్పదేమీకాదని తరచూ ఆ సాఫ్ట్ట్వేర్ యువకుడు వాదనాడతాడు. తానూ వ్యవసాయం చేస్తానని ప్రతిజ్ఞ చేసి వ్యవసాయం చేసి వరి పంటను సాగుచేస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది? తప్పక కథ వినండీ.
తాలు-ఎమ్వీ రామిరెడ్డి కథ వినండీ
మన నట్టింట్లో అర చేతిలో తిష్ట వేసుకున్న ఈ భూతాన్ని తరిమేయకపోతే మన బిడ్డలు రాబోయే తరాలు పెద్ద ప్రమాదంలో వున్నట్లే! కథ వినండీ..
నీటి అద్దంలో తనను తాను చూసుకున్న పువ్వు
తన సౌందర్యానికి మూర్చిల్లింది.
తన పరిమళ హృదయాన్ని
ఎవ్వరికి బహుమతిగా ఇవ్వనున్నదో తెలియకున్నది.
హమ్మింగ్ బర్డ్ కా లేక మధుపానికా లేక
సీతాకోకచిలుక కా అని ఆలోచనలో పడింది.
దయ లేని బాల వొకతె తోటలోకి వేంచేసి
చటుక్కున తెంపి జడ లోన తురుముకుంది.
ఔరా!
స్త్రీలు సుకుమారులన్నది ఎంత నిజమో కానీ
పూలను చూడగా వెర్రిగా ప్రవర్తింతురన్నది
సత్యం.
అతనొక రచయిత. అయినా నిత్యశంకితుడు.భర్య పట్ల అతని ప్రవర్తన మనుషులకే కాదు ప్రకృతిలోని మొక్క కు చెట్టుకు పువ్వుకు కూడా అసహ్యం. ఆ పురుషుడి దౌష్ట్యాన్ని పెరటితోటలోని చెట్టు పొద పూసిన వొక పువ్వు కలిసి చెప్పిన కథ.
తప్పకుండా వినండీ..
ఓ రేపిస్ట్ భార్య కథ
అసలు ఇలాంటి కామ తెగులు పట్టుకున్న వారిని శిక్షించాలంటే వొకటే మార్గం. డిల్లీ కేసు వాదిస్తున్న లాయర్ వొక మాటన్నాడు. వీళ్ళకు జైలుశిక్షలు ఉరిశిక్షల కన్నా ముందు రెండు చేతుల బొటనవేళ్ళు కత్తిరించాలని. ఇకపై తల్లి జోలికి వెళితే వీడికి ఈ శిక్షే వేయాలి అనుకుంది.
వనజ తాతినేని ||మూడో మనిషి ||
నిన్ననీవుకనిపించావు
నీతలపులలో నేను ఇంకా..సజీవంగానేఉన్నానని
ఇంకా నీసొంతమనే
బ్రాంతిలోనేఉన్నావని,
స్తబ్దత ఆవరించిన నీ నిస్తేజజీవనంలో
నాతలంపే దారిచూపే దీపమని,
నేను సృష్టించిన నీఎదలోనికార్చిచ్చు
ప్రజ్వలిల్లుతూనే ఉందని,
నాలో నీప్రేమతాలూకు అవశేషాలు
ఏమైనా మిగిలిఉన్నాయేమోనని...
వెతుక్కుంటూ..వచ్చానని అన్నావు
నేను నీకన్నా తక్కువేమీ కాదుకదా!
నేను ఏనాడైనా నీప్రేమను అభిశించనులేదే?అంటూ..
మూడు ముళ్ళబంధం నిప్పుల కుంపటి అయిందని..
మనసు పరాధీన భావనలో..
అతిభద్రంగానే ఉందని, లోలోపల చిద్రమై
పై మెరుగులతో తళుకులీనుతూ...
నిట్టూర్పు సెగల మద్య,
అనాదరణ అనే ఎడారిలో..యానంలో..
ప్రేమ ఒయాసిస్సుకై అన్వేషిస్తుంటే..
ఆకస్మికంగా నీ ప్రేమ..
జీవ నదిలా ప్రత్యక్షమైతే ..
సర్వం మరచి మీనమై విహరించాలని..
అతిగా ఆశించాను...
అంతలో వివేకం వీపు పై చెళ్ళుమని చరచింది..
వయసు ఎలాంటిదైనా.. మనసు పారేసుకోవడం
అనే మంచి - చెడ్డ గుణం..
మనిషికి శాపమే కాదు.. తాపం కూడా!
విచక్షణ మరచినది కూడా!!
కాలం గారడీలు చేస్తుంది.
పేరడీలు సృష్టిస్తుంది.
నీసంగతి నా సంగతి....
కలిపేమాట అటుంచి
కాస్తంత ఆలోచించి చూస్తే సమిధ మాత్రం
నీకు - నాకు మద్య వచ్చిన మూడోమనిషి.
ఆఖరి వరకు అంటి పెట్టుకుంటాననే ఆశతోవచ్చిన మనిషి.
మనమధ్య వచ్చిన మూడో మనిషికి
మరో మూడో మనిషి తారసపడితే !?
(యవ్వనం తాలూకు ప్రేమలని తలచుకుంటూ.. అసంతృప్తులతో.. వేగే భార్య-భర్తల్ని ఉద్దేశించి)
14|12|2012.
వయనాడ్ విపత్తు గురించి ముందే ఊహించిన లయ.
చురాల్ మల కి చెందిన 8 th క్లాస్ చదువుతున్న గత సంవత్సరంలో ఒక వ్యాసం రాసింది. అదే నిజమైంది. కవుల ఊహ కల్పన కావచ్చు కానీ.. సత్యాలు కూడా గ్రహించి హెచ్చరిస్తారు.
ఈ లింక్ లో చదవండీ..
: In a chilling premonition penned by Laya, a ninth standard student at Meppadi GHSS, her story "Agrahathinte Duranubhavam” (The Misery of Desire) in the digital magazine “vellaram Kallukal” seems eerily prophetic following recent tragedies in Mundakkai and Chooralmala.
Laya wrote the story when she was an eighth standard student at Vellarmala GVHSS. The story vividly describes the potential devastation caused by landslides and rising water near waterfalls. Those who read the story wonder if Laya intended it as a . warming. While Laya herself is safe.her loved once are not.
If it rains, landslides will rush down towards the waterfall, engulfing everything in their path, including human lives. Many people have died this way Laya wrote.
In the story, two friends, Anaswara and Alamkrita, sneak away to see a waterfall without their families knowing. A bird approaches the girls who are mesmerized by the water fall’s beauty and warns them to leave immediately. As the children flee and glance back at the mountain, they witness rain cascading down one side, and the parrot transforming into a girl. In Laya’s story. It’s recounted that the bird appeared as a child named Amritha, who tragically perished after falling into the waterfall before.
“Leave, children here comes great danger” the bird urgently advises the girls in the tale.
There are two poems in the magazine that glorify the river, which is an integral part of the students' lives. Children described the waves and warmth of the river through their imagination.Experiences of life near the rever blossomed into stories and poems. Ironically, the rever itself, described by students with most beautiful words caused their deaths. At least a bird arrives with a warning for the girls in Laya’s story. Some readers perceive in Laya’s story an indication that nature warns of certain disasters. But did the people of Mundakkai and Chooralmala receive any warning before the real tragedy.
Mathrubhumi.com నుండి సేకరణ