28, సెప్టెంబర్ 2018, శుక్రవారం

మంచి చెడుల దృష్టిలో

లైంగిక నిర్ణయాల్లో మహిళల ఇష్టాయిష్టాల విషయంలో రాజీకి తావులేదు. ఇష్టపూర్వక శృంగారమనేది మహిళ హక్కు.. ఈ విషయంలో ఆమెకు ఎలాంటి షరతులు పెట్టేందుకు వీలు లేదు.👏👏👏

మనం ప్రపంచాన్ని స్త్రీల కోణంలో నుండి చూసినప్పడు మాత్రమే సమస్యలను బాగా అర్దం చేసుకోగలం. సుప్రీంకోర్టు తీర్పుపై సంప్రదాయవాదుల నిరసన సహజమే. సెక్షనుల రద్దు పురుషులకు శ్రేయస్కరమే.

దాంపత్యజీవనంలో హింస, భాగస్వామిపై విముఖత లేదా అనుమాన బీజాలు. అయితే విడాకులకు అప్లై చేయండి. అంతే కానీ హింసించే హక్కు లేదు.  అలాగే స్తీ కూడా కేస్ పెట్టకూడదు.(తప్పుడు కేస్ ల నేపధ్యం వుంటుంది కాబట్టి) ఈ సెక్షన్ రద్దు ద్వారా పురుషలకు స్త్రీలకు వొకే చట్టం వర్తిస్తుంది.

150 యేళ్ళ క్రిందటి చట్టంలో సెక్షనులు రద్దవడాన్ని  స్వాగతించాలి. ఎందుకంటే ఇప్పటి కాలంలో బ్రతుకుతున్నాం కాబట్టి.మోతాదును మించిన శారీరక మానసిక హింస యెవరికీ ఆమోదయోగ్యం కాదు కాబట్టి.

పెండ్లి ఒక బాండ్. ఇందులో హక్కులు వుంటాయి. సహజీవనంలో అవి వుండవు. స్త్రీ పురుషులు ఎందులో వుండాలన్నది ఎవరికి వారు నిర్ణయించుకుంటారు . ఇంతకుముందు వున్నట్టే ఇకముందు అక్రమ సంబంధాలంటాయి.సమాజం నీతినియమాల అతిక్రమణ దృష్టిలో చూసి లోకం పాడైపోయింది అంటుంది మళ్లీ అందులో అందరూ వుంటారు.

మీడియా వాళ్ళు సంచలన శీర్షికలు పెట్టి అసలు వ్యాఖ్యానాన్ని అడుగున పెట్టారు. Alamuri Sowmya post నుండి తీసుకున్న వివరాలు ఇవి




“నాలుగు గోడల మధ్య జరిగే వ్యవహారాల్లో చట్టం గానీ ప్రభుత్వం గానీ తలదూర్చకూడదు.  స్త్రీ ఎవడి సొత్తూ కాదు.’సుప్రీం కోర్టు తీర్పు.  "husband is not the master of the wife"...(ఇది పాఠ్య పుస్తకల్లో పెట్టేసి అందరిచేత బట్టీ పటించాలి) స్త్రీ ఎవడి సొత్తూ కాదు. స్త్రీకి శ్రంగార స్వేచ్ఛ ఉంది. వివాహేతర శృంగార సంబంధాలు ఆ వ్యక్తులకు మాత్రమే సంబంధించిన విషయాలు. దీన్లో తలదూర్చే హక్కు ఎవరికీ లేదు ఇలాంటి సంబంధాలవల్ల బాధపడ్డ భార్య/భర్తకు తప్ప. బాధపడినవాళ్లు కూడా విడాకులకు అప్ప్లై చేసుకొవచ్చు తప్పితే క్రిమినల్ కేసు పెట్టడానికి వీల్లేదు. వివాహేతర సంబంధాలు సంఘ నీతినియమాలకు వ్యతిరేకం తప్పితే చట్టవ్యతిరేకం కాదు. It can be seen as a breach of contract...ఆ ఒప్పందంలో ఉన్నవాళ్లకు తప్పితే వేరేవ్వరికీ మాట్లాడే హక్కు లేదు. 
ఇది అసలు వ్యాఖ్యానం.

దాంపత్యజీవనంలో స్త్రీ యిష్టాయిష్టాలు, హింస గురించి వ్రాసిన కవిత్వంలో నేను చదివిన కవిత వొకటి. ఈ కవితలో pain అంతా ఆమెది. స్పందన పురుషుడిది. ఈ కవిత Vadrevu China veerabhdhrudu గారు వ్రాసినది. "ఒంటరి చేలమధ్య ఒక్కతే మన అమ్మ" కవితా సంపుటిలో "ఇది మంచిది కాదు" చదవండీ..





ఇప్పడీ కవిత ప్రస్తావన యెందుకు అని అనకండీ. నా దృష్టిలో సాహిత్యం, జీవితం, చట్టం అన్నీ వేరు వేరు కాదు.

24, సెప్టెంబర్ 2018, సోమవారం

ME IN MY SOLITUDE

జగతి జగద్ధాత్రి గారి ఆంగ్ల అనువాదంలో నాకవిత.

ME IN MY SOLITUDE

Who says solitude is loneliness?
It is the hundred thousand’s vision
Of me looking into myself
It’s the great revelation of
Embracing my soul
To describe aloneness is
To chisel the thoughts
To adorn the letters
It’s not filling colors to the paintings
The time
When the lights are off
When the flowers fall down
When the dawn flower blooms
That’s when my solitude mingles
With my aloneness
As the light spreads around the lamp
Around me and in me it’s my solitude that surrounds
Shameless dreams always wait
To disturb my seclusion
As the pains drench the heart book
Solitude is always a brook that never comes to light
Changing the
Hopes that fall as stars
Sweet moments that are held with tact
Moss grown bitter memoirs
Into pebbles
Throws into the ignorant seas
Leaves me ashore
With an over smartness
Not to show any other footprint in my heart forest
With an untouchable attitude
Except for me to touch
Exhausts with the
Labor of umpteen thoughts
Shatters with the explosion of emotions
Flowing as secretions
Breathes in the air of my outer world
Rolling along with the times
Remains a residue
Leaving a little space in my begging bowl
For my tomorrow’s solitude
Holds me as a human
Telugu original : NAA EKAANTHAM LO NENU
English trans: Jagaddhatri … 12.58 pm 24/9/2018 Monday

14, సెప్టెంబర్ 2018, శుక్రవారం

మా వూరి జ్ఞాపకాలలో...

నగరజీవనం నన్నావహించి రెండు దశాబ్దాలు దాటింది. అయినా నన్ను వూరోళ్ళు, యెర్ర బస్సోళ్ళు అని వాఖ్యానించే వాళ్ళు వుంటారు. అప్పుడు నేను నవ్వుకుంటూ మా వూర్లోళ్ళకి వున్న తెలివి,శ్రద్ధ పట్నంలో పెరిగి విమానంలో ఖండాలు దాటిన మీకెక్కడుందిలే అంటాను. విమానం యెక్కడానికి కొద్దిరోజులముందు మా వూరికి వెళ్ళాను. గంట సమయం కూడా స్తిమితంగా కూర్చోలేనితనం. ప్రశాంతత కరువైంది పరిసరాలలోకాదు, నాలో.

పాత నుండి క్రొత్తకి ప్రవహించినప్పుడూ, ప్రవహిస్తూ వున్నప్పుడూ కూడా  యేదో అర్దం కాని సంవేదన.  బహుశ అది వెనుకకు ప్రయాణించలేని వెనుక జీవితంలోకి మరలి వెళ్ళలేని అసక్తత, అనాసక్తి కూడానేమో. ఇక నేనెప్పుడూ “నా జన్మభూమి యెంత అందమైన దేశము. నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము” అని పాడుకోవడానికి బిడియపడతానేమో ... అనుకుంటూనే ఓ జ్ఞాపకం మనసున చెమ్మగిల్లి.. ఇలా అక్షరీకరణ చెందింది.

మా వూరి జ్ఞాపకాలు

గోధూళివేళ నా తిరుగు ప్రయాణంలో.. మా వూరి దృశ్యాలు పద పదే గుర్తుకు వస్తున్నాయి. పరిచయమవసరంలేని ఆ ప్రాంతమంతా పరిచయం చేయాల్సినట్లుగా మారినంత సులువుగా పురా జ్ఞాపకాలు చెరిగిపోవడం బహు కష్టం. బాల్యం గురుతులు, యవ్వనపు తొలినాళ్ళ ఛాయలను విడనాడటం చాలా చాలా కష్టం.

పచ్చని మాగాణమంతా ధాన్యానికి గిట్టుబాటు ధర లేక  ఇటుకలను పండించడం మొదలెట్టింది. గుబ్బగుయ్యంలా వుండే మఱ్ఱి చెట్టు పరిసరాలు రహదారిమీద ప్రయాణించే వాహనాల చప్పుళ్ళని గూబ గుయ్యమనిపిస్తున్నాయి. లైబ్రరీ అరుగులు రాజకీయ పాఠాలను శ్రద్ధగా నేర్పుతున్నట్లు వున్నాయి. గుడిగంట శబ్ధాలలో పవిత్రమైన భావనకు బదులు హోరెక్కువ వినబడుతూ వుంది.

పసుపుృ పచ్చని అందాలను విరబూసిన నల్లతుమ్మల పైన పత్తి చేను పగలబడి నవ్వినట్లున్న తెల్లని మేఘాలు ప్రక్కింటికి పేరంటానికి వెళుతున్నట్లున్న దృశ్యాలను చూసి ఆగి  మరికాసేపు చూడలేని నా వేగవంతమైన జీవితాన్ని ద్వేషించాను.

మనషుల్లో ప్రేమలు కల్తీగా కనబడితే మాన్లే  మారిన పరిసరాలు నాగరికతను అద్దుకున్న జీవనాలు చూడటానికి మనస్సు అంగీకరింలేదు. అందులో స్వార్ధం వున్నా సరే. మన జీవనం, మన ఆలోచనలు యెంత మారినా మన వూరి స్వచ్ఛత అలాగే వుండిపోవాలనే అత్యాశ మరి.

ఆఖరిలో మా వూరందరి నడవలో చెఱువు గట్టుపై నిలబడి అస్తమిస్తున్న సూర్యుని నారింజ కిరణాలను ప్రతిబింబిస్తున్న నీటి బాస నా కంటి చివర చుక్కతో జత కట్టింది ఈ నీటితో నీకు రుణమెప్పుడో తీరిందని గుర్తు చేసిన క్షణాలను... తలచుకుంటూ....

ఇక్కడెక్కడో అట్లాంటా నగరంలో కూర్చుని... మూసుకున్న తలుపురెక్కలను చూస్తూ... అమ్మా... ఉదయాన్నే ఈ తలుపులు తెరిచి... వాకిలి వూడ్చి నీళ్ళుజల్లి ముగ్గు పెట్టవా... అని కోడలిని అడిగిన నా అజ్ఞానాన్ని ఇంకొక తరం నాగరిక జీవనం నవ్వుకునేటట్లు చేసిందేమో కూడా.
ఏది యేమైనా పాత కొత్త తరాల మధ్య ఈ సాంస్కృతిక లంకె నన్ను వర్తమానంలో బ్రతకడానికి అడ్డుకట్ట వేస్తుందని తెలుసుకున్నాను.


మా వూరి చెరువు

7, సెప్టెంబర్ 2018, శుక్రవారం

పిల్లల ప్రపంచంలో కాసేపు

పిల్లల ప్రపంచంలో కాసేపు....

పిల్లలను చూస్తే వేయి పూవులను చూస్తున్నట్లు వుంటుంది సంచరిస్తున్నందుకేమో

జ్వరం మందు తాగడానికి రచ్చ రచ్చ చేస్తున్న చిన్నిపాప పెంకితనం
యేడుస్తూనే తన బొమ్మపై సాధికారత చూపిస్తూ వెనుక దాచుకునే అధికార దర్పం చూస్తుంటే బహు ముచ్చటగా వుంటుంది.

నాన్న భుజాలపై యెక్కి మారాం చేస్తున్న ఇంగ్లీష్ పిల్లాడు,

ఇద్దరు మగ పిల్లలకు శ్రద్దగా తల దువ్వే తండ్రి ప్రేమ

అమ్మ గర్భంలో మోసినట్లు   ..
నాన్న మెడ సంచీలో నెలల బిడ్డని మోస్తూ.. తృప్తిగా గర్వంగా తిరుగుతుంటే
అవధులు లేని ప్రేమకు సాక్ష్యం కనబడుతుంది.

ఇవ్వన్నీ చూస్తున్న నేను పెదాలపై అసంల్పిత దరహాసాలు కురిపిస్తూ..

ఇవే కదా మానవ అనుబంధాలు
ముచ్చటైన భవ బంధాలు అనుకుంటూ..
కొద్ది సమయం  పిల్ల మనసుతో

(Doha Airport లో connecting flight కోసం వేచి చూసున్నప్పుడు చూసిన దృశ్య రూపం )